Tirupathi Rao
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉత్కంఠగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ఆట విషయంలో ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఈసారి ఎవరూ కన్ఫామ్డ్ హౌస్ మేట్స్ కాదు అనే సరికి అందరిలో కంగారు కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు హౌస్ మేట్ అవుతామా అంటూ తహతహలాడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని వదలుకోకూడదు అని ఫిక్స్ అయిపోతున్నారు. అందుకే టాస్కు ఏది వచ్చినా ఎక్కడా తగ్గకుండా పోటీ పడుతున్నారు. అలా తాజాగా ఇచ్చిన టాస్కులో అపశృతి చోటుచేసుకుంది. పల్లవి ప్రశాంత్- ప్రిన్స్ యావర్ గాయపడినట్లు తెలుస్తోంది.
వారానికి ఒక టాస్కు ఇచ్చి అందులో విజయం సాధించిన వారికి పవరాస్త్రం కోసం పోటీదారులుగా ఎంపిక చేస్తున్నారు. వారికి తిరిగి మరో టాస్కు పెట్టి అందులో విజయం సాధించిన వారిని హౌస్ మేట్ గా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆట సందీప్, శివాజీ, శోభాశెట్టి హౌస్ మేట్స్ గా ఉన్నారు. ఇప్పుడు నాలుగో పవరాస్త్రం కోసం పోటీదారులను ఎంపిక చేసేందుకు బ్యాంకర్ టాస్కుని పెట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఆ ప్రోమోలో టాస్కు గురించి చెప్పారు. హౌస్ మేట్స్ అయిన సందీప్, శివాజీ, శోభాశెట్టి బ్యాంకర్స్ గా వ్యవహరిస్తారు. కంటెస్టెంట్స్ బీబీ బ్యాంక్ నుంచి కాయిన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
తర్వాత టాస్కులు పెట్టి ఒకరి దగ్గరున్న కాయిన్స్ ని మరొకరికి దక్కేలా చేస్తారు. దానికంటే ముందు కంటెస్టెంట్స్ అందరూ లైన్ లో నిల్చోని బజర్ మోగిన తర్వాత బీబీ బ్యాంక్ బజర్ కొట్టాల్సి ఉంటుంది. ముందు ఎవరు బజర్ కొడతారో వారికి బీబీ కాయిన్స్ లభిస్తాయి. అయితే మొదటి రౌండ్ లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ బజర్ కొట్టే క్రమంలో కింద పడిపోతారు. అమర్ దూరంగా పడినా.. ప్రశాంత్ కి మాత్రం కంటి దగ్గర దెబ్బ తగిలినట్లు కనిపించింది. అతను ముఖానికి చేయి అడ్డం పెట్టుకుని కింద పుడుకుని ఉంటాడు. అది చూసి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ప్రశాంత్ కి ఏమైంది అనే విషయాన్ని చూపించలేదు. కాసేపటికే ప్రిన్స్ యావర్ కూడా లాన్ కింద పడుకుని ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. శుభశ్రీ అది చూసి అందరినీ పిలుస్తుంది. అందరూ ప్రిన్స్ యావర్ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు చూపించారు.
పల్లవి ప్రశాంత్– ప్రిన్స్ యావర్ కి పెద్ద దెబ్బలు తగిలాయా? కంగారు పడాల్సింది ఏమీ లేదా? అనే దానిపై ఎపిసోడ్ లో క్లారిటీ వస్తుంది. ఈ టాస్కుకి సంబంధించి నెట్టింట లీకులు వస్తున్నాయి. ఈ బ్యాంకర్స్ టాస్కులో రతిక-35 కాయిన్స్, ప్రియాంక్- 41, గౌతమ్- 24, ప్రశాంత్-34, ప్రిన్స్ యావర్-43, శుభశ్రీ- 31, అమర్ దీప్-41, తేజ-51 కాయిన్స్ పొందినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫస్ట్ టాస్కు బైక్ రేస్ ఛాలెంజ్ పెట్టగా.. తేజ- రతికలపై గౌతమ్- అమర్ దీప్ విజయం సాధించారని చెబుతున్నారు. ఇద్దరిలో ఒకరి దగ్గరే కాయిన్స్ ఎక్కువ ఉండాలి అని చెప్పగా.. అమర్ దీప్ అతని వద్దనున్న కాయిన్స్ ని గౌతమ్ ఇచ్చేశాడు. నాలుగో పవరాస్త్రం కోసం ఎవరు కంటెండర్లు అవుతారో చూడాలి. మరి.. నాలుగో ఇంటి సభ్యుడిగా ఎవరు విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.