iDreamPost
android-app
ios-app

కంటెస్టెంట్స్- ప్రేక్షకులపై పగ సాధిస్తున్న శివాజీ.. ఇంత చాదస్తమా?

కంటెస్టెంట్స్- ప్రేక్షకులపై పగ సాధిస్తున్న శివాజీ.. ఇంత చాదస్తమా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7పై హైప్ ని మరింత పెంచేస్తున్నారు. కొత్త కంటెస్టెంట్స్ రాబోతున్నారు అంటూ హింట్లు మీద హింట్లు ఇస్తున్నారు. దీంతో షో మీద సోషల్ మీడియాలో బజ్ బాగా క్రియేట్ అయ్యింది. అలాగే హౌస్ మేట్స్ దగ్గరున్న పవరాస్త్రాలను వెనక్కి తీసుకున్నారు. అలాగే ఐదో పవరాస్త్రాన్ని ఎవరు దక్కించుకుంటారు అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈసారి పవరాస్త్రాన్ని దక్కించుకోవడానికి ఎలాంటి టాస్కు ఉండట్లేదు. ఆ విషయం ఇప్పుడు ప్రేక్షకులు తేలుస్తారు అంటూ బిగ్ బాస్ కామెంట్ చేశాడు. అయితే ముందుగానే పవరాస్త్రాన్ని కోల్పోయిన శివాజీ నానా యాగి చేస్తున్నాడు.

హౌస్ లో ఉన్నవాళ్లు అందరిలో శివాజీ చాలా సీనియర్. పైగా వచ్చిన రోజు నుంచి ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ల తరఫున నిలబడతాను అంటూ చెప్పుకొచ్చాడు. కానీ, న్యాయం తరఫున ఉండే వ్యక్తిలా నాకు కనిపించలేదు అని స్వయంగా హోస్ట్ నాగార్జునానే చెప్పారు. తర్వాత మెజారిటీ ఇంటి సభ్యల నిర్ణయం ప్రకారం శివాజీని హౌస్ మేట్ గా ఉండేందుకు అనర్హుడిగా ప్రకటిస్తూ అతని పవరాస్త్రాన్ని పగలగొట్టారు కూడా. ఆ తర్వాత నుంచి శివాజీ విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. నన్ను విలన్ చేయాలి అని చూస్తున్నారు. కానీ, నేను హీరోగానే ఉంటాను అంటూ డైలాగ్స్ చెబుతున్నాడు. అలాగే నామినేషన్స్ లో కూడా పిట్ట కథలు చెప్పడం ప్రారంభించాడు. మళ్లీ నన్ను పంపేయండి అంటూ పాట పాడటం మొదలు పెట్టాడు.

పదే పదే.. నాకు ఎందుకు ఈ షో నన్ను పంపేయండి అంటూ పాట పాడటం షురూ చేశాడు. మరోసారి శివాజీ కాఫీ కోసం యుద్ధం ప్రారంభించారు. బిగ్ బాస్ కూడా తనకు అన్యాయం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. వాళ్లు కావాలని అలా చేశారు. ఆ విషయం బిగ్ బాస్ కి కూడా తెలుసు. కానీ, నన్ను కంటెస్టెంట్ ని చేశారు. కంటెస్టెంట్ ని చేస్తే చేశారు.. కానీ, నాకు కాఫీ కూడా ఇవ్వడం లేదు అంటూ గోల చేయడం ప్రారంభించాడు. ఉన్నవాళ్లలో పెద్దవాడు.. హౌస్ ని చూసుకుంటాడు అని నాగార్జున చాలానే హోప్స్ పెట్టుకున్నారు. కానీ, శివాజీ మాత్రం ఇలా కాఫీ కోసం యుద్ధాలు చేస్తున్నాడు. ఇందతా చూసిన నెటిజన్స్ కూడా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఏంది శివాజీ నీ చాదస్తం అంటూ కాస్త ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు. ఆట ఆడితే చూడాలని ఉందని.. ఇలాంటి కాఫీ యుద్ధాలు దేనికంటూ ప్రశ్నిస్తున్నారు. మరి.. శివాజీ ఆటతీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి