iDreamPost
android-app
ios-app

ప్లేట్ ఫిరాయించిన రతిక! పాపం ప్రశాంత్.. మరీ ఇంత దారుణమా?

  • Published Sep 12, 2023 | 5:23 PM Updated Updated Sep 12, 2023 | 5:23 PM
  • Published Sep 12, 2023 | 5:23 PMUpdated Sep 12, 2023 | 5:23 PM
ప్లేట్ ఫిరాయించిన రతిక! పాపం ప్రశాంత్.. మరీ ఇంత దారుణమా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మొదటి నుంచి రతిక- పల్లవి ప్రశాంత్ పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ల మధ్య లవ్ ట్రాక్ కూడా మొదలవుతోంది అంటూ కామెంట్ చేశారు. హౌస్ లో ఉన్న వాళ్లు కూడా వీళ్లు ఏంటి ఇలా కలిసిపోయారు అంటూ ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పల్లవి ప్రశాంత్ పై రతికా రోజ్ రెచ్చిపోయింది. హౌస్ లోకి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావ్? అంటూ ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో కాసేపు పల్లవి ప్రశాంత్ కు ఏమీ అర్థం కాలేదు. అక్కడితో ఆగకుండా రతికా ఇంకా చాలానే మాటలు అనేసింది. అయితే ఇంతలా ఎందుకు ఆమె మారిపోయిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు అందరూ రతికా రోజ్ వెన్నుపోటు పొడిచింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సమయంలో పల్లవి ప్రశాంత్ ఎంతో రిజర్వ్డ్ గా ఉన్నాడు. పలకరిస్తే మాట్లాడటం, లేదంటే సైలెంట్ గా ఉండటం చేశాడు. ఎంతో వినయంగా ఉంటూ వచ్చాడు. అయితే పల్లవి ప్రశాంత్ గేమ్ అనేది ప్లాన్, మాస్క్ వేసుకున్నాడు ఇలాంటి ఆరోపణలు పక్కన పెడితే రతికా రోజ్ ప్లేట్ ఫిరాయించడంపై మాట్లాడుకుందాం. మొదటిరోజు నుంచే రతికా రోజ్ కావాలనే పల్లవి ప్రశాంత్ దగ్గరకు వెళ్లింది. అతని పక్కనే కూర్చొని అతడితో బాగా కలిసి పోయింది. ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి ఆడారు. మొదటి వారంలో అయితే పల్లవి ప్రశాంత్ ఇంట్లో ఎవరితో కలవకుండా కేవలం రతికా రోజ్ చుట్టూనే తిరుగుతున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. అదే కారణంతో వాళ్లను నామినేట్ కూడా చేశారు. అలాంటి రతికా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గేమ్ ని ప్రశ్నించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అసలు గేమ్ గురించి ప్రశ్నించడం మాత్రమే కాదు.. అతని వ్యక్తిగత జీవితం గురించి కూడా కామెంట్స్ చేసింది.

బిగ్ బాస్ గేటు దగ్గర కుక్కలా పడిగాపులు కాశాను అన్నావ్. మరి.. అవకాశం వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావ్? అంటూ వ్యాఖ్యలు చేసింది. అలాగే తాను నామినేట్ చేస్తూ ఇంకా ఘాటుగా స్పందించింది. “నువ్వు రైతు కాకపోతే ఏం అయ్యేవాడివి? అంటే చదువు అబ్బలేదు కాబట్టి రైతు అయ్యావ్. చదువు అబ్బితే ఏదొక జాబ్ చేసేవాడివి. రైతుబిడ్డ పక్కన పెడితే నువ్వు ఉత్త ప్రశాంత్” ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ప్రశాంత్ అన్నీ ఎపిసోడ్స్ చూస్తూ పక్కా ప్లాన్ తోనే వచ్చాడు అంటూ రతికా రోజ్ కామెంట్స్ చేసింది. అయితే ఎవరూ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక స్ట్రాటజీ లేకుండా రారు. ఇప్పుడు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరి బయట ఒక టీమ్ ని రెడీ చేసుకునే వస్తారు. అలాంటిది ప్రశాంత్ వస్తే తప్పేముంది? అలాగే బిగ్ బాస్ సీజన్స్ చూసి నువ్వు గేమ్ ప్లాన్డ్ గా ఆడుతున్నాడు అంటున్నారు.

అసలు బిగ్ బాస్ సీజన్స్ చూడకుండా బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరూ రారు. అన్నీ సీజన్స్ చూసి వాళ్లు కూడా ఒక పక్కా ప్లాన్ తో వస్తారు. ఇంక ప్రశాంత్ ఎవరో కూడా తెలియదు అన్నట్లు పరిచయం చేసుకున్న రతికా రోజ్.. నామినేట్ చేస్తూ అసలు విషయాలు వెల్లడించింది. పల్లవి ప్రశాంత్ ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసినట్లు అందులో ఒక బాబు మా అన్న అన్ని సీజన్స్ చూస్తాడు.. అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఏడుస్తాడు అంటూ కామెంట్స్ చేసింది. అంటే పల్లవి ప్రశాంత్ ఎవరు అనేది రతికాకి తెలుసు. అతనికి బయట ఉన్న ఫాలోయింగ్ కూడా తెలుసు. అందుకే అతనితో క్లోజ్ ఉన్నట్లు నటించిందని చెప్పకనే చెప్పింది. పైగా ఇంట్లోని సభ్యులతో మాట్లాడుతూ తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్తుంది. అతని పాటికి అతను కూర్చుంటే వచ్చి నీ హార్ట్ ఎవరికి ఇస్తావ్? నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అటూ ప్రశ్నలు అడుగుతుంది. అసలు రతికా ఇన్నాళ్లు చేసింది ఏంటి? నామినేషన్స్ లో చేసింది ఏంటి? అసలు విషయం ఏంటంటే.. ప్రశాంత్ లవ్ ట్రాక్ ఉంటే తనకు పాజిటివ్ అవుతుంది అనుకుంది.

బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ బాగా నెగిటివ్ అవుతున్నాడని.. బయట కూడా అలాంటి పరిస్థితే ఉందేమో అనుకుని ఆమె ప్లేట్ ఫిరాయించి ఉండచ్చు. అందుకే ఒక్కసారిగా ప్రశాంత్ పై రెచ్చిపోయింది. పర్సనల్ లైఫ్ గురించి కూడా కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల ప్రశాంత్ పై ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏర్పడింది. అతను సింపథీ కార్డ్ ప్లే చేస్తున్నాడు అనుకునే వర్గం ఇంకా బలంగా నమ్ముతోంది. అలాగే ప్రశాంత్ కు సపోర్ట్ చేసే వర్గం మరింత స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది. అతడిని టార్గెట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రతికా మాత్రం పక్కాగా ప్లాన్ చేసి వెన్నుపోటు పొడిచింది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రతికాకు ప్రశాంత్ పై ఫీలింగ్స్ లేనప్పుడు ఎందుకు ముందే అవాయిడ్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అంటే తనకు లవ్ ట్రాక్ పాజిటివ్ కావాలనే కదా ఇన్నాళ్లు వెయిట్ చేసిందని నిలదీస్తున్నారు. ఆమె గేమ్ తో హౌస్ లోన సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. అసలు రతికానేనా ప్రశాంత్ గురించి మాట్లాడుతోంది అనుకున్నారు. రతికా- పల్లవి ప్రశాంత్ ని వెన్నుపోటు పొడిచిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom