iDreamPost
android-app
ios-app

Bigg Boss 7: వీడియో: రెచ్చిపోయిన శివాజీ.. శోభాశెట్టి మీదకు వెళ్లి..!

  • Published Sep 12, 2023 | 11:22 AM Updated Updated Sep 12, 2023 | 12:19 PM
  • Published Sep 12, 2023 | 11:22 AMUpdated Sep 12, 2023 | 12:19 PM
Bigg Boss 7: వీడియో: రెచ్చిపోయిన శివాజీ.. శోభాశెట్టి మీదకు వెళ్లి..!

బిగ్ బాస తెలుగు సీజన్ 7 హౌస్ లో నామినేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారి ఫేస్ టూ ఫేస్ నామినేషన్స్ కావడంతో ఒక పట్టానం తెగడం లేదు. నామినేట్ చేసే సమయంలో చెప్పే కారణాలతో ఏకీభవించకపోవడమే కాకుండా.. గొడవకు కూడా దిగుతున్నారు. సోమవారం ఎపిసోడ్ లో చూసిన నామినేషన్స్ ఒక పర్ట్ మాత్రమే.. మంగళవారం ఎపిసోడ్ లో కూడా నామినేషన్స్ హీట్ తప్పకుండా ఉంటుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో నామినేషన్స్ పై ఆసక్తిని రెట్టింపు చేసింది. ముఖ్యంగా శివాజీ- శోభాశెట్టి మధ్య జరిగిన గొడవ హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

హౌస్ లో ఉన్న అందరితో పోలిస్తే.. శివాజీ మైండ్ గేమ్స్ బాగా ఆడుతున్నాడు అని తెలిసిపోతుంది. నామినేషన్స్ లో షకీలా కూడా అదే పాయింట్ చెప్పి నామినేట్ చేసింది. అన్నా మీరుంటే నేను మైండ్ గేమ్స్ ఆడలేను అంటూ చెప్పుకొచ్చింది. శివాజీ హౌస్ లో ఒక ప్యాట్రన్ వైజ్ గా గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. పల్లవి ప్రశాంత్ కి శివాజీ మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్నట్లుగానే అందరూ అనుకున్నారు. ఎప్పుడూ ప్రశాంత్ కి సపోర్ట్ గానే శివాజీ మాట్లాడాడు. కానీ, నామినేషన్స్ తర్వాత మాత్రం అమర్ దీప్, గౌతమ్ వాళ్ల దగ్గరకు వెళ్లి.. ప్రశాంత్ వీక్ కాదు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పాడు. మీరు వాడితో కంపీట్ చేయండి అని ముందు నుంచి చెబుతున్నాను అన్నాడు. మీకే నేను చెప్పేది అర్థం కావట్లేదు అంటూ కామెంట్స్ చేశాడు. ఇదొక్కటే కాదు.. హౌస్ లో గ్రూపులు ఉన్నాయి అని అందరికీ తెలుసు.

హౌస్ లో ఉన్న అన్నీ గ్రూపులతో కామన్ గా మాట్లడేది శివాజీ. తన మాటలు, సామెతలతో ఎంకరేజ్ చేయడం మాత్రమే కాదు.. ప్రొవోక్ కూడా చేయగలడు. అయితే హౌస్ లో ఇప్పుడిప్పుడే శివాజీ మైండ్ గేమ్స్ నుంచి కంటెస్టెంట్స్ బయటకు వస్తున్నట్లు ఉన్నారు. ఇప్పటికే నామినేషన్స్ లో అమర్ దీప్ తన వర్షన్ చెప్పాడు. ప్రియాంక జైన్ కూడా శివాజీని నామినేట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. మాటలు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ కామెంట్ చేసింది. మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో శోభా శెట్టి కూడా శివాజీపై ఫైర్ అయింది. ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పింది. మీదకు రాకుండా మాట్లాడాలి అంటూ సూచించింది. అన్నా అంటూనే స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చింది.

అయితే శివాజీ కూడా ఎక్కడా తగ్గలేదు. తాను వాదన మొదలు పెడితే తట్టుకోలేవు అంటూ కూల్ గా చెప్పాడు. నేను కూడా ఆర్టిస్ట్ నే అంటూ శోభా శెట్టి చెప్పగా.. ఆర్టిస్టువి కాబట్టే ఇంప్రెస్ చేశావు అని శివాజీ అన్నాడు. ఆ మాటలు మాట్లాడొద్దు అంటూ శోభాశెట్టి రెచ్చిపోయింది. దాంతో శివాజీ కూడా బేస్ పెంచి ఆ రోజు గేమ్ లో ఇంప్రెస్ చేయడమే కాదా పాయింట్ అంటూ చెప్పాడు. అంటే ఇంప్రెస్ ది బిగ్ బాస్ టాస్క్ లో గెలిచింది శివాజీ, రతిక.. శోభాశెట్టి గెలవలేదు అనే విషయాన్ని పాయింట్ అవుట్ చేశాడు. కానీ, ఆ విషయం శోభాశెట్టికి వెలగలేదు. అక్కడితో ఆగకుండా అందరూ కలిసే ఆడుతున్నారు అంటూ శివాజీ కామెంట్ చేశాడు. అసలు శోభాశెట్టికి ఆట ఆడటం రాదంటూ మాట్లాడాడు. ఆ మాటలు విన్న శోభాశెట్టి కోపంతో ఊగిపోయింది. తనకు వచ్చిన తెలుగులోనే కౌంటర్స్ ఇచ్చింది. పో పో అని చెప్పడానికి శివాజీ ఎవరు అని ప్రశ్నించింది. పోవాల్సి వస్తే.. బిగ్ బాస్ చెప్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

గత ఎపిసోడ్ లో కూడా శివాజీ సీరియల్ ఆర్టిస్ట్స్ కి స్టార్ మా బ్యాచ్ అంటూ ట్యాగ్ ఇచ్చాడు. ఆ విషయాన్ని ధామిని ప్రియాంక, అమర్ దీప్, శోభాలకు చెప్పింది. ఆ మాట వినగానే ప్రియాంక జైన్ రగిలిపోయింది. మాకు లైఫ్ ఇచ్చిన ఛానల్ లోనే ఉన్నాం.. ఉంటాం అంటూ చెప్పుకొచ్చింది. ఇంక.. వీళ్ల గొడవలో తప్పు ఎవరది అని చూస్తే.. శివాజీ చేసే పోకింగ్ కి కంటెస్టెంట్స్ అలా ఊగిపోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్లు అలా చేసేలా శివాజీ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఆ విషయం వీళ్లకు అర్థం కావడంలేదు. అలా ఊగిపోతే వీళ్లకే నష్టం జరుగుతుంది. ఇంక శివాజీ కూడా ఇలాంటి మైండ్ గేమ్స్ తో ఎక్కువ రోజులు తన మంచిగా నటించనూ లేడు. ఎందుకంటే అందరూ స్ట్రాటజీలు ప్లే చేస్తారు. కానీ, శివాజీ కాస్త ఎక్కువ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎదుటి వారిని అసలు మాట్లాడనివ్వడం లేదు. ఆ పాయింట్ మీదే ఎక్కువ నామినేషన్స్ చేశారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet