iDreamPost
android-app
ios-app

పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ.. పోలీసులకు అశ్విని, గీతూరాయల్ ఫిర్యాదు

105 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారంతో ముగిసిపోయింది. అయితే ఎన్నడూ లేనంతగా ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోకు వచ్చి రచ్చ రచ్చ చేశారు. విన్నర్ పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య వార్ నడిచింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

105 రోజుల పాటు సాగిన బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారంతో ముగిసిపోయింది. అయితే ఎన్నడూ లేనంతగా ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోకు వచ్చి రచ్చ రచ్చ చేశారు. విన్నర్ పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య వార్ నడిచింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ.. పోలీసులకు అశ్విని, గీతూరాయల్ ఫిర్యాదు

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7కి ఎండ్ కార్డ్ పడింది. అందరూ ఊహించినట్లు, అందరూ ఆశించినట్లు సామాన్యుడు, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కప్ విజేతగా నిలిచాడు. అమర్ దీప్ రన్నరప్‌గా మిగిలాడు. పల్లవి ప్రశాంత్ విన్నర్ తెలిశాక.. అతడిని చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు అభిమానులు. ఈ ఇద్దరి ఫ్యాన్స్ అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వీరిని కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా తలలు పట్టుకున్నారు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడూ చిర్రుబుర్రులాడుకునేవారు అమర్ దీప్, పల్లవి ప్రశాంత్. వీరిద్దరూ ఫైనల్‌కు రావడం ప్రశాంత్ విన్నర్ అయ్యే సరికి అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి అన్నపూర్ణ స్టూడియో వద్ద రచ్చ రచ్చ చేశారు.

ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇదే అదునుగా తీసుకున్న అభిమానుల ముసుగులో కొంత మంది ఆకతాయిలు అమర్ దీప్ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు రాగానే ఆయన కారు అద్దాలు పగులగొట్టారు. దీంతో కారులో ఉన్న అమర్ దీప్ భార్య తేజశ్విని, తల్లి వణికిపోయారు. వద్దని చెబుతున్నా వినకుండా కారుకు అడ్డుపడి మరీ దాడి చేశారు. వారిని బూతులు తిట్టారు. అలాగే అటుగా వెళ్తొన్న ఆర్టీసీ బస్సును కూడా ధ్వంసం చేశారు. అయితే ఇప్పటి వరకు ఇన్ని సీజన్లు జరిగిన ఇంతటి రాద్దాంతం కానీ, ఈ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చి రచ్చ చేయడం జరగలేదు. అలాగే సెలబ్రిటీలపై దాడి జరిగిన ఘటనలు కూడా లేవు. అలాగే బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అశ్విని శ్రీ, బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గీతూరాయల్ కార్లు కూడా డ్యామేజ్ అయ్యాయి.

కాగా, పల్లవి ప్రశాంత్ కారుపై కానీ, అతడిపై కానీ ఎటువంటి దాడి చేయకపోవడంతో ఇదంతా అతడి ఫ్యాన్స్ అని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అమర్ దీప్ దాడి ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తన కారుపై దాడి చేయడం పట్ల ఫైర్ అయ్యారు అశ్విని. తన కారు ఫ్రంట్, బ్యాక్ అద్దాలు పగులగొట్టేశారు ఆగంతకులు. ఫ్యాన్స్ అయితే మాత్రం.. మేము కష్టపడి కొనుక్కున్న వస్తువులపై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. అలాగే గీతూ రాయల్ కూడా మండిపడింది. కంటెస్టెంట్స్ ప్రవర్తన నచ్చక పోతే వారిపై దాడి చేశారనుకోవచ్చు కానీ.. ఆర్టీసీ బస్సును ధ్వంసం చేయడమేంటని సీరియస్ అయ్యింది. వాళ్లంతా పిచ్చివాళ్లని, తన కారుపై ఇద్దరు దాడి చేశారని, వాళ్లని తీసుకు వస్తే రూ. 10 వేలు రివార్డు ఇస్తానని ఆఫర్ చేసింది.

అలాగే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు అశ్విని, గీతూరాయ్. తమ కారు అద్దాలు పగుల గొట్టిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కష్టపడి కొన్న కారు అని, ఇంకా ఈఎంఐలు కడుతున్నామంటూ వాపోయింది గీతూ. అయితే తన కారుపై దాడి చేసింది పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే కాదని, ఎవరో ఆకతాయిల పని అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్. అయితే అభిమానులపై నెటిజన్లు, సిటిజన్లు కూడా తిట్టిపోస్తున్నారు. దాన్నొక షోలా చూడాలని, కానీ ఇలా వ్యక్తిగత దాడి చేయడం సరైన చర్య కాదంటూ మండిపడుతున్నారు. ఫ్యాన్స్ అయితే ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదని, ఓ వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఎటాక్ సమంజసం కాదంటూ పేర్కొంటున్నారు. ఇలా అమర్ దీప్, అశ్విని, గీతూరాయ్ కార్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులే దాడి చేశారని భావిస్తున్నట్లయితే.. అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ashwini Sree (@ashwinii_sree)