Nidhan
బిగ్‌బాస్ రన్నరప్‌గా నిలిచిన సీరియల్ యాక్టర్ అమర్దీప్ కారుపై అటాక్ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ దాడి ఎలా జరిగింది? అమర్ కారును అడ్డగించింది ఎవరు? తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బిగ్‌బాస్ రన్నరప్‌గా నిలిచిన సీరియల్ యాక్టర్ అమర్దీప్ కారుపై అటాక్ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ దాడి ఎలా జరిగింది? అమర్ కారును అడ్డగించింది ఎవరు? తదితర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఏ రంగమైనా సరే గెలుపోటములు అనేవి సహజం. అది సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్.. ఏదైనా కానివ్వండి. నెగ్గడం, ఓడటం అనేది చాలా కామన్. అయితే గెలిచామా, ఓడామా అనే దాని కంటే ఎంత బాగా ఫైట్ చేశామనేదే ఇంపార్టెంట్. హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే దాన్ని మించింది లేదు. అయితే కొందరు మాత్రం గెలుపోటములను ఒకే విధంగా తీసుకోలేరు. నెగ్గిన వారిని ప్రశంసించి, ఓడిన వారిని ప్రోత్సహిస్తే బాగుంటుంది. కానీ కొందరు మాత్రం దీన్ని ఒకేలా తీసుకోరు. తాము అభిమానించే వారిని ఏమైనా అన్నా సహించలేరు. ఇది అస్సలు మంచిది కాదు. ఇదిలా ఉంటే.. గత కొన్ని వారాలుగా ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న బిగ్‌బాస్ సీజన్ 7లో విన్నర్ ఎవరనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఈసారి టైటిల్‌ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. అతడికి తీవ్ర పోటీ ఇచ్చిన సీరియన్ నటుడు అమర్దీప్ రన్నరప్‌గా నిలిచాడు.
రన్నరప్ అమర్దీప్ కారుపై కొందరు దాడికి దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ షో షూటింగ్ జరిగిన అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తుండగా అమర్దీప్ కారుపై కొందరు వ్యక్తులు అటాక్ చేశారు. కారులో నుంచి బయటకు రావాల్సిందిగా నినాదాలు చేస్తూ రాళ్లు రువ్వారు. ఆ కారు వెనుక భాగంలోని అద్దాన్ని ధ్వంసం చేశారు. అసభ్య పదజాలంతో తిడుతూ దారుణంగా ప్రవర్తించారు. ఆ వాహనాన్ని ముందూ వెనుకా వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో అమర్దీప్ భార్య, తల్లి, ఫ్రెండ్ నరేష్ లొల్ల తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. దాదాపు అరగంట పాటు వాళ్లు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకున్నారు. నిరసనకారుల్లో కొందరు అమర్దీప్ కారు పైకి ఎక్కి కర్రలతో అటాక్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అమర్దీప్ కారుపై అటాక్ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. దాడికి దిగిన వారిని చెదరగొట్టారు. భద్రత మధ్య అక్కడి నుంచి వారిని తరలించారు. అయితే ఈ అటాక్ చేసింది విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులేనని చెబుతున్నారు. కావాలనే టార్గెట్ చేసి మరీ అమర్ కారు మీద దాడికి దిగారని అంటున్నారు. అతడి ఫ్యామిలీ కారులో ఉందని తెలిసినా.. ఇలా రాళ్లతో కొట్టి, అసభ్య పదజాలంతో తిట్టడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎవ్వరైనా సరే ఆటను ఆటగానే చూడాలని.. ఇలా బిహేవ్ చేయడం సరికాదని సీరియస్ అవుతున్నారు. మరి.. బిగ్‌బాస్ రన్నరప్ అమర్దీప్ కారుపై జరిగిన దాడి మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Bigg Boss 7 telugu winner రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచింది ఎంతంటే?
WTF 😶#BiggBossTelugu7 pic.twitter.com/94dGHns4oO
— KIM MaWA (@kimMaWA2022) December 17, 2023