Venkateswarlu
Venkateswarlu
బుల్లి తెరప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటినుంచి ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే షోలో కంటెస్టెంట్లుగా అందరికీ తెలిసిన వాళ్లే అడుగుపెట్టారు. వీరిలో ఎక్కువ మంది సీరియల్స్ నటీ,నటులు కావటం విశేషం. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో అడుగుపెట్టిన 14 మందిలో సీరియల్ నటుడు, మోడల్ ప్రిన్స్ యావర్ కూడా ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిన ప్రిన్స్ యావర్ గురించి పూర్తి వివరాలు మీకోసం..
20 ఏళ్లకే మోడలింగ్..
ప్రిన్స్ యావర్ 1996 జూన్ 12న హైదరాబాద్లో జన్మించాడు. చిన్నతనం నుంచి ప్రిన్స్‌కు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా మంచి నటుడ్ని కావాలని అతడు కలలు కనేవాడు. హైదరాబాద్‌లోని సెయింట్ జోషఫ్ డిగ్రీ,పీజీ కాలేజీలో చదువుతున్న సమయంలోనే జిమ్‌లో అడుగుపెట్టాడు. తన భవిష్యత్తు కోసం బాడీ సిద్ధం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మోడలింగ్‌లోకి కూడా అడుగుపెట్టాడు. మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
హిందీ సీరియల్‌తో నటనవైపు..
ప్రిన్స్ యావర్ 2017లో తన బుల్లితెర ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. చంద్రకాంత అనే హిందీ సీరియల్‌లో నటించాడు. ఆ తర్వాత తెలుగులో ‘నా పేరు మీనాక్షి’ అనే సీరియల్‌లో కూడా నటించాడు. ఇదే ఇతడి తొలి తెలుగు సీరియల్. తర్వాత తెలుగులో మరిన్ని సీరియల్స్‌లో నటించాడు. హిట్లర్‌గారి పెళ్లాం, కలిసి ఉంటే కలదు సుఖం, అభిషేకం సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం సీరియల్సే కాదు.. పలు సినిమాల్లోనూ ఆయన నటించారు.
తన దైన శైలి నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రిన్స్‌కు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో వేల మంది ఆయన్ని అనుసరిస్తున్నారు. ఇలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ప్రిన్స్ బిగ్‌బాస్ తెలుగు నిర్వాహకుల దృష్టిని సైతం ఆకర్షించాడు. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు. ఇక, బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన ఈ కండల వీరుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో వేచి చూడాల్సిందే. మరి, ప్రిన్స్ యావర్ బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తాడని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.