iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ లోకి వెళ్లింది వీళ్లే!

  • Published Sep 03, 2023 | 11:46 PM Updated Updated Sep 03, 2023 | 11:46 PM
  • Published Sep 03, 2023 | 11:46 PMUpdated Sep 03, 2023 | 11:46 PM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ లోకి వెళ్లింది వీళ్లే!

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సీజన్ పై మొదటి నుంచి భారీ అంచనాలను పెంచేశారు. హైప్ ఎక్కువ చేస్తే తర్వాత బోల్తా పడతావేమో అనే భయం లేకుండా మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేశారు. పైగా మీరు ఎంతైనా ఊహించుకోండి.. అంతకు మించి ఈ సీజన్ ఉంటుందని కింగ్ నాగార్జున చెప్పారు. సీజన్ ప్రారంభానికి ముందు ఇంత కాన్ఫిడెన్స్ ఏంది మావా అని అంతా అనుకున్నారు. కానీ, షో స్టార్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ వాళ్ల కాన్ఫిడెన్స్ కి నిజంగానే కారణం ఉందని తెలుసుకున్నారు. పైగా ఈ సీజన్ లో పవరాస్త్ర అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే పవరాస్త్ర అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని తీసుకొచ్చారు. ఎవరైతే ఈ అస్త్రాన్ని సొంతం చేసుకుంటారో.. వారు మాత్రమే హౌస్ మేట్స్ అవుతారని చెప్పారు.

ఈ సీజన్ షో స్ట్రీమింగ్ టైమ్ నుంచే మొత్తం మారిపోయిందని సంకేతమిచ్చారు. ఎందుకంటే ఎప్పుడూ బిగ్ బాస్ సీజన్ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. కానీ, ఈ సారి రాత్రి 7 గంటల నుంచి షో స్టార్ట్ చేశారు. అయితే అందరూ సీజన్ 7 కాబట్టి అని టక్కున చెప్పచ్చు. అలా ఏం కాదు.. ఈ సీజన్ లో అన్నీ మారబోతున్నాయి అని ఇలా చెప్పకనే చెప్పారు. అలాగే ఈ సీజన్ లో మొదటి రోజే రూ.35 లక్షల సూట్ కేస్ పంపి హౌస్ మేట్స్ బిగ్ బాస్ భారీ షాక్ కు గురి చేశాడు. కానీ, ఆ సూట్ కేసును ఎవరూ తీసుకోలేదనుకోండి. మొదట హౌస్ లో అడుగు పెట్టిన ప్రియాంక జైన్, యాక్టర్ శివాజీ, సింగర్ ధామిని, ప్రిన్స్ యావర్, శుభశ్రీలకు నాగార్జున టాస్క్ ఇచ్చాడు. సూట్ కేస్ లో కొంత మొత్తం ఉందని చెప్పి.. అది తీసుకుని వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇచ్చారు. రూ.5 లక్షలతో మొదలైన టాస్కు.. రూ.35 లక్షల వరకు వెళ్లింది. కానీ, ఎవరూ కూడా టెంప్ట్ కాకుండా అలాగే ఉండిపోయారు.

ఈసారి హౌస్ లో మొత్తం 3 బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఒక డీలక్స్, వీఐపీ, స్టాండర్డ్ అని 3 బెడ్ రూమ్స్ ని పెట్టారు. అవి కూడా ఎవరైతే సాధిస్తారో వారికి మాత్రమే సొంతం అవుతాయని చెబుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన విజయ్ దేవరకొండ ఫర్నిచర్ టాస్క్ పెట్టి వాటిలో బాగా పర్ఫార్మ్ చేసిన శుభశ్రీకి డీలక్స్ బెడ్ రూమ్, ఆట సందీప్ కు స్టాండర్డ్ బెడ్ రూమ్ ఇచ్చాడు. అలాగే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన నవీన్ పోలిశెట్టి అయితే హౌస్ లో రచ్చ రచ్చ చేశాడు. ఎవరు ఎవరితో ఫ్రెండ్స్ గా ఉంటారు అంటూ టాస్క్ పెట్టాడు. ఈ టాస్కులో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నటి రతికకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ వేశాడు. ఎందుకంటే తనతో రతిక బాగా మాట్లాడినట్లు, తన నవ్వు నచ్చినట్లు చెప్పాడు. అమర్ దీప్- శోభా శెట్టి, శివాజీ- శుభశ్రీకి, ప్రిన్స్ యావర్- కిరణ్ రాధోర్ కి, టేస్టీ తేజ- షకీలాకు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ వేశారు. వాళ్లు చివరి ఎపిసోడ్ వరకు ఉండాలి అని కోరుకున్నారు.

హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచే వారికి టాస్కులు మొదలయ్యాయి. ప్రతి సీజన్ లో ఒక రెండ్రోజులు ఆలోచించుకునే టైమ్ అయినా ఉంటుంది. ఈసారి మాత్రం ఆట స్టేజ్ మీద నుంచే మొదలు పెట్టేశారు. ఈ సీజన్ లో వచ్చిన వారిలో ఎక్కువ మంది బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులే ఉన్నారు. కొంత మంది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో పాపులర్ అయిన వాళ్లను సెలక్ట్ చేశారు. ఈసారి ఫార్ములా చాలా బాగుందనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పటిలాగా కొందరు బాగా పాపులర్ అయిన వాళ్లని.. కొందరు ముక్కు మొఖం తెలియని వాళ్లను తీసుకురాలేదు. అందరికీ మినిమం హైప్ అనేది ఉండేలా ప్లాన్ చేశారు. అసలు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ లోకి ఈ సీజన్ లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ ఎవరో చూడండి.

బిగ్ బాస్ కంటెస్టెంట్స్:

  • ప్రియాంక జైన్
  • శివాజీ
  • సింగర్ ధామిని
  • ప్రిన్స్ యావర్
  • శుభశ్రీ రాయగురు
  • షకీలా
  • ఆట సందీప్
  • శోభా శెట్టి
  • టేస్టీ తేజ
  • రతిక
  • గౌతమ్ కృష్ణ
  • కిరణ్ రాథోర్
  • పల్లవి ప్రశాంత్
  • అమర్ దీప్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom