iDreamPost
android-app
ios-app

Pallavi Prashanth: ఫలించిన బిగ్ బాస్ ప్లాన్.. నాలుగో హౌస్ మేట్ గా ప్రశాంత్!

Pallavi Prashanth: ఫలించిన బిగ్ బాస్ ప్లాన్.. నాలుగో హౌస్ మేట్ గా ప్రశాంత్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో నాలుగో హౌస్ మేట్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఏదైతే సాధించాలి అని హౌస్ లోకి వచ్చాడో అది సాధించి చూపించాడు. పల్లవి ప్రశాంత్ హౌస్ మేట్ కావడంతో అతని ఫ్యాన్స్, ఫాలోవర్స్, బిగ్ బాస్ ప్రేక్షకుల్లో చాలా మంది ఆనందిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ఎంతమంది టార్గెట్ చేసినా కూడా అతను చాలామందితో పోలిస్తే బెటర్ గా ఆడి హౌస్ మేట్ అయ్యాడు అంటున్నారు. ఫస్ట్ సారి బజర్ కొట్టే సమయంలోనే కంటికి దెబ్బ తగిలినా.. చివరి వరకు పోరాడి కంటెస్టెంట్ అయ్యాడు, హౌస్ మేట్ కూడా అయ్యాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ, పల్లవి ప్రశాంత్ విజయం కొంతమందికి మాత్రం అస్సలు నచ్చడం లేదు.

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో అందరి మధ్య పోటీ ఉంటుంది. ఆ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. అయితే పల్లవి ప్రశాంత్ మీద రతికా, అమర్ దీప్ లకు పోటీ కంటే కూడా కుళ్లు, పగ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రశాంత్ ని డైవర్ట్ చేసేందుకు రతికా, అమర్ ఎంత డ్రామా చేశారో చూశాం. బిగ్ బాస్ చెప్పాడు అనే వంకతో మనసులో ఉన్నదంతా కక్కేశారు. కానీ, ప్రశాంత్ మాత్రం ఎంతో ఫోకస్డ్ గా ఉండి ఆటను గెలిచాడు. తర్వాత మెయిన్ టాస్కులో కూడా చాలా స్ట్రాంగ్ గా నిలిబడ్డాడు. మొదటి టాస్కులో శుభశ్రీ, ప్రిన్స్ యావర్ ని కన్విన్స్ చేసేందుకు చాలానే కష్టపడ్డాడు. ఎవరూ కాంప్రమైజ్ కాకపోవడంతో చివరకు వేరే టాస్కు పెట్టారు.

అందులో ప్రశాంత్ ఎంతో బ్యాలెన్స్డ్ గా ఉండి టాస్కు గెలిచి నాలుగో హౌస్ మేట్ గా నిలిచాడు. ఆ తర్వాత అమర్ దీప్- రతిక ముఖంలో నెత్తురు చుక్కలేదు. వారిలో ప్రశాంత్ హౌస్ మేట్ కాకూడదు ఎంతలా అనుకున్నారో ఆ లుక్ చూస్తే తెలిసిపోతుంది. నిజానికి సిపంథీ గేమ్ ఆడే ప్రశాంత్ ని అమర్- రతికాలాంటి వాళ్లే హీరోని చేశారు. టార్గెట్ చేసి ప్రేక్షకులకు దగ్గర చేశారు. ఇప్పుడు హౌస్ మేట్ ని కూడా చేశారు. అయితే ఇక్కడ ప్రశాంత్ హౌస్ మేట్ కావడం వెనుక.. బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ కూడా ఉంది. ప్రశాంత్ ని హౌస్ మేట్ చేసేందుకు బిగ్ బాస్ కూడా బాగానే హెల్ప్ చేశాడు అని చెప్పచ్చు. అర్థం కాలేదా? ఇప్పుడు ఈ లాజిక్ వింటే మీకే అర్థమవుతుంది.

పల్లవి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టే టాస్కు ద్వారా కంటెండర్ అయ్యాడు. ఆ టాస్కులో ప్రిన్స్ యావర్ తో కలిసి ఆడి విజయం సాధించాడు. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఉంది. ప్రిన్స్ యావర్, ప్రశాంత్ బజర్ కొట్టడానికి ముందే మాట్లాడుకున్నారు. నువ్వు బజర్ కొడితే నన్ను పార్టనర్ గా తీసుకో.. నేను బజర్ కొడితే నిన్నే పార్టనర్ గా తీసుకుంటాను అని. శుభశ్రీ కూడా పార్టనర్ గా ప్రశాంత్ నే తీసుకో అంటూ చెప్పింది. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ బజర్ కొట్టాడు. ఇక్కడ బిగ్ బాస్ ఫస్ట్ ఛాలెంజ్ లాగా పార్టనర్ ని చెప్పాక టాస్క్ చెప్పలేదు. అసలు టాస్క్ ఏంటో చెప్పి ఆ తర్వాత ప్రిన్స్ యావర్ ని పార్టనర్, అపోనెంట్స్ ని సెలక్ట్ చేసుకోమంది. అంటే ప్రిన్స్ యావర్.. ప్రశాంత్ పేరు చెప్పిన తర్వాతే ఈ ఏడుపుగొట్టు టాస్కు ఇచ్చినట్లు అయింది.

హౌస్ మొత్తంలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఏడుపు అనే పదం రాగానే పల్లవి ప్రశాంత్ పేరే గుర్తొస్తుంది. అందుకే పల్లవి ప్రశాంత్ పేరు రావాలి అనే ఈ టాస్కు ఇచ్చారు అనిపిస్తోంది. బిగ్ బాస్ తెలిసి చేసినా.. తెలియక చేసినా కూడా ఆ టాస్కు ద్వారా ప్రశాంత్ కి మేలు చేసిన వ్యక్తి అయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ తన కృషి, పోరాట పటిమతో హౌస్ మేట్ కాగలిగాడు. ఇక్కడ ప్రశాంత్ కష్టం కూడా ఉంది. కానీ, బిగ్ బాస్ ఇచ్చిన విచిత్రమైన టాస్కే ఇప్పుడు ప్రశాంత్ ని హౌస్ మేట్ చేసింది. ఇంత వరకు ఇంత ఫన్నీ, విచిత్రమైన, ఏడుపు టాస్కుని బిగ్ బాస్ చరిత్రలోనే చూడలేదు. మరి.. పల్లవి ప్రశాంత్ హౌస్ మేట్ కావడం వెనుక బిగ్ బాస్ ప్లాన్ ఉంది అని మీరు కూడా అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by BIGG BOSS Trollers™ (@bb7trollers)