Dharani
Bigg Boss 7 Winner Pallavi Prashanth బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి రికార్డు క్రియేట్ చేసిన పల్లవి ప్రశాంత్.. బయట మాత్రం పరువు పోగొట్టుకున్నాడు. కారణమేంటంటే..
Bigg Boss 7 Winner Pallavi Prashanth బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి రికార్డు క్రియేట్ చేసిన పల్లవి ప్రశాంత్.. బయట మాత్రం పరువు పోగొట్టుకున్నాడు. కారణమేంటంటే..
Dharani
బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. కామన్ మ్యాన్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ టైటిల్ విజేతగా నిలిచి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. కప్పు కోసం అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ల మధ్య టఫ్ ఫైటే నడిచింది. స్వల్ప తేడాతో ప్రశాంత్ విజేతగా నిలవగా.. అమర్ దీప్ రన్నరప్ గా మిగిలాడు. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడమే తన జీవితం ధ్యేయం అని చెప్పుకున్న పల్లవి ప్రశాంత్.. కప్పు సాధించి.. సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఓ సామాన్యుడు సాధించిన విజయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. సుమారు 15 వారాల పాటు బిగ్ బాస్ హౌజ్ లో ఉంటూ.. ఎంతో కష్టపడి టాస్క్ ల్లో విజయం సాధిస్తూ.. చివరకు విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. బయటకు అడుగు పెట్టగానే పరువు పోగొట్టుకున్నాడు. కారణమేంటంటే..
బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. తన అభిమానుల కారణంగా పరువు పొగొట్టుకున్నాడు. ఫైనల్ ఎపిసోడ్ లో భాగంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు చాలా మంది నిన్న రాత్రి కృష్ణానగర్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. అలాగే, అమర్ దీప్ అభిమానులు కూడా భారీ ఎత్తున వచ్చారు. స్టూడియో బయట వారంతా రచ్చ రచ్చ చేశారు. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానుల మధ్య గొడవలు జరిగాయి. ఒకరినొకరు కొట్టుకున్నారు.
ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుల మీద కూడా వీళ్లు దాడులు చేశారు. ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టి నానా హంగామా సృష్టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగిన వారిని చెదరగొట్టారు. వీరంతా కంటెస్టెంట్ల వాహనాలను మాత్రమే కాక.. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడం గమనార్హం. జరగిన సంఘటనలు చూస్తే.. వీళ్లు అసలు వీళ్లు అభిమానాలా లేకపోతే అల్లరి మూకలా అనే అనుమానం కలగక మానదు.
బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారును చుట్టుముట్టి దాని అద్దాలు పగలగొట్టారు. అంతటితో ఆగక.. కారు మీదకు ఎక్కి రణరంగం చేశారు. కారులో ఆడవాళ్లు, వయసు మీద పడిన వారు ఉన్నారనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. పెద్ద పెద్ద రాళ్లను ఎత్తుకు వచ్చి కార్ల మీద వేస్తూ.. భయంకరంగా ప్రవర్తించారు. వారి తీరు చూస్తే.. పాత పగలు తీర్చుకునే వారు ఎలా ప్రవర్తిస్తారో.. అలా ప్రవర్తించారు అంటున్నారు స్థానికులు. అలాగే, ఇంకొంత మంది అభిమానులు.. మిగతా కంటెస్టెంట్ల కార్లను కూడా ధ్వంసం చేశారు.
గీతూ రాయల్, అశ్వినిల కార్లను ధ్వంసం చేశారు. వారితో అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించారు. కష్టపడి కొనుకున్న కార్లు అన్నా వినలేదు.. చేతులు పట్టుకుని లాగారు అంటూ గీతూ రాయల్ ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో వారిద్దరూ కేసు నమోదు చేశారు. ఇక బిగ్ బాస్ అభిమానులు ఆర్టీసీ బస్సులపై దాడులు చేయడాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సైతం తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. ఇది అభిమానమా అంటూ మండిపడ్డారు. ఏది ఏమైనా బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. తన అభిమానులు వల్ల పరువు పొగొట్టుకున్నాడు. పైగా ఈ సంఘటనలపై ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.
ఇదేం అభిమానం!
బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023