iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ గొడవపై నాగార్జునను టార్గెట్ చేస్తూ.. నారాయణ షాకింగ్ కామెంట్స్!

  • Published Dec 18, 2023 | 7:50 PM Updated Updated Dec 18, 2023 | 7:50 PM

CPI Narayana On Bigg Boss 7 Telugu & Host Nagarjuna: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఈ తరుణంలో సీపీఐ నారాయణ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై సీరియస్ కామెంట్స్ చేశారు.

CPI Narayana On Bigg Boss 7 Telugu & Host Nagarjuna: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఈ తరుణంలో సీపీఐ నారాయణ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై సీరియస్ కామెంట్స్ చేశారు.

  • Published Dec 18, 2023 | 7:50 PMUpdated Dec 18, 2023 | 7:50 PM
బిగ్ బాస్ గొడవపై నాగార్జునను టార్గెట్ చేస్తూ.. నారాయణ షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ ని పల్లవి ప్రశాంత్ గెలిచాడు అనే వార్త కంటే కూడా.. ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్ కు టైటిల్ గెలిచాడనే ఆనందం కొన్ని గంటలు కూడా ఉండేలా లేదు. ఎందుకంటే ఆ గొడవ చేసింది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని ఫ్యాన్స్ వల్లే ఇంత గొడవ జరిగిందంటూ విమర్శలు చేస్తున్నారు. సెలబ్రిటీలు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. అయితే ఒక్క సీపీఐ నారాయణ మాత్రం భిన్న స్వరాన్ని వినిపిస్తున్నారు. మరోసారి హోస్ట్ నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యాన్ని టార్గెట్ చేస్తూ నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు.

“బిగ్ బాస్ కు సంబంధించి పెద్ద గలాబా అయ్యింది. కుర్రాళలు కొట్టుకున్నారు. సజ్జనార్ లాంటి వాళ్లు వచ్చి ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారని కేసులు పెడతామంటున్నారు. అసలు బిగ్ బాస్ షో అనేది ఒక అరాచకమైన షో. దానికి పర్మిషన్ ఇవ్వడమే తప్పు. మళ్లీ అందులో కప్పుకొట్టారని బయట గొడవలు చేసుకుని ఆర్టీసీ బస్సులు పగలగొడితే కేసులు పెడతామంటున్నారు. నేను సజ్జనార్ ను సూటిగా అడుగుతున్నా.. మీరు కమిషనర్ గా ఉన్నప్పుడు నేనే స్వయంగా వచ్చి ఈ బిగ్ బాస్ అనేది ఒక క్రైమ్.. దాని మీద యాక్షన్ తీసుకోండని అడిగాను. మూడ్రోజులు తర్వాత నేను చేయలేను కోర్టుకు పోమన్నారు. కింది కోర్టుకు పోతే కొట్టేసి పైకోర్టుకు వెళ్లమన్నారు. పోలీసులు డిపార్ట్ మెంట్ భయపడే, కోర్టులు భయపడే. ఏ బిగ్ బాస్ అనేది అంత ఆదర్శమైనదా? దానిలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. నీచాతినీచమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.

కేవలం డబ్బుల కోసం కక్కుర్తి పడి నాగార్జునలాంటి వాళ్లు యాంకర్ గా చేస్తున్నారు. బీజేపీ ఒకవైపున హిందూ ధర్మశాస్త్రం, భారతీయ సంస్కృతి అంటున్నారు. ఇది భారతీయ సంస్కృతిలో భాగమా? పాశ్చత్య దేశాల్లో ఉండే షోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఒక రైతు బిడ్డను తీసుకొచ్చారు. అతనికి రూ.40 లక్షలు ప్రైజ్ మనీ ఇచ్చారు. పట్టణాల్లో వాళ్లు చూస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వారిని కూడా అట్రాక్ట్ చేసేలా రైతు బిడ్డను తీసుకొచ్చారు. బయట ఏమో కొట్లాట పెట్టారు. దీనికి అంతా కారణం బిగ్ బాస్ చేసిన నాటకం. అసలు ఈ బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలి” అంటూ సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నారాయణ మొదటి నుంచి ఈ షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి సీజన్ కి ఆయన షో మీద, నాగార్జున మీద సీరియస్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఈ షోని అసలు బ్యాన్ చేయాలని డిమాంట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి బిగ్ బాస్ షో, బిగ్ బాస్ యాజమాన్యం మీదనే కాకుండా హోస్ట్ నాగార్జున మీద కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ గొడవ, రైతు బిడ్డ టైటిల్ కొట్టడం అంతా ఒక డ్రామా అంటూ ఘాటు విమర్శలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బిగ్ బాస్ షోని చూసేలా ప్రేరేపించడానికే ఇలాంటి పనులు చేశారంటూ నారాయణ కామెంట్స్ చేశారు. మరి.. బిగ్ బాస్ షో, నాగార్జున మీద సీపీఐ నారాయణ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet giriş