iDreamPost
android-app
ios-app

Barrelakka: బర్రెలక్క క్రేజ్ మాములుగా లేదుగా.. ఏకంగా ‘బిగ్ బాస్’ ఓటీటీ 2 కంటెస్టెంట్‌గా

  • Published Dec 31, 2023 | 7:11 PM Updated Updated Dec 31, 2023 | 7:11 PM

బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్న శిరిష పేరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె పేరు మార్మొగిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్న శిరిష పేరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమె పేరు మార్మొగిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

  • Published Dec 31, 2023 | 7:11 PMUpdated Dec 31, 2023 | 7:11 PM
Barrelakka: బర్రెలక్క క్రేజ్ మాములుగా లేదుగా.. ఏకంగా ‘బిగ్ బాస్’ ఓటీటీ 2 కంటెస్టెంట్‌గా

మన దగ్గర బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాలో ముందుగా హిందీలో ప్రారంభమయ్యి.. ఆ తర్వాత.. అన్ని ప్రముఖ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఏడు సీజన్ లు కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతు బిడ్డ, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అమర్ దీప్ రన్నరప్ గా కొనసాగాడు. అయితే ఉల్టా పుల్టా అంటూ ప్రారంభమైన ఈ సీజన్.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో కూడా సరికొత్త పంథా అనుసరించింది. మిగిలిన సీజన్ లతో పోలిస్తే.. మంచి రేటింగ్, వ్యూయర్షిప్ సంపాదించుకుంది. ఇక విన్నర్ ప్రకటన తర్వాత కూడా గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అమర్ దీప్ కారుపై దాడి చేసి.. వెంబడించారు. మిగిలిన కంటెస్టెంట్ల కార్ల మీద దాడి చేయడం మాత్రమే కాక.. లేడీ కంటెస్టెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారు. ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో అతనిపై కేసు నమోదు కావడం, రిమాండు ఖైదీగా వెళ్లడం, బెయిల్ మీద బయటకు రావడం అన్నీ చకా చకా జరిగిపోయాయి. ప్రస్తుతానికి బిగ్ బాస్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కి సంబంధించిన వార్తలు తెగ వైరలవుతున్నాయి.

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్.. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అనే పేరుతో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. 2022 ఫిబ్రవరీలో ఇది మొదలయ్యింది. బిగ్ బాస్ ఓటీటీ అంటే అది కేవలం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లోనే ప్రసారం అవుతుంది.. టీవీలో టెలికాస్ట్ అవ్వదు. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2ను కూడా దాదాపు జనవరి, ఫిబ్రవరీలో ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే ఓటీటీ సీజన్ 2కి సంబంధించి కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయడం కూడా ప్రారంభించారట. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ అయినట్టు సమాచారం. వీరిలో శిరీష అలియాస్ బర్రెలక్క కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఏడాది బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. సంచలనంగా మారింది. ఎన్నికల్లో అయితే ఓడిపోయింది కానీ.. జనాల్లో మాత్రం అంతకు మించిన క్రేజ్ సంపాదించుకుంది. ఈక్రమంలోనే బర్రెలక్కకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని వార్తలు వైరల్ అయ్యాయి. మామూలుగా ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో ఎవరో ఒక సోషల్ మీడియా స్టార్.. కంటెస్టెంట్‌గా వస్తారు. ఈసారి ఆ కేటగిరిలో బర్రెలక్క అలియాస్ శిరీష వచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ టీమ్.. ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. బర్రెలక్కతో పాటు బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న భోళే షావలి కూడా ఓటీటీ సీజన్ 2లో కంటెస్టెంట్ గా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇది వాస్తవమో కాదో తెలియాలంటే.. కొన్ని రోజులు ఎదురు చూడాలి.