iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయనీ పావని ఎవరంటే?

  • Published Oct 09, 2023 | 2:03 PM Updated Updated Oct 09, 2023 | 2:03 PM
  • Published Oct 09, 2023 | 2:03 PMUpdated Oct 09, 2023 | 2:03 PM
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయనీ పావని ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0 స్టార్ట్ అయ్యాక ఇప్పుడు నిజంగా ఉల్టా పుల్టా సీజన్ గా అనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఐదుగురు కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డుల రూపంలో పంపలేదు. అలాగే ఒక సీజన్ కు రెండుసార్లు లాంఛింగ్ ఈవెంట్లు జరగలేదు. అలాగే ఐదువారాలు వరుసగా ఐదుగురు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం కూడా ఈ సీజన్ లోనే జరిగింది. సుబ్బు కూడా ఎలిమినేట్ కావడంతో.. హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ అందరూ వెళ్లిపోతున్నారు. షో ఎలా చూడాలి అంటూ నెట్టింట తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అలాంటి వారిలో నయని పావని రూపంలో కొత్త ఆశ చిగురించింది అనే చెప్పాలి. అయితే చాలా మంది అసలు ఈ నయని పావని ఎవరు అంటూ తెగ వెతికేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి ఆదివారం వైల్డ్ కార్డుల రూపంలో అంబటి అర్జున్, అశ్వినీ శ్రీ, పూజా మూర్తి, భోలే షావలి, నయని పావని హౌస్ లోకి వచ్చారు. వీరిలో మాటలు, సమాధానాల పరంగా చూసుకుంటే అంబటి అర్జున్, నయని పావని కాస్త స్ట్రాంగ్ ప్లేయర్లలాగా కనిపించారు. ముఖ్యంగా నయని పావని బ్యూటి విత్ బ్రెయిన్ లాగా కనిపిస్తోంది. తను చెప్పాలి అనుకున్న విషయాన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా చెబుతోంది. ఈ ముద్దుగుమ్మ అందానికే కాదు.. ఐడియాలజీకి కూడా బిగ్ బాస్ ప్లేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే అసలు ఈ నయని పావని ఎవరు అంటూ వెతుకులాట మొదలు పెట్టేశారు.

 

View this post on Instagram

 

A post shared by Swetha Naidu (@swethaa_naidu)

నయని పావని అలియాస్ సాయి పావని రాజు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అనే చెప్పాలి. ఆమె సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్, యాక్టర్, డాన్సర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే టాలెంట్స్ ఉన్నాయి. టిక్ టాక్ వీడియోల ద్వారా నయని పావని బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ద్వారా అభిమానులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత డాన్స్ వీడియోలు, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లతో బాగా పాపులర్ అయింది. ఫొటో షూట్లు, ఫారన్ ట్రిప్పులు అంటూ ఆమె పెట్టే పిక్స్ కోసం కుర్రకారు ఎగబడుతూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో నయని పావని చాలా గొప్ప ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. బిగ్ బాస్ అవకాశం దక్కించుకున్నప్పుడే మీరు అర్థం చేసుకోవాలి.. నయని పావనీలో కచ్చితంగా విషయం ఉందని.

 

View this post on Instagram

 

A post shared by Sai Pavani Raju (@nayani_pavani)

ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా.. ఆ ఫ్యాన్ బేస్ ని వాడుకుని నయని పావనీ ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇలాంటి స్టేజ్ లో ఆమెకు బిగ్ బాస్ రూపంలో చాలా గొప్ప అవకాశం వచ్చిందనే చెప్పాలి. మరి.. ఆ అవకాశాన్ని ఎలా వాడుకుంటుందో ఆమె చేతుల్లోని ఉంది. ఇప్పటికే రతికా రోజ్ లాంటి వాళ్లకు.. సరైన వ్యూహం లేకపోవడం వల్ల ప్రేక్షకుల్లో ఎంత నెగిటివిటీ ఏర్పడిందో అందరూ చూశారు. దీన్ని బట్టి బిగ్ బాస్ హౌస్ లో ఎంత క్రేజ్ ఉందని కాదు.. ఎంత జాగ్రత్తగా ఆడుతున్నాం అనేది ముఖ్యం. ఆ విషయంలో నయయని పావనీ జాగ్రత్తగా ఆడే అమ్మాయిలాగానే కనిపిస్తోంది. పైగా హౌస్ లో ఎవరు ఎలాంటి గేమ్ ఆడుతున్నారు అనే విషయంపై పిచ్చ క్లారిటీతో ఉంది. కాబట్టి ఈమె హౌస్ లో ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తుంది? ఎవరిని టార్గెట్ చేస్తుంది? అనే విషయాలపై ఆమె గేమ్ ఆధారపడి ఉంటుంది. మరి.. నయని పావని బిగ్ బాస్ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse)

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş