iDreamPost
android-app
ios-app

వెక్కి వెక్కి ఏడ్చేసిన శోభాశెట్టి.. టార్గెట్ చేస్తున్నారా?

వెక్కి వెక్కి ఏడ్చేసిన శోభాశెట్టి.. టార్గెట్ చేస్తున్నారా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 స్టార్ట్ అయి మూడురోజులు కావస్తోంది. అయినా మొదటి రెండు ఎపిసోడ్లతో పోలిస్తే.. ఎపిసోడ్ 3 మాత్రం కాస్త ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఇప్పుడే హౌస్ లో అసలు ఆట మొదలైంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎందుకంటే తొలివారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఫస్ట్ వీక్ లో మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్తారు. ఉల్టా పుల్టా అన్నారు కాబట్టి సరదాగా ఇద్దరిని హౌస్ నుంచి పంపేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో ఒక విషయం ప్రేక్షకులను బాగా బాధ పెట్టిందనే చెప్పాలి. అదేంటంటే.. శోభాశెట్టి వెక్కి వెక్కి ఏడవటమే ప్రేక్షకులను బాధ పెడుతోంది. ఆమె ఏడవడం చూసేసి కంటెస్టెంట్స్ అందరూ శోభాశెట్టిని టార్గెట్ చేశారు అనే భావనలోకి వచ్చేస్తున్నారు. మొదటి వారం నామినేషన్స్ లో శోభాశెట్టికే అత్యధిక ఓట్లు పడ్డాయి. ఆమె హౌస్ లో సరిగ్గా పని చేయడం లేదని.. ఆమె పని చేయడం తాము చూడలేదంటూ నామినేషన్స్ లో చెప్పుకొచ్చారు. ఇంక వాళ్ల కారణాలు విన్న శోభాశెట్టి బోరున ఏడ్చేసింది.

వంటగదిలో నేనే కదా గిన్నెలు తోముతున్నాను. పని చేస్తుంటే.. నేను పని చేయడం లేదంటూ ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్నించింది. ధామిని, గౌతమ్ కృష్ణలపై అయితే గొడవ కూడా పెట్టుకుంది. మీరు సిల్లీ రీజన్స్ చెప్పి ఎలా నామినేట్ చేస్తారంటూ నిలదీసింది. ఇవన్నీ చూసిన ప్రేక్షకులు శోభాశెట్టిని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. అయితే నిజంగానే శోభాశెట్టి టార్గెట్ చేస్తున్నారా? నామినేషన్స్ లో శోభాశెట్టి ఏం రీజన్స్ చెప్పింది? కొన్ని ఉదాహరణలు చూస్తే మీకే అర్థమవుతుంది.

శోభాశెట్టిని నామినేట్ చేశారని బాగా ఎమోషనల్ అయింది. అన్నీ సిల్లీ రీజన్స్ చెప్పారు అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ శోభాశెట్టే.. కిరణ్ రాథోర్, గౌతమ్ ని నామినేట్ చేసింది. యాక్టివిటీ ఏరియా నుంచి వచ్చిన తర్వాత కిరణ్ రాథోర్ తో మాట్లాడుతూ వన్ డేనే కదా అయింది కదా.. పెద్దగా రీజన్స్ ఏం ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది. అలాగే పల్లవి ప్రశాంత్ ని ప్రియాంక జైన్ నామినేట్ చేసినప్పుడు కూడా పర్సనల్ గా తీసుకోకు.. వన్ డేకి ఏం రీజన్స్ దొరుకుతాయి అంటూ చెప్పింది. మళ్లీ శోభాశెట్టినే తనని నామినేట్ చేశారని ఫైర్ అయిపోయిది. శుభ శ్రీ తనని నామినేట్ చేసిందని తెలియగానే.. గౌతమ్ చెప్పబట్టే తనని నామినేట్ చేసిందంటూ తన స్టోరీ తానే రాసేసుకుంది. నిజానికి గౌతమ్ అలా శుభశ్రీతో చెప్పినట్లు ఎక్కడా కనిపించలేదు.

ఇక ధామినీ, గౌతమ్ తో ఆర్గ్యూ చేసే సమయంలో కూడా తాను చెప్పేది చెప్తోంది గానీ.. ఎదుటివాళ్లు చెప్పేది వినడం లేదు. ఈ ప్రవర్తన శోభాశెట్టికే మైనస్ అవుతుందని తెలుసుకోవాలి. ఎందుకంటే కారణం లేకుండా ఎదుటి వారిపై ఫైర్ అయితే అది బ్యాక్ ఫైర్ అవుతుంది. తనలో ఆడాలనే కసి ఉంది. కానీ, ఎందుకో మిస్ గైడ్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక తనని నామినేట్ చేశారని, ఇంట్లో వాళ్లని మిస్ అవుతున్నాను అంటూ ఏడవడం చూశారు. ఇలా పదే పదే ఎమోషనల్ అయితే ఆమెను వీక్ కంటెస్టెంట్ అని ముద్ర వేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి శోభాశెట్టి కాస్త గేమ్ ప్లాన్ మార్చుకుంటే చాలా మంచి కంటెస్టెంట్ అవుతుంది. ప్రస్తుతానికి శోభాశెట్టిని ఎవరూ టార్గెట్ చేయలేదనే చెప్పచ్చు.  ఎందుకంటే ఒకరిని టార్గెట్ చేసే అంత గేమ్ ఇంకా హౌస్ లో స్టార్ట్ కాలేదు. శోభాశెట్టి గేమ్ ప్లాన్ కాస్త మార్చుకుంటే టాప్ 5 ప్లేయర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి