iDreamPost
android-app
ios-app

రైతు బిడ్డపై నాగార్జున సీరియస్! తలదించుకున్న పల్లవి ప్రశాంత్!

  • Author ajaykrishna Published - 10:55 AM, Sun - 17 September 23
  • Author ajaykrishna Published - 10:55 AM, Sun - 17 September 23
రైతు బిడ్డపై నాగార్జున సీరియస్! తలదించుకున్న పల్లవి ప్రశాంత్!

గత సీజన్లతో పోల్చుకుంటే బిగ్ బాస్ రియాలిటీ షో 7వ సీజన్ చాలా ఇంటరెస్టింగ్ గా మొదలైందని ఆడియన్స్ తేల్చేశారు. ఇదివరకటి సీజన్ల కంటే బెటర్ గా సాగుతుందని.. షో మొదలైన మూడు వారాలకే పరిస్థితులు రసవత్తరంగా మారిపోయాయని అంటున్నారు. ఎప్పటిలాగే కింగ్ నాగార్జున హోస్ట్ గా అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఈ వారం కంటెస్టెంట్స్ మధ్య జరిగిన వాదనలు.. గొడవలు నెక్స్ట్ లెవెల్ ఇంటరెస్ట్ క్రియేట్ చేశాయి. ఎందుకంటే.. వీకెండ్ లో హోస్ట్ నాగ్ ఎలా రియాక్ట్ అవుతారో అని. నామినేషన్స్ లో అయితే తెగ హడావిడి జరిగిపోయింది.

ఇక నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్, అమరదీప్, శివాజీ, ప్రియాంక, రతిక.. వాదించుకున్న తీరు అందరిని షాక్ కి గురిచేసింది. అయితే.. వీకెండ్ అయిందిగా హోస్ట్ కింగ్ నాగ్ కొత్త ప్రోమోతో వచ్చేశాడు. అప్పటిదాకా జరిగిన వాటికి సంబంధించి ప్రతీ ఒక్కరికి కౌంటర్స్ వేసేశాడు. ఈసారి శివాజితో పాటు అమరదీప్, పల్లవి ప్రశాంత్ లకు స్ట్రాంగ్ డోస్ ఇచ్చేసాడని చెప్పాలి. ఇంతకీ కొత్త ప్రోమోలో ఏం ఉందంటే.. బిగ్ బాస్ వారమంతా ఎలా ఉన్నా.. వీకెండ్ లో మాత్రం చాలా ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే.. తప్పులుంటే తగిలించే నాగ్.. మంచి చేస్తే మెచ్చుకుంటాడు కూడా. సో.. ఈసారి కూడా అదే జరిగింది. కానీ.. ఉల్టా పుల్టా అన్నట్లుగా డిఫరెంట్ గా సాగింది.

కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ పై అమరదీప్ అరిచిన విధానంపై నాగ్ చురకలు అంటించాడు. అతడి డబ్బులు ఎవరికైనా ఇచ్చుకుంటాడు అని ప్రశాంత్ కి పాజిటివ్ గా మాట్లాడాడు. కట్ చేస్తే.. ప్రశాంత్ వంతు వచ్చేసరికి ఊహించని ట్విస్టు ఇచ్చి.. గట్టిగా కౌంటర్ వేసాడు. హౌస్ లో అడుగుపెట్టినప్పుడు రైతుబిడ్డ ప్రశాంత్ కి ఓ మొక్క ఇచ్చాడు నాగ్. అయితే.. దాన్ని ప్రశాంత్ సరిగ్గా పట్టించుకోకపోవడంతో అది వాడిపోయి.. ఆకులు రాలిపోయి కనిపించింది. దీంతో పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడాక, మొక్క విషయం ప్రస్తావించి సీరియస్ అయ్యాడు నాగ్. ఒక మొక్కను సరిగ్గా కాపాడలేకపోయావ్.. నువ్వు రైతు బిడ్డవా? అన్నాడు. దీంతో ప్రశాంత్ తలదించుకున్నాడు. ప్రెజెంట్ ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది. మరి ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో చూడాలి. బిగ్ బాస్ 7 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetMadridbetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş