Dharani
బిగ్ బాస్ షో ద్వారా ఎంత మంచి ఆదరణ తెచ్చుకున్నాడో.. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల వచ్చిన పేరంతా పొగొట్టుకున్నాడు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో జైలుకు వెళ్లడానికి ముందు ప్రశాంత్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు
బిగ్ బాస్ షో ద్వారా ఎంత మంచి ఆదరణ తెచ్చుకున్నాడో.. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల వచ్చిన పేరంతా పొగొట్టుకున్నాడు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో జైలుకు వెళ్లడానికి ముందు ప్రశాంత్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు
Dharani
బిగ్ బాస్ రియాలిటీ షోకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా అనేక భాషల్లో ఈ షో రన్ అవుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బిగ్ బాస్ షోకు మంచి ఆదరణ ఉంది. అయితే ఇప్పటి వరకు.. మన దేశంలో బిగ్ బాస్ చరిత్రలో.. ఓ కామన్ మ్యాన్ అందునా అన్నదాత టైటిల్ విన్నర్ కావడం ఎక్కడా జరగలేదు. మొదటిసారి.. తెలుగు బిగ్ బాస్ షో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ అనే ట్యాగ్ తో హౌస్‌లో అడుగుపెట్టిన అతడు ఎంతో వినయంగా ఉంటూ అందరి మనసులు గెలుచుకున్నాడు.
టాస్క్ ల్లో విజృంభిస్తూ ఇతర కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చాడు ప్రశాంత్. అంతిమంగా సెలబ్రిటీలను అందరిని వెనక్కు నెట్టి బిగ్‌బాస్ 7 టైటిల్ గెలిచాడు. విజేతగా నిలవడమే కాక కామన్ మ్యాన్ గెలిచాడు అనే రికార్డు కూడా క్రియేట్ చేశాడు. అయితే ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ గంటల వ్యవధిలోనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట కంటెస్టెంట్ల కార్లపై, ప్రభుత్వ ఆస్తులపై దాడి జరిగింది. ఈ క్రమంలో పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేసిన పోలీసులు పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడు రాజును అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్ విధించి చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే అరెస్ట్ కావడానికి ముందు పల్లవి ప్రశాంత్ మీడియాతో మాట్లాడాడు. అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేశాడు. అంతేకాక కొందరు కావాలనే తనను నెగిటివ్ చేస్తున్నారని.. తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఏదైనా జరిగితే.. ఆ ఐదుగురిదే బాధ్యత అన్నాడు.
అరెస్ట్ అవ్వడానికి కొద్ది సమయం ముందు పల్లవి ప్రశాంత్ అసలేం జరిగిందనేదానిపై వివరణ ఇస్తూ ఓ మీడియా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. దీనిలో ప్రశాంత్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక.. “నాకు తిండీ, నిద్ర సరిగ్గా లేవు. కొంచెం ఫ్రీ అయ్యాక మీకు గంటలు గంటలు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను. దాంతో ఇంటర్వ్యూ ఇవ్వలేదని కొందరు ఏదేదో మాట్లాడారు. అది చాలా తప్పు. ఆ నలుగురైదుగురి ఫోటోలు, వీడియోలు మావాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్లు నన్ను కావాలనే నెగెటివ్ చేస్తున్నారు. నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే వారిదే బాధ్యత” అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్.
ప్రశాంత్ మాట్లాడుతూ.. “బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నాకోసం వచ్చిన జనాన్ని చూసి నేను షాక్ అయ్యాను. నాకు ఇంత మంది సపోర్ట్ చేస్తున్నారా అని అనుకున్నాను. వారితో మాట్లాడదామని అనుకునేలోపు.. పోలీసులు నన్ను వెనుక గేట్ నుంచి వెళ్లమన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నాకోసం అంతమంది వచ్చారు.. నేను దొంగలాగా వెనుక నుంచి వెళ్లను.. ముందు గేట్ నుంచే వెళ్తానని చెప్పాను” అని చెప్పుకొచ్చాడు.
“వాళ్లు ఇంకా ఏమని చెప్పారో ఆ వాహనాల శబ్దాల మధ్య నాకు సరిగా వినబడలేదు. వాళ్లు నా మంచి కోసమే చెప్పారు.. కానీ అప్పుడు నాకు ఏదీ సరిగా వినబడలేదు. దాంతో నేను అలాగే ముందుకు వెళ్లాను. ఇక కొందరు కావాలనే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నాకేదైనా అయినా, నా ఇంట్లోవాళ్లకు ఏదైనా జరిగినా ఆ ఐదుగురి ఫోటోలు బయటకు వస్తాయి” అన్నాడు పల్లవి ప్రశాంత్.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ రోజున.. అన్నపూర్ణ స్టూడియో బయట అభిమానుల దాడుల వల్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వీటన్నింటిని పరిశీలించిన బిగ్ బాస్ యాజమాన్యం.. పోలీసులు సాయంతో.. బ్యాక్ డోర్ గుండా పల్లవి ప్రశాంత్ ని బయటకు పంపించారు. అంతేకాక శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంత్‌ను అక్కడ ఆగకుండా వెంటనే వెళ్లిపోమ్మని సూచించారు పోలీసులు.
కానీ ప్రశాంత్ మాత్రం రైతుబిడ్డకు విలువిస్తలేరంటూ పోలీసులనే వీడియోలు తీస్తూ దురుసుగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లిపోయిన కాసేపటికే పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చాడు. దాంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే.. పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.