Venkateswarlu
అతడు ఓటింగ్‌లో.. ప్రశాంత్, అమరదీప్‌ల తర్వాత మూడో స్థానంలోకి వచ్చేశాడు. దీంతో ఎలిమినేషన్ తప్పింది. ఇక, మూడో స్థానంలో ఉన్న గౌతమ్ ఐదో స్థానానికి పడిపోయాడు.
అతడు ఓటింగ్‌లో.. ప్రశాంత్, అమరదీప్‌ల తర్వాత మూడో స్థానంలోకి వచ్చేశాడు. దీంతో ఎలిమినేషన్ తప్పింది. ఇక, మూడో స్థానంలో ఉన్న గౌతమ్ ఐదో స్థానానికి పడిపోయాడు.
Venkateswarlu
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. ఏడో వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. సాధారణంగా ఆదివారం ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది. కానీ, ఈ సారి శనివారమే ఎలిమినేషన్‌ను ముగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం కూడా ఓ లేడీ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. ఇలా చూసుకుంటే.. వరుసగా ఏడవ వారం కూడా ఎలిమినేట్ అవుతున్నది ఓ లేడీనే. ఈ సారి నామినేషన్స్ లిస్టులో పల్లవి ప్రశాంత్, అమరదీప్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, పూజామూర్తి, అశ్విని, భోలె షావళి నిలిచారు. వీరిలో పల్లవి ప్రశాంత్, అమరదీప్ సేఫ్ జోన్‌లో ఉన్నట్లే.. ఎందుకంటే ఓటింగ్ పరంగా వీరిద్దరూ టాప్‌లో ఉన్నారు.
మిగిలిన 5 గురిలోనే ఎలిమినేషన్ జరగనుండటంతో.. ఎవరా అన్న సస్పెన్స్ నెలకొని ఉండింది. ఆ సస్పెన్స్‌కు తెరపడినట్లు కనిపిస్తోంది. ఓ ట్విస్ట్ కూడా చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆడవాళ్ల మీద అసభ్య కామెంట్లు చేసిన భోలె షావళి ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే, అలా జరగలేదు. అతడు ఓటింగ్‌లో.. ప్రశాంత్, అమరదీప్‌ల తర్వాత మూడో స్థానంలోకి వచ్చేశాడు. దీంతో ఎలిమినేషన్ తప్పింది. ఇక, మూడో స్థానంలో ఉన్న గౌతమ్ ఐదో స్థానానికి పడిపోయాడు. నాల్గవ స్థానంలో తేజ ఉన్నాడని సమాచరం.
ఇక, మిగిలిన రెండు స్థానాల్లో అశ్విని, పూజా మూర్తి ఉన్నారు. ఈ ఇద్దరిలో కూడా పూజామూర్తికి తక్కువ ఓటింగ్ ఉంది. దీన్ని బట్టి చూస్తే.. పూజామూర్తే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పూజామూర్తే ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వరుసగా ఏడో సారి కూడా లేడీనే ఎలిమినేట్ అయిందని తెలియటంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలియాలంటే.. ఎలిమినేషన్ ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరి, పూజామూర్తి ఎలిమినేట్ అయినట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.