iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: పోలీసులపై రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఓవర్ యాక్షన్!

  • Published Dec 19, 2023 | 10:05 AM Updated Updated Dec 19, 2023 | 10:59 AM

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా కామన్ మాన్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా కామన్ మాన్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. బిగ్ బాస్ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

  • Published Dec 19, 2023 | 10:05 AMUpdated Dec 19, 2023 | 10:59 AM
Pallavi Prashanth: పోలీసులపై రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఓవర్ యాక్షన్!

బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ఆదివారం 7వ సీజన్ పూర్తి చేసుకుంది. కృష్ణా నగర్ అన్నపూర్ణ స్టూడియో వద్ద బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ విజేతలను ఎంపిక చేశారు నాగార్జున. ఇక బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలవగా, రన్నరప్ గా అమరదీప్ నిలిచాడు. ఈ కార్యక్రమం ఉంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగింది. బిగ్ బాస్ విజేత ఎంపిక తర్వాత విన్నర్స్ బయటికి వస్తే స్వాగతం పలికేందుకు ఫ్యాన్స్ భారీ ఎత్తున మోహరించారు. కొంతమంది తమ అభిమాన కంటెస్టెంట్ కి మద్దతుగా నిలిచి పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్, అమరదీప్ ఫ్యాన్స్ కి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. పోలీసుల పై పల్లవి ప్రశాంత్ ఓవర్ యాక్షన్ కి  సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా ఒక కామన్ మాన్, రైతు బిడ్డ విజేతగా నిలవడం తెలుగు రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆనందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బిగ్ బాస్ సీజన్ 7 కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్, రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. వీరిద్దరూ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చే సమయంలో ఫ్యాన్స్ సందడి బాగా పెరిగిపోయింది. ఒకదశలో ప్రశాంత్ – అమర్ దీప్ మద్దతుదారుల మధ్య గొడవ మొదలై.. రచ్చ రచ్చ అయ్యింది. భారీగా పోలీసులు అక్కడిక చేరుకొని ఫ్యాన్స్ ని తరిమేసి ఎవరి ఇంటికి వారిని పంపించారు. మొదటి నుంచి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చాలా గందరగోళంగా ఉంది.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గీతూ రాయల్, అశ్వినికి సంబంధించిన కార్లు ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఇవన్నీ ప్రశాంత్ ఫ్యాన్స్ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇదిలిలా ఉంటే..  వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది పోలీసుల పల్లవి ప్రశాంత్ కారు వద్దకు వచ్చి వెంటనే ఇంటికి వెళ్లిపోవాలని.. నీ వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కారులో ఉన్న ప్రశాంత్ తాను రైతు బిడ్డ పోలీసులతో అతిగా ప్రవర్తించినట్లు కనిపిస్తుంది. వారితో నేను రైతు బిడ్డను నాకు ఫ్యాన్స్ తో మాట్లాడే హక్కు లేదా అంటూ వితండ వాదం చేశాడు. అంతేకాదు పోలీసులతో ఓవర్ యాక్షన్ చేసినట్లు కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు   మెయిన్ సెంటర్ లో ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు..ఇక్కడ ఇష్యూ చేయకు, మా సహనాన్ని పరీక్షించకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి అక్కడ ఫ్యాన్స్ క్రౌడ్ విపరీతంగా ఉంది.. వారిని ఆపడం కూడా పోలీసులకు చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.