iDreamPost
android-app
ios-app

Bigg Boss 7: స్నేహం ముసుగులో ఇంత మోసమా? పాపం ఆట సందీప్!

Bigg Boss 7: స్నేహం ముసుగులో ఇంత మోసమా? పాపం ఆట సందీప్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ లో 3 గొడవలు, 6 వాదనలతో కళకళలాడుతోంది. ప్రేక్షకులు ఏదైతో కోరుకుంటారో అదే కంటెంట్ ఇచ్చేందుకు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా కష్టపడుతున్నారు. నిజానికి బిగ్ బాస్ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎలా అయితే కంటెంట్ వస్తుందో ఆ దారిలో కంటెస్టెంట్స్ ని బాగా గైడ్ చేస్తున్నాడు. హౌస్ లో టాస్కులు జరిగితేనే అసలు ఆట మొదలవుతుంది. ఇప్పుడు ఆ ఆట బాగా ఉత్కంఠగా సాగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం హౌస్ లో మాయాస్త్రం టాస్కు వల్ల ఒక చిన్న నిప్పు రాజుకుంది. నిజానికి అది చిన్నది కాదు.. కొద్ది గంటల్లో కార్చిచ్చు కాబోతోంది.

బిగ్ బాస్ హౌస్ లో రెండోవారం మాయాస్త్రం కోసం టాస్కు నిర్వహించారు. అందులో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని రెండు టీములుగా విడదీశారు. ఒక టీమ్ మహాబలి, ఇంకొక టీమ్ రణధీర టీమ్. ఈ రెండు టీమ్స్ టాస్కులో గెలిచేందుకు చాలా కష్టపడ్డాయి. అయితే చివరకు రణధీర టీమ్ గెలిచింది. అయిచే గేమ్, స్ట్రాటజీలు ఎక్కువగా చేసే కంటెస్టెంట్స్ ని ఒక టీమ్ లో పెట్టి.. మిగిలిన వారిని ఇంకొక టీమ్ గా డిసైడ్ చేశారు. దాంతో వాళ్లు గేమ్ లో గెలవలేని పరిస్థితుల్లో కొన్ని పనులు చేశారు. ఇప్పుడు ఆ పనుల వల్ల హౌస్ లో అసలు రచ్చ మొదలు అయింది. మహాబలి టీమ్ లో ఉన్న తేజ టాస్క్ మొదలైన రోజు రాత్రి.. కీ వాళ్లు గెలిచారు. కానీ, అది వాళ్ల దగ్గరే ఉండాలి అని ఏం లేదు. దానిని మనం సొంతం చేసుకుందాం అంటూ హింట్ ఇస్తాడు.

తేజా చెప్పిన మాటలకు శుభశ్రీ, రతికా రోజ్, ధామినీ ఆ కీ సొంతం చేసుకునేందుకు రాత్రంతా కష్టపడ్డారు. కానీ, ఆ కీ మాత్రం వాళ్లకి దొరకలేదు. తర్వాత రోజు కూడా మాయాస్త్ర టాస్క్ కంటిన్యూ అయింది. ఈసారి కూడా రెండు టీమ్స్ ఒక గేమ్ లో గెలిచేందుకు పోటీ పడుతూ ఉన్నాయి. ఇంతలోనే శుభశ్రీ ఒక తుంటరి పని చేసింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లో అలాంటి పనులు చేసే వారికే ఎక్కువ సపోర్ట్ ఉంటుంది. వీఐపీ బెడ్ రూమ్ లో ఉన్న ఆట సందీప్ పవరాస్త్రాన్ని దొంగిలించింది. ఆ విషయాన్ని ధామినీతో కలిసి బిగ్ బాస్ కి చెప్పింది. తర్వాత గేమ్ జరుగుతూ ఉంది. బ్రేక్ టైమ్ లోఅందరూ ఇంట్లోకి వచ్చారు. ఆ సమయంలో బిగ్ బాస్ ఆట సందీప్ కు ఒక హింట్ ఇస్తాడు. ఇప్పటి వరకు కండకు పని చెప్పారు. ఇప్పుడు బుద్ధి బలాన్ని పరీక్షిద్దాం అంటూ ఒక పొడుపు కథ అడిగాడు. 7 సముద్రాలను దాటిన వీరుడు పిల్ల కాలువలో పడ్డాడు. అతడిని ముంచింది ఎవరు? మునిగింది ఏంటి? అంటూ ప్రశ్నించాడు.

ఆ పొడుపు కథ విప్పేందుకు టీమ్స్ మొత్తం చాలా కష్టపడ్డాయి. ఆట సందీప్ అయితే నేను కూడా సమాధానం చెప్పచ్చా అంటూ అడుగుతాడు. పాపం అక్కడ మునిగింది అతనే అనే విషయం తెలుసుకోలేకపోయాడు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత హౌస్ లో వాతావారణం వేడెక్కింది. అందరూ ఆ పవరాస్త్రం ఎక్కడ ఉందో అని వెతుకులాట మొదలు పెట్టారు. ఆట సందీప్ మాట్లాడుతూ.. ఇలా చేయడం చాలా తప్పు. నేను మీ అందరికీ ఎంతో సపోర్ట్ చేస్తున్నాను. ఆ పవరాస్త్రాన్ని నా కొడుకుకి డెడికేట్ చేశాను. అలాంటిది మీరు దాన్ని తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి ఆట సందీప్ హౌస్ లో ఇంత సీరియస్ గా ఉండటం ఇదే మొదటిసారి. ఇన్నాళ్లు ఎంతో మంచిగా ఉన్నాడు. అందరికీ సహాయం చేస్తూ.. అది తప్పు.. ఇది ఇలా చేయండి అంటూ అతను చేస్తూ.. అందరితో పనులు చేయించాడు.

ఇప్పటి నుంచే సందీప్ కూడా ఆట మొదలు పెడతాడు అనిపిస్తోంది. ఇంకోవైపు అసలు రచ్చకు కారణమైన శుభశ్రీ మాత్రం ఏమీ ఎరగనట్లు సైలెంట్ గా చూస్తూ ఉంది. కంటెస్టెంట్స్ ఇల్లంతా వెతుకుతూ ఉంటే.. కనిపెడతారా? లేదా? అంటూ చోద్యం చూస్తోంది. అయితే మాస్టర్ మాస్టర్ అంటూ పిలుస్తూ ఆట సందీప్ ని శుభశ్రీ ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను అందరితో మంచిగా ఉంటున్నాడు. మంచిగా గేమ్ ఆడుతున్నాడు. కష్టపడి పవరాస్త్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఇందులో ఆట సందీప్ తప్పు కూడా ఉంది. మరీ అలా గుడ్డిగా నమ్మడం కూడా కరెక్ట్ కాదు. కష్టపడి సంపాదించుకున్న పవరాస్త్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సందీప్ దే. మరి.. అతని వద్ద అస్త్రం లేదు కాబట్టి.. అతనికి ఉన్న వీఐపీ రూమ్ ఎంట్రీ, 5 వారాల ఇమ్యునిటీని కొనసాగిస్తారా? మళ్లీ కంటెస్టెంట్ చేసేస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి.. శుభశ్రీ- ఆట సందీప్ ని మోసం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.