Krishna Kowshik
బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటితో తెరపడింది. కానీ ఎన్నడూ లేని విధంగా రచ్చ రచ్చ అయ్యింది. ఫ్యాన్స్ అన్న ముసుగులో ఆకతాయిలు.. వికృత చర్యలకు పాల్పడ్డారు. సెలబ్రిటీ కార్లు ధ్వంసం చేయడం, బస్సుల అద్దాలు పగులకొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటితో తెరపడింది. కానీ ఎన్నడూ లేని విధంగా రచ్చ రచ్చ అయ్యింది. ఫ్యాన్స్ అన్న ముసుగులో ఆకతాయిలు.. వికృత చర్యలకు పాల్పడ్డారు. సెలబ్రిటీ కార్లు ధ్వంసం చేయడం, బస్సుల అద్దాలు పగులకొట్టడం వంటి చర్యలకు పాల్పడ్డారు.
Krishna Kowshik
బిగ్ బాస్ సీజన్ 7 రచ్చ రచ్చగా ముగిసింది. విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చి నానా హంగామా సృష్టించారు. ఆరు బస్సు అద్దాలను పగుల కొట్టారు. ఇది చాలదన్నట్లు..రన్నరప్ అమర్ దీప్ కారుపై కూడా దాడికి దిగారు. కారులో మహిళలు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి కారు అద్దాలు ధ్వంసం చేశారు. అమర్ దీప్ భార్య, తల్లి ఈ మూకల చర్యలతో వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుండి వెళాల్సిన పరిస్థితి. తాగేసిన మత్తులో వారిని బండ బూతులు తిడుతూ..నానా యాగీ చేశారు. అంతే కాకుండా ఈ షోకు వచ్చిన పలువురు సెలబ్రిటీల కార్లు కూడా ధ్వంసం చేశారు ఫ్యాన్స్ ముసుగులో ఉన్న ఆకతాయిలు.
బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ అశ్విని శ్రీ, బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ కమ్ బిగ్ బాస్ బజ్ యాంకర్ గీతూ రాయల్ కారు అద్దాలు పగులగొట్టారు. దీనిపై గీతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘ఇది యాక్సిడెంటల్‌గా జరిగినది కాదు. ఈ రోజు విన్నర్, రన్నర్ ఇంటర్వ్యూ అయ్యింది. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది అయ్యింది. కొంత మంది అల్లరి మూకలు.. డోర్ల దగ్గరికి వచ్చి దబాదబా బాదేసి రచ్చ రచ్చ చేశారు. ఆ అనుభవంతో కాసేపు ఆగి వద్దామని అనుకున్నా. కానీ నాన్న ఆసుపత్రిలో ఉన్నారు. చూద్దామని బయలు దేరా. పోలీసులు కూడా ఉన్నారు. అప్పటికే అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది’ అని చెప్పారు.
‘అయితే వాళ్లంతా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కాదు. ఏ ఫ్యాన్ ఇంత చిల్లరిగా బిహేవ్ చేయరు. సెలబ్రిటీలను చూద్దామని అక్కడ ఉన్న చిల్లర వెధవలు వచ్చారు. వాళ్లే.. నేను కారు తీసుకుని బయటకు రాగానే.. హే గీతూ అంటూ కారు అద్దాలపై డమా డమా అని కొడుతున్నారు. అయితే డోర్లు కొట్టొద్దని చెప్పేందుకు కారు కిటికీ దించగానే.. కొంత మంది చేతులు లోపలికి పెట్టేసి.. నా చేతులు పట్టుకుని, డోర్ లాగేందుకు ప్రయత్నించారు. భయమేసింది’ అంటూ వ్యాఖ్యానించారు. వల్గర్‌గా బిహేవ్ చేశారు. టెన్షన్ పడ్డానని, ఫాస్ట్ గా వెళ్లిపోదామని ట్రై చేసినా, లాభం లేదని, కారు చుట్టూ చేరిపోయారని అన్నారు. ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలాడుకున్నానని పేర్కొన్నారు.
‘సెలబ్రిటీలు అయినంత మాత్రాన కోట్లు ఆస్తులు లేవు. నేను కొనుక్కున్న ఖరీదైన, ఇష్టపడ్డ వస్తువు ఇదే. దీనికి ఇంకా ఈఎంఐలు కడుతూనే ఉన్నాను. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. వాళ్లు పట్టుకుంటే.. వాడ్ని నేను కూడా కొడతా. ఎందుకంటే.. ఐదు డోర్ల నుండి కొడుతూనే ఉన్నారు. అందులో ఒక రెడ్ టీ షర్ట్ వ్యక్తి.. వాడికి బట్టతల ఉంది. మరొకడు అద్దం పగులగొట్టిన వాడు. వీళ్లు కానీ నాకు దొరకాలి. పోకిరీల పనే ఇది. పోనీ నేను, అమర్ నచ్చలేదు అనుకుంటే ఓకే.. కానీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. కావాలనే ధ్వంసం చేశారు. వాళ్లంతా పిచ్చి నా బట్టలు. రెడ్ టీ షర్టు, నా కారు అద్దాలు పగుల కొట్టిన వారిని దొరికి పట్టిస్తే.. రూ. 10వేలు రివార్డు ఇస్తా.’ అని చెప్పారు.
కారులో బట్టలు, నగలు ఉన్నాయని చెప్పారు. కారు ఇంతలా డ్యామేజ్ అయ్యిందని, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయకపోతే.. ఇన్సురెన్స్ కూడా రాదని తెలిపింది గీతూ. కారులోకి చేయిపెట్టి.. వారు నా చేయినే కాదూ.. అదర్ ప్లేసుల్లో కూడా చేయిపెట్టేందుకు ట్రై చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మిర్రర్ పైకెత్తుతుంటే.. చేత్తో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తనతో బిహేవ్ చేశారని తెలిపింది గీతూ రాయల్. అన్ని అద్దాలు మూసేసి ఉంటే.. వెనుక నుండి రాయి తీసుకుని పగుల కొట్టినట్లు పేర్కొన్నారు. ఇంత వల్గారిటీగా బిహేవ్ చేసిన వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో కామెంట్ల రూపంలో తెలియజేయండి.