Tirupathi Rao
Bigg Boss 7 Title Winner Prediction: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి మజిలీకి చేరుకుంది. ఓటింగ్ లో ఎవరు దూకుడుగా ఉన్నారు? ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో చూద్దాం..
Bigg Boss 7 Title Winner Prediction: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆఖరి మజిలీకి చేరుకుంది. ఓటింగ్ లో ఎవరు దూకుడుగా ఉన్నారు? ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో చూద్దాం..
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 దాదాపు ముగిసినట్లే. ప్రస్తుతం అభిమానులు తమ ఫేవరెట్ ప్లేయర్ ని గెలిపించుకునేందుకు తెగ ఓట్లు గుద్దేస్తున్నారు. హాట్ స్టార్ యాప్ లో ఒక ఓటు.. మిస్డ్ కాల్ ద్వారా కూడా ఒక ఓటు వేసే అవకాశం ఉంటుంది. నిజానికి తమ తమ కంటెస్టెంట్స్ కోసం ప్రేక్షకులు వేస్తున్న ఓట్ల హడావుడి ఎలా ఉంది అంటే మిస్డ్ కాల్ ఇద్దామంటే లైన్స్ కూడా కలవడం లేదు. అంత రద్దీగా ఫోన్ లైన్స్ ఉంటున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి 13 రోజులకు ఓటింగ్ లైన్స్ ని ఓపెన్ చేసి పెట్టారు. రెండువారాలు వచ్చిన ఓట్లలో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విన్నర్ అవుతారని చెప్పారు. మరి.. ఓటింగ్ లో ఎవరి హవా కొనసాగుతోంది? ఎవరు ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయో చూద్దాం.
కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన పల్లవి ప్రశాంత్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఒక్క వారం అయినా హౌస్ లో ఉండగలడా అంటూ అందరూ అనుకున్నారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫినాలే వీక్ కి చేరుకున్నాడు. హౌస్ లో ఏ టాస్కు ఉన్నా తన ఎఫర్ట్స్ తో విజయం సాధిస్తూ వచ్చాడు. రైతు బిడ్డ అనే ట్యాగ్ తో హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రశాంత్.. ఆ పేరుకు న్యాయం చేశాడని అందరూ అనుకుంటున్నారు. తన ఆట, మాట, కవితలతో ప్రేక్షకులను అలరించాడు. ఎక్కడా కూడా లైన్ క్రాస్ కాకుండా.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో అందరికీ చూపించాడు. మంచి కంటెస్టెంట్ అనే బిరుదుని హౌస్ మేట్స్ ద్వారా కూడా పొందాడు.
మన వాయిస్ ఎక్కడ వినిపించాలో అక్కడే వినిపించేవాడు. నామినేషన్స్ లో తగ్గేదేలే అంటూ ఎదురు ఎవరున్నా కూడా విరుచుకుపడ్డాడు. ఎవరు ఏమనుకున్నా తాను తీసుకున్న స్టాండ్ మీద నిలబడి చూపించాడు. నిజానికి పల్లవి ప్రశాంత్ ఇప్పటికే ప్రేక్షకుల హృదయాల్లో విన్నర్ అయిపోయాడనే చెప్పాలి. ఇంక ఓటింగ్ లో కూడా రైతు బిడ్డ హవా కొనసాగుతోంది. నిజానికి దాదాపు అన్ని నామినేషన్స్ లో రైతుబిడ్డ టాప్ ఓటింగ్ తో నెగ్గుకొచ్చాడనే చెప్పాలి. అతనికి స్వతహాగానే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ ఇప్పుడు బిగ్ బాస్ లో బాగా అక్కరకు వచ్చింది. మల్లొచ్చినా అంటే తగ్గేదేలే అంటూ టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. ఒకవేళ రైతు బిడ్డ టైటిల్ కొడితే.. కామన్ గా వచ్చి చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు.
అమర్ దీప్ చౌదరి.. బిగ్ బాస్ లోకి వెళ్లేటప్పటికే అమర్ కు బయట మంచి పేరు ఉంది. టైటిల్ ఫేవరెట్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు. కానీ, మొదటి నాలుగు వారాల్లో ఆటలో కాస్త తడబడ్డాడు. అతనికి ఆట అర్థం కాలేదనే చెప్పాలి. చాలా విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఆ తర్వాత తన ఆటను మార్చేశాడు. ఎంటర్ టైనర్ గా, డాన్సర్ గా, ఫైటర్ గా తనని తాను నిరూపించుకున్నాడు. దాదాపు అన్ని వారాల్లో నామినేషన్స్ లో ఉన్నాడు. కేవలం ఒక్క వారం మాత్రమే అమర్ కు నామినేషన్స్ నుంచి విశ్రాంతి దొరికింది. కానీ, ఎక్కడా తన ఫ్యాన్స్ తనని తక్కువ చేయలేదు. అదిరిపోయే ఓటింగ్ తో సేవ్ చేసుకుంటూనే వచ్చారు.
ఇప్పుడు కూడా అమర్ ని టైటిల్ రేసులో పెట్టింది అతని అభిమానులు అనే చెప్పాలి. అలాగే అమర్ అమాయకత్వం, అతని ఫైటింగ్ స్పిరిట్ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. అతను టైటిల్ ఫేవరెట్ అనే విషయాన్ని ప్రూవ్ చేశారు. ప్రస్తుతం వస్తున్న ఓటింగ్ లో అమర్ హవా కూడా కొనసాగుతూనే ఉంది. అతను టైటిల్ రేసులో టాప్ 3 ప్లేస్ లోనే కొనసాగుతున్నాడు. ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే అతను విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి ఇప్పటివరకు తాను తీసుకున్న స్టాండ్ మీద నిలబడ్డాడు. తన అనుకున్న వారికి సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. ప్రేక్షకులకు కూడా అదే పాయింట్ బాగా నచ్చింది.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో శివాజీనే పెద్ద. ఆటలో, మాటలో, ఓటింగ్ లో కూడా ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు. ఎక్కడా కూడా తగ్గకుండా ఓటింగ్ లో దూసుకెళ్తున్నాడు. మొదటి నుంచి తాను తీసుకున్న స్టాండ్ మీద శివాజీ నిలబడ్డాడు. యావర్, ప్రశాంత్ కు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఆ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వెనక్కి తగ్గలేదు. ప్రేక్షకుల దృష్టిలో కూడా ఆ విషయం రిజిస్టర్ అయిపోయింది. చేయి నెప్పి బాధిస్తున్నా కూడా అతను పోరాడిని తీరుకు ఆడియన్స్ ఫ్లాట్ అయిపోయారు. మధ్యలో కొన్నివారాలు శివాజీ తన మాటలతో కాస్త ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా అమర్, తేజ, సందీప్, శోభా, ప్రియాంక ఇలా వీళ్ల విషయంలో కొన్ని మాటలు జారాడు. ఇటీవల కూడా ఆడపిల్లల విషయంలో చేసిన కామెంట్స్ కాస్త నెగిటివిటీని మూటగట్టాయి. కానీ, నాగార్జున సలహా మేరకు వారికి సారీ చెప్పి తిరిగి ఓటింగ్ రేసులో తన హవా కొనసాగిస్తున్నాడు. పెద్దన్నగా మాత్రమే కాకుండా చాణుక్యుడు అనే బిరుదు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే టైటిల్ గెలుస్తాడా? అంటే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. వాటిని కూడా అధిగమించి శివాజీ టైటిల్ కొడితే చరిత్ర సృష్టించినట్లే అవుతుంది.
అంబటి అర్జున్ వైల్డ్ కార్డుగా హౌస్ లోకి అడుగుపెట్టాడు. హౌస్ లోకి వచ్చిన ఆరోవారం నుంచే అభిమానుల మన్ననలు పొందడం ప్రారంభించాడు. తాను ఎందుకు బిగ్ బాస్ కి వచ్చాను అనే క్లియర్ క్లారిటీ అర్జున్ కి ఉంది. తన గోల్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఏ టాస్కు పెట్టినా కూడా కండతోనే కాకుండా బుర్రతో కూడా ఆడుతూ ఉంటాడు. ఎక్కడ వాయిస్ లేపాలో అక్కడే అరిచాడు. అమర్ వెల్ విషర్ కాబట్టే హౌస్ లోకి రాగానే తన ఆటను సరిచేసుకోమని సలహా ఇచ్చాడు. తమ్ముడులాంటి వాడని ఎక్కడా పక్షపాతం చూపించలేదు. నిజానికి అమర్ తో కంటే కూడా యావర్, ప్రశాంత్, శివాజీలతోనే ఎక్కువ సమయం గడిపాడు. కానీ, అమర్ కు అవసరం వచ్చినప్పుడు మాత్రం తన సపోర్ట్ ఇచ్చాడు.
ఒక జెన్యూన్ ప్లేయర్ గా.. సింగిల్ ప్లేయర్ గా అర్జున్ తన ఆట ఆడుతూ వచ్చాడు. కానీ, అర్జున్ ఒకటే మైనస్ అయ్యింది. అతనికి ఓటింగ్ తక్కువ రావడం. ఫినాలే అస్త్ర గెలవకపోతే అర్జున్ ఎలిమినేట్ అయ్యేవాడు అనే మాట నాగార్జున రివీల్ చేశాక అందరికీ క్లారిటీ వచ్చింది. బయట అర్జున్ ఓటింగ్ తక్కువ ఉందని. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీగా రావడం కూడా అర్జున్ కు మైనస్ అయ్యింది. అదే మొదటి వారమే హౌస్ లోకి అడుగుపెట్టుంటే అర్జున్ టైటిల్ విన్నర్ అయినా అయ్యేవాడు. కానీ, ఇప్పుడు మాత్రం తక్కువ ఓటింగ్ తో ఇబ్బంది పడుతున్నాడు.
ఎలాంటి అంచనాలు లేకుండా.. ఫ్యాన్ బేస్ లేకుండా హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో యావర్ ముందు వరసలో ఉంటాడు. అసలు అతను ఇన్ని వారాలు హౌస్ లో ఉంటాడని ఎవ్వరూ ఊహించలేదు. బిగ్ బాస్ కూడా ఇతడిని సెలక్ట్ చేసే సమయంలో ఇది ఊహించి ఉండరు. కానీ, ఒక ఫైటర్లా హౌస్ లో పైచేయి సాధించాడు. ఏ టాస్కు వచ్చినా కూడా కండతో నెగ్గుకువచ్చేవాడు. భాష రాకపోయినా తన వాయిస్ ని బలంగా వినిపించేవాడు. నిజానికి యావర్ తెలుగువాడు అయ్యుంటే హౌస్ లో ఉన్న ఎంతో మంది కంటెస్టెంట్స్ గట్టిగా క్లాసులు పడి ఉండేవి. కానీ, తన వాదన వినిపించడంలో యావర్ సక్సెస్ అయ్యాడు. టాస్కుల్లో, గొడవల్లో ఎక్కడా కూడా తాను ఎవ్వరికీ తీసిపోనని నిరూపించుకున్నాడు.
ఎంటర్ టైన్మెంట్ లో కాస్త వెనకబడిన విషయం తెలిసిందే. అలాగే కొన్నివారాలు అతని టెంపర్ అతనికి బాగా మైనస్ అయ్యింది. కొంత ఓటింగ్ దూరం కావడానికి అది కూడా ఒక కారణంగా చెప్పచ్చు. ఆ టైమ్ లో కొంతమంది అభిమానులు యావర్ కు దూరమయ్యారు. అలాగే అస్సలు ఫ్యాన్ బేస్ లేకపోవడం కూడా పెద్ద మైనస్ అయ్యింది. ఇప్పుడు ఓటింగ్ లో టైటిల్ రేసులో లేకపోయినా కూడా.. ఉన్న వారికి మాత్రం గట్టిగానే పోటీ ఇస్తున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఈమాత్రం టైట్ ఫైట్ ఇచ్చాడంటే యావర్ ని తోపు అనడంలో ఎలాంటి అభ్యంతరం లేదు.
ప్రియాంక జైన్ కు హౌస్ లోకి రాకముందే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వచ్చాక తన ఆటతో ఆ ప్రేక్షక గణాన్ని మరింత పెంచుకుంది. టాస్కులు, ఎంటర్ టైన్మెంట్, ఫ్రెండ్ షిప్ ఇలా అన్ని విషయాల్లో తనదైన ముద్రతో దూసుకుపోయింది. హర్ట్ చేసింది తన ఫ్రెండ్స్ అయినా కూడా ఎక్కడా లైన్ క్రాస్ చేయలేదు. ఇంటిల్లి పాదికి వండిపెడుతూ మరోవైపు తన ఆటను తాను ఆడుతూ ఇక్కడి వరకూ వచ్చింది. ఫేవరెటిజమ్ అనే నిందలు వేస్తున్నా కూడా వాటిని స్ట్రాంగ్ గా తిప్పికొట్టింది. కొన్నిరోజులు వంటలక్క అనే బిరుదుతో ఇబ్బంది పడింది. దాదాపు అన్ని వారాలు నామినేషన్స్ లో ఉన్నా కూడా తన ఆటతో సేవ్ అవుతూ వచ్చింది. చాలా అవకాశాలు చేతికి అందినట్లే అంది దూరంగా పోయాయి.
అయినా ఎక్కడా కుంగి పోకుండా గట్టి పల్ల అనే బిరుదు సొంతం చేసుకుంది. తన ఆట తానే ఆడింది.. తనలో తానే బాధ పడింది.. నిందలు మోసింది.. చివరకు ఫైటర్ గా పేరు తెచ్చుకుంది. ఫినాలే వీక్ లో అడుగుపెట్టిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా చరిత్ర సృష్టించింది. బిగ్ బాస్ వల్ల ప్రియాంకకు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. కానీ, టైటిల్ రేసులో మాత్రం ఆమె పేరు వినిపించడం లేదు. ఓటింగ్ లో మాత్రం టైటిల్ ఫేవరెట్స్ కి గట్టి పోటీ ఇస్తోంది. మరి.. ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మీ ఫేవరెట్ ఎవరు? ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అవుతారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.