iDreamPost
android-app
ios-app

Bigg Boss Nayani: పల్లవి ప్రశాంత్ మంచోడే.. కానీ, ఆ సమయంలో! : నయని

  • Published Oct 16, 2023 | 4:05 PM Updated Updated Oct 16, 2023 | 4:05 PM
  • Published Oct 16, 2023 | 4:05 PMUpdated Oct 16, 2023 | 4:05 PM
Bigg Boss Nayani: పల్లవి ప్రశాంత్ మంచోడే.. కానీ, ఆ సమయంలో! : నయని

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ నుంచి మొదటి వారమే బయటకు వచ్చిన నయనీ పావని చాలా ఎమోషనల్ అయ్యింది. అసలు తాను ఎలిమినేట్ అవుతానని ఊహించలేదు అని చెప్పింది. తాను టాప్ 5లో ఉంటాను అని అనుకుందని చెప్పుకొచ్చింది. ఓట్లు పడకపోవడం వల్లే తాను ఎలిమినేట్ అయినట్లు భావిచింది. అలాగే హౌస్ మేట్స్ ఆటతీరు గురించి కూడా ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో.. నయని పావని ఇట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మరీ ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ ఆటతీరుపై నయని ఓపెన్ కామెంట్స్ చేసింది.

హౌస్లో ఉన్న వారం రోజులులను తాను బాగా ఎంజాయ్ చేశానని నయని చెప్పుకొచ్చింది. అన్ని టాస్కుల్లో పాల్గొన్నానని.. అందరితో చాలా మంచి బాండింగ్ ఏర్పరుచుకున్నట్లు తెలిపింది. అయితే భోలే షావలి, అశ్వినీ శ్రీలతో మాత్రం అంతగా కలవలకేపోయాను అని చెప్పింది. అశ్వినీ శ్రీతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఆమె కాస్త దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఇంక భోలే ఆట తనకు అస్సలు అర్థం కాలేదని చెప్పుకొచ్చిం. వీళ్లిద్దరు మినహా హౌస్ లో అందరితో కలిసిపోయానని చెప్పింది. ఇంత త్వరగా బయటకు వచ్చేస్తానని అస్సలు ఊహించలేదని నయని తెలిపింది. హౌస్ లో ఉన్న వారి ఆట తీరు గురించి మాట్లాడుతూ.. శివాజీ- ఫాదర్ ఆఫ్ ది హౌస్ అని చెప్పింది. అమర్ కు మంచితనం ఎక్కువైందని.. తాను కాస్త భయపడుతున్నాడని చెప్పింది. అంబటి అర్జున్ చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నట్లు వ్యాఖ్యానించింది. సందీప్ బాగా ఆడుతున్నారని.. కాకపోతే అనవసరంగా గొడవల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంది. ప్రిన్స్ యావర్ హౌస్ లోనే చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పింది.

టేస్టీ తేజ నిద్ర కూడా పోకుండా ఎంటర్ టైన్ చేస్తున్నాడంది. కాస్త సేఫ్ గా కూడా ఆడుతున్న భావన ఉన్నట్లు చెప్పుకొచ్చింది. శోభా శెట్టి ఓటమిని తీసుకోలేకపోతోందని.. ఆ సమయంలో కాస్త మాటలు జారుతోందని తెలిపింది. కానీ, మనిషి చాలా మంచిదని స్పష్టం చేసింది. గౌతమ్ కృష్ణ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. టీమ్ కి మంచి సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. పూజా మూర్తో తాను బాగా కనెక్ట్ అయ్యానంది. భోలే షావలి, అశ్వినీ శ్రీల ఆట మాత్రం తనకి అర్థం కావట్లేదంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ గురించి నయని పావనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రశాంత్ ఫేక్ గేమ్ ఆడుతున్నట్లు తనకి ఏం అనిపించలేదని చెప్పింది. పల్లవి ప్రశాంత్ తో చాలా బాగా కనెక్ట్ అయ్యానంది. హౌస్ లో ప్రశాంత్ చాలా బాగా ఆడుతున్నాడంది. పల్లవి ప్రశాంత్ టాప్ 5లో కూడా ఉంటాడని నయని చెప్పుకొచ్చింది. ప్రశాంత్ ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతున్నాడంది. అతను చాలా పొలైట్ గా ఉంటాడని, ఎవరితోను గొడవపడడని చెప్పింది. కాకపోతే నామినేషన్స్ లో మాత్రమే కాస్త హైపర్ అవుతాడంది. నయని పావని పూర్తి ఇంటర్వ్యూ ఈ కింది వీడియోలో చూడండి. నయని పావనీ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio