iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ OTT-2.. నయనీ పావనీకి మరో ఛాన్స్!

  • Published Jan 01, 2024 | 8:35 PM Updated Updated Jan 01, 2024 | 8:35 PM

Bigg Boss OTT Season 2 Contestants: బిగ్ బాస్ కి సంబంధించి ఏ వార్త వచ్చినా అది నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కి సంబంధించి కొన్ని పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి.

Bigg Boss OTT Season 2 Contestants: బిగ్ బాస్ కి సంబంధించి ఏ వార్త వచ్చినా అది నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కి సంబంధించి కొన్ని పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి.

  • Published Jan 01, 2024 | 8:35 PMUpdated Jan 01, 2024 | 8:35 PM
బిగ్ బాస్ OTT-2.. నయనీ పావనీకి మరో ఛాన్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అయితే అట్టహాసంగా ముగిసింది. తెలుగు ప్రేక్షకులు అందరూ మరో సీజన్ ఎప్పుడూ అంటూ ఇప్పటి నుంచే ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి మాత్రం చాలా సమయం ఉందనే చెప్పాలి. కానీ, తెలుగు బుల్లితెర ప్రేక్షకులను నిరుత్సాహ పరచకుండా ఉండేందుకు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2ని ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్ గట్టిగా విపిస్తోంది. ఫిబ్రవరి నెలలోనే ఈ బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 ప్రారంభం అవుతుందని కూడా బల్లగుద్ది చెబుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. పాల్గొనబోయేది కూడా వీళ్లే అంటూ కొన్ని పేర్లను నెట్టింట వైరల్ చేస్తున్నారు. వారిలో ఇప్పుడు నయనీ పావని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2కి సంబంధించి ఇప్పుడు బజ్ బాగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ బిగ్ బాస్ ఓటీటీ గురించే చర్చలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక ఆరుగురు కంటెస్టెంట్స్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పాట బిడ్డ భోలే షావలి, సింగర్ పార్వతీ, డాన్స్ మాస్టర్ యష్, నటుడు భద్రం, సోనియా దీప్తీ, హీరోయిన్ రీచా పనాయ్ పేర్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వీళ్ల తర్వాత తాజాగా తెలంగాణ ఎన్నికల్లో ఇండిపెడెంట్ గా పోటీ చేసిన బర్రెలక్క పేరు కూడా కంటెస్టెంట్స్ లిస్టులో వినిపిస్తోంది. ఇప్పుడు వీళ్లందరినీ పక్కకు నెడుతూ ఇన్ ఫ్లుఎన్సర్, డాన్సర్ నయనీ పావనీ పేరు వైరల్ అవుతోంది. ఆమె బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో పాల్గొనబోతోంది అంటూ లీకులు వస్తున్నాయి. ఈ విషయంపై నయనీ పావనీ ఎక్కడా కామెంట్స్ చేయలేదు. అలాగని ఖండించింది కూడా లేదు.

బిగ్ బాస్ సీజన్ లోకి అడుగుపెట్టే వాళ్లు ఎక్కడా కూడా కామెంట్స్ చేయరు. తాము వెళ్లబోతున్న విషయాన్ని అస్సలు రివీల్ చేయరు. సైలెంట్ గా స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చేస్తారు. అయితే నయనీ పావనీ విషయంలో మాత్రం ఒక అంచనాకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వైల్డ్ కార్డు రూపంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి నయనీ పావనీ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి అడుగుపెట్టింది మొదలు తన ఆట, పాట, మాట, డాన్సులతో అందరినీ అలరించింది. కేవలం ఒకే ఒక్క వారంలోనే ఎక్కడలేని అభిమానాన్ని సొంతం చేసుకుంది. బయట ఉన్న ఆడియన్స్ మాత్రమే కాదు.. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా నయనీ పావనీ ఎలిమినేట్ అయ్యిందంటే నమ్మలేకపోయారు. ఆమె రీఎంట్రీ ఇస్తుందని, ఇవ్వాలని ఎంతో మంది కోరుకున్నారు. కానీ, అది సాధ్యం కాలేదు.

హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నయనీ పావనీ దాదాపు రెండు వారాలపాటు ఏడుస్తూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే నయనీకి మరో అవకాశం ఇవ్వాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను బిగ్ బాస్ ఓటీటీ 2 కోసం తీసుకుంటే షో మీద కూడా అభిమానుల్లో అంచనాలు పెరుగుతాయని అంచనాకి వచ్చారట. గతంలో ఐడ్రీమ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా నయనీ పావనీ చేసిన కామెంట్స్ చూస్తే.. మరో అవకాశం వస్తే తప్పకుండా బిగ్ బాస్ కి వెళ్తానంటూ చెప్పుకొచ్చింది. కాబట్టి ఓటీటీ ఆఫర్ గనుక వస్తే నయనీ పావనీ తప్పకుండా వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మరి.. నయనీ పావనీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2లో పాల్గొంటో బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet