iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: అండగా నిలిచిన వారిని మర్చిపోని పల్లవి ప్రశాంత్‌!

పల్లవి ప్రశాంత్‌ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు తాజాగా బెయిల్‌ కూడా మంజూరు చేసింది. ఈ రోజు ప్రశాంత్‌ విడుదల కానున్నాడు.

పల్లవి ప్రశాంత్‌ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్ట్‌ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు తాజాగా బెయిల్‌ కూడా మంజూరు చేసింది. ఈ రోజు ప్రశాంత్‌ విడుదల కానున్నాడు.

Pallavi Prashanth: అండగా నిలిచిన వారిని మర్చిపోని పల్లవి ప్రశాంత్‌!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 7లో విజయం సాధించిన సంతోషం కొన్ని గంటలు కూడా లేకుండానే పల్లవి ప్రశాంత్‌ జైలు పాలైన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ షో గ్రాండ్‌ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గర చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ప్రశాంత్‌ను పోలీసుల అరెస్ట్‌ చేశారు.  ఆయన తరపు లాయర్లు కోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్‌ ఈ రోజు విడుదల కానున్నాడు. ఇక, స్టూడియో దగ్గర గొడవ జరిగిన దానిపై కొందరు సెలెబ్రిటీలు పల్లవి ప్రశాంత్‌పై మొదట ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రశాంత్‌ అరెస్ట్‌ అవ్వగానే.. అందరూ ఒక్కటిగా అతడికి మద్దతు ఇస్తున్నారు. బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్లతో పాటు చాలా మంది ప్రశాంత్‌కు అండగా నిలిచారు. అతడికి మద్దతుగా మాట్లాడారు. స్పై బ్యాచ్‌లో సభ్యులైన ఆట సందీప్‌ మాట్లాడుతూ.. ప్రశాంత్‌​ విషయంలో అలా జరగటం బాధాకరమన్నారు. అతడి కుటుంబసభ్యులతో తాను మాట్లాడానని చెప్పారు. ఆ రోజు బయట ఏం జరుగుతోందో అతడికి సరిగా తెలీదు. తన కోసం వచ్చిన వాళ్లను కలుద్దాం అనుకున్నాడని, 100 రోజుల తర్వాత బయటకు వస్తే.. జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

యావర్‌ కూడా తాజాగా స్పందించాడు.. పల్లవి ప్రశాంత్‌ అరెస్ట్‌ వీడియో చూశానని, డిప్రెషన్‌కు గురయ్యానని తెలిపారు. ప్రశాంత్‌ చాలా మంచివాడని, హౌస్‌లో ఉన్నపుడు అతడ్ని చాలా దగ్గరినుంచి చూశానని చెప్పాడు. అందరూ ప్రశాంత్‌కు సపోర్టు చేయాలని విజ‍్క్షప్తి చేశారు. స్పై సభ్యులు తనకు సపోర్టు చేసి మాట్లాడం, ఈ రోజు బయటకు వస్తున్న నేపథ్యంలో ప్రశాంత్‌ ఓ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. సోదరుడి సహకారంతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త పేరు యాడ్‌ చేశాడు.

కొత్తగా స్పై టీమ్‌ విన్నర్‌ అని యాడ్‌ చేసుకున్నారు. కాగా, ప్రశాంత్‌ నీల్‌ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఏ1గా మారారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణ జరిపిన కోర్టు 15 వేల రూపాయల పూచీ కత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. ప్రశాంత్‌ అరెస్టయిన 48 గంటల్లోనే బెయిల్‌ మంజూరు అయింది. దీనిపై బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ భోలే మాట్లాడుతూ.. ‘‘రైతు బిడ్డకు న్యాయం జరిగింది. 15 వేల పూచీకత్తుతో రెండు షూరిటీ నిబంధనతో బెయిల్‌ వచ్చింది. ప్రశాంత్‌ అరెస్టయిన 48 గంటల్లోనే బెయిల్‌ ఇప్పించిన అడ్వకేట్లకు ధన్యవాదాలు. నిష్పక్షపాతంగా తీర్పు చెప్పిన జడ్జికి పాదాభివందనం’’ అని అన్నారు. మరి, ప్రశాంత్‌కు అండగా నిలిచిన స్పై టీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.