iDreamPost
android-app
ios-app

శోభా శెట్టికి పనిష్మెంట్ ఇచ్చిన నాగార్జున.. సీజన్ మొత్తం..!

శోభా శెట్టికి పనిష్మెంట్ ఇచ్చిన నాగార్జున.. సీజన్ మొత్తం..!

శోభా శెట్టి.. ఈ పేరుతో చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు. కానీ, డాక్టర్ మోనితా అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ కన్నడ బ్యూటీకి తెలుగు బుల్లితెరలో ఎంతో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంక సోషల్ మీడియా ఉన్న ఫాలోయింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ షోలో మోనితా సెంటర్ అట్రాక్షన్ అవుతుంది అనడంలో డౌటే లేదు. స్టేజ్ మీద కూడా తన పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇంక హోస్ట్ నాగార్జున అయితే మోనితను పొగడ్తలతో ముంచేస్తూనే పాపం పనిష్మెంట్ కూడా ఇచ్చేశాడు.

ఈ సీజన్ మొత్తం ఉల్టా పుల్టా ఉంటుందని ముందే చెప్పారు. చెప్పినట్లుగానే నాగార్జున్ అన్నీ ఉల్టా పుల్టానే చేస్తున్నారు. ఈ షో స్టార్టింగ్ లోనే రూ.35 లక్షలు ఆఫర్ చేసి అందరికీ కళ్లు బైర్లు కమ్మేలా చేశారు. ఈ సీజన్ లో ప్రతి వస్తువుని తామే సంపాదించుకోవాలి అంటూ టాస్కులు పెట్టేస్తున్నారు. అలాగే ఎవరూ కూడా కన్ఫామ్ హౌస్ మేట్ కాదని షాకిచ్చారు. పవరాస్త్రను అందుకున్న వాళ్లే హౌస్ మేట్స్ అవుతారని చెప్పారు. ఇప్పటి వరకు హౌస్ లోకి వచ్చిన 14 మంది సభ్యుల్లో ఇంకా ఎవరూ ఫైనల్ కాదని చెప్పారు.

ఇంక శోభా శెట్టికి అయితే లోపలికి పంపక ముందే సీజన్ మొత్తానికి సరిపోను పనిష్మెంట్ ఇచ్చి పంపారు. తనకు అందిన కాంప్లిమెంట్స్ ట్రోల్స్ గురించి చెప్పమని అడిగారు. అప్పుడు మోనితా తనని అందరూ బుల్లితెర రమ్యకృష్ణ అంటూ ట్రోల్ చేస్తారని చెప్పింది. అయితే నిజంగా చాలా మంచి కాంప్లిమెంట్ అంటూ కింగ్ నాగార్జున్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కాంప్లిమెంట్స్ ఏంటని అడగ్గా.. కాంప్లిమెంట్స్ అంటే మీరు చాలా అందంగా ఉంటారు, హాట్ గా ఉంటారు, బ్యూటిఫుల్ గా ఉంటారు అని చెబుతూ ఉంటారని చెప్పింది. అయితే హౌస్ లో ఎవరైనా శోభా శెట్టిని హాట్ గా ఉన్నావు, బ్యూటిఫుల్ గా ఉన్నావు అంటే మాత్రం శోభా శెట్టికే పనిష్మెంట్ ఇస్తానంటూ చెప్పేశాడు. దాంతో పాపం మోనితా బిక్క మొహం వేసింది. ఇందేంటి సార్.. కాంప్లిమెంట్ ఇస్తే పనిష్మెంట్ ఏంటని ప్రశ్నించింది. అందుకు నాగార్జున ఉల్టా పుల్టా అంటే ఇదే మరి అంటూ నవ్వేశాడు.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş