iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: ఫ్రెండ్ షిప్ పోయింది.. ఇక నుంచి శత్రువులుగా..!

Bigg Boss 7 Telugu: ఫ్రెండ్ షిప్ పోయింది.. ఇక నుంచి శత్రువులుగా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పవరాస్త్ర టాస్కుతో ఆట మొత్తం హీటెక్కింది. నాలుగో పవరాస్త్రం కోసం ఏడుపుగొట్టు టాస్కులో విజయం సాధించిన ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ నాలుగో పవరాస్త్రం కోసం కంటెండర్లు అయ్యారు. తర్వాత మూడో కంటెండర్ కోసం ఒక టాస్కు ఇచ్చారు. ఇంట్లో ఉండే వస్తువులను వాడుకుని వింతగా, విచిత్రంగా వేషధారణ వేసుకోవాలని చెప్పారు. ఆ టాస్కులో విజయం సాధించి శుభశ్రీ మూడో కంటెండర్ అయ్యింది. అయితే ఈ టాస్కు వల్ల హౌస్ లో మిత్రులు శత్రువులుగా.. శత్రువులు బద్ద శత్రువులుగా మారారు. అసలు ఏం జరిగిందో చూద్దాం.

ఈసారి ఉల్టా పుల్టా సీజన్ అని చెప్పి హౌస్ లో ఉన్న వాళ్లంతా కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే.. బిగ్ బాస్ హౌస్ మేట్స్ కాదని ముందే చెప్పారు. అందుకోసం గతంలో ఉండే వీక్లీ టాస్కుల ప్లేస్ లో వపరాస్త్రం టాస్కులు పెడుతున్నారు. ఇప్పుడు 5 వారాలపాటు వారానికి ఒక టాస్కు పెట్టి దానిలో విజయం సాధించిన వారికి పవరాస్త్రం కోసం పోటీపడే అవకాశం ఇస్తారు. అందులో గెలిస్తే పవరాస్త్రం గెలిచి హౌస్ మేట్ అవుతారు. ఇప్పటికే సందీప్, శివాజీ, శోభాశెట్టి హౌస్ మేట్స్ అయిపోయారు. ఇప్పుడు నాలుగో పవరాస్త్రం కోసం పెట్టిన బీబీ హౌస్ టాస్కులో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ గెలిచారు. మూడో కంటెండర్ కోసం వేషధారణ టాస్క్ ఇచ్చారు. అందులో కంటెస్టెంట్స్ చిత్ర విచిత్ర వేషాలు వేసి నానా రచ్చ చేశారు. వేషధారణ టాస్కులో అందులో శుభశ్రీ విజయం సాధించింది అని ప్రకటించారు. దాంతో అమర్ దీప్ కు ఎక్కడిలేని ఆగ్రహం వచ్చేసింది. కాస్త చూసుకుని అనౌన్స్ చేస్తే బాగుంటుంది అనే తరహాలో సీరియస్ అయ్యాడు.

నామినేషన్స్ సమయంలో శుభశ్రీ రోటీస్ అని బోర్డు పెట్టుకో అంటూ అమర్ దీప్ కామెంట్ చేశాడు. ఇప్పుడు ఆమె ఆ థీమ్ తోనే రోటీ రాణిగా గెటప్ వేసుకుంది. హౌస్ లో ఉండే వాటిని ఉపయోగించుకుని విచ్రంగా రెడీ అవ్వమన్నారు. అమర్ దీప్ మాత్రం సగం గడ్డం తీసేసి అర్ధనారీశ్వరుడు గెటప్ వేశాడు. అయితే అక్కడ అమర్ దీప్ లాజిక్ మిస్ అయ్యాడు అనిపించింది. శుభశ్రీ మాత్రం తనపై వచ్చిన విమర్శలను కాన్సెప్ట్ గా తీసుకుని రోటీ రాణి గెటప్ వేసింది. అక్కడ సంచాలకులకు బాగా నచ్చింది. అందుకే శుభశ్రీని విన్నర్ గా అనౌన్స్ చేయాలి అనుకుంటున్నాం అంటూ సందీప్ చెప్పబోయాడు. అందుకు అమర్ నాకు ఒక డౌట్ ఉంది. ఆ తర్వాత మీరు చెప్పండి అంటూ లేచాడు. ఎంటర్ టైన్మెంట్ అక్కడ మీకు ఏం దొరికింది? నేను ఏం ఇవ్వలేదు చెప్పండి అంటూ ప్రశ్నించాడు. కావాల్సిన వాళ్లకి ఇచ్చుకుంటూ పోవడం కాదన్నా అంటూ కామెంట్ చేశాడు. శివాజీ కూడా రూల్స్ ప్రకారం సుబ్బు ఇన్నోవేటివ్ గా అనిపించింది అంటూ చెప్తాడు.

వాడుకోమని చెప్పారు గానీ.. అవే వాడుకోవాలి అన్నట్లు చెప్పలేదంటూ అమర్ దీప్ ఫైర్ అయిపోయాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ కాస్తా శత్రువులు అయిపోయారని అర్థమైంది. నిజానికి ఫస్ట్ డే నుంచి సందీప్- అమర్ కలిసే ఆడుతున్నారు. వాళ్లిద్దరూ ఒకే గ్రూప్ లో ఉన్నారు. కానీ, ఇవాళ మాత్రం అమర్ సందీప్ ని ఇష్టానికి నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ గొడవ వల్ల వాళ్ల మధ్య దూరం పెరుగుతుందా? లేదా? అనేది ఇప్పుడు చాలా ఆసక్తిగా మారబోతోంది. అలాగే శివాజీకి అమర్ కి ఉన్న వైరం ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. తెలిసిన వాళ్లని ప్రశ్నించడం లేదు. కావాల్సిన వాళ్లతో గొడవకు దిగడం లేదు అని వచ్చిన నిందలు పోగొట్టుకునేందుకు అమర్ తన ప్రవర్తనను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. అయితే గొడవ పడటంలో తప్పులేదు.. కానీ, గొడవకు లాజిక్ తప్పకుండా ఉండాలి. అదే విషయాన్ని అమర్ మిస్ అయినట్లు కనిపిస్తోంది. మరి.. అమర్- సందీప్ మళ్లీ ఫ్రెండ్స్ అవుతారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి