iDreamPost
android-app
ios-app

వీడియో: సీరియల్ బ్యాచ్ గ్రూప్ గేమ్? పూజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ బ్యాచ్, గ్రూప్ గేమ్ అనే పదాలు, ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. అయితే అసలు హౌస్ లో గ్రూప్ గేమ్ ఉందా? నిజంగానే సీరియల్ ఆర్టిస్టులు కలిసే ఆడుతున్నారా? అనే ప్రశ్నలకు ఏడోవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వచ్చిన పూజా మూర్తి.. ఐడ్రీమ్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ బ్యాచ్, గ్రూప్ గేమ్ అనే పదాలు, ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. అయితే అసలు హౌస్ లో గ్రూప్ గేమ్ ఉందా? నిజంగానే సీరియల్ ఆర్టిస్టులు కలిసే ఆడుతున్నారా? అనే ప్రశ్నలకు ఏడోవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వచ్చిన పూజా మూర్తి.. ఐడ్రీమ్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వీడియో: సీరియల్ బ్యాచ్ గ్రూప్ గేమ్? పూజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం తన తండ్రి కల అంటూ చెప్పి వెళ్లిన పూజా మూర్తి.. కేవలం రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అయితే తన ఎలిమినేషన్ కు కారణం ఏంటి? హౌస్ లో ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు? బిగ్ బాస్ హౌస్ లో సీరియల్ బ్యాచ్ గ్రూప్ గేమ్ ఉందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పూజా మూర్తి సమాధానాలు చెప్పారు. తేజ- అశ్వినీ వేసిన ఫేక్ నామినేషన్ వల్లే తాను ఈరోజు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చానన్నారు.

“అసలు నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానే అర్థం కావడం లేదు. పబ్లిక్ ఓటింగ్ వల్లే ఎలిమినేషన్ ఉంటుంది అని ముందే చెప్పారు. అయితే హౌస్ లో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్లకి ఫ్యాన్ బేస్ కంటిన్యూ అయ్యింది. నాకు స్క్రీన్ స్పేస్ కూడా కాస్త తక్కువగా ఉన్నట్లు అనిపించింది. ఫస్ట్ వీక్ వెళ్లుంటే.. నా గేమ్ ఇంకోలా ఉండేది అనుకుంటున్నాను. గేమ్ ఆడలేదు అంటే ఓకే.. హౌస్ మేట్స్ తో కనెక్ట్ కాలేదు అన్నా కూడా ఓకే అనుకోవచ్చు. అంతా బాగానే ఆడాను.. కానీ, ఎలిమినేట్ అయ్యాను. నన్ను నామినేట్ చేసిన తేజ- అశ్వినీ ఇద్దరిదీ ఫేక్ నామినేషన్. అశ్వినీ నన్ను తనతో మాట్లాడట్లేదు అంటూ నామినేట్ చేసింది. నేను ఎక్కడా తనని అవాయిడ్ చేయాలి, కార్నర్ చేయాలి అని అనుకోలేదు. ఇది సరైన రీజన్ అని నేను అనుకోవడం లేదు.

అందరూ తనతో మాట్లాడుతున్నారు. అందరూ తనతో బాగా కలిసిపోతున్నారు. కానీ, ఆమె మాత్రం తనతో కలవడం లేదు అంటూ చెప్తూ ఉంది. తేజ అయితే నీళ్లు ముఖం మీద వేశాను అని నన్ను నామినేట్ చేశాడు. ఆ పనిష్మెంట్ పూర్తి చేయకపోతే నిన్ను పడుకోనివ్వను అని చెప్పాను. నీళ్లు కూడా నేను పోయలేదు.. టిష్యూతో నాలుగు చుక్కలు నీళ్లు వేశాను. అందుకు నన్ను నామినేట్ చేశాడు. అది నా లైఫ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ స్టుపిడ్ రీజన్ తో నన్ను నామినేట్ చేశారు. నేను చేస్తే ఎంటర్ టైన్మెంట్.. అవతలి వాళ్లు చేస్తే అది నెగిటివ్ అనేలా తేజ ఉంటున్నాడు. హౌస్ లో చాలామంది స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నారు. అర్జున్, ప్రశాంత్, యావర్, శివాజీ స్ట్రాంగ్ ప్లేయర్లు. శివాజీ  గారే విన్నర్ అవుతారు అని అనడానికి లేదు. అందరూ చాలా స్ట్రాంగ్ గా ఆడుతున్నారు.

ప్రశాంత్, యావర్, అర్జున్ చాలా క్రేజీగా ఆడతారు. నా దృష్టిలో టాప్ 5 అంటే.. అర్జున్, ప్రశాంత్, శివాజీ, యావర్, శోభా అని చెప్తాను. అమర్ మైండ్ సెట్ అటూ ఇటూగా మారుతోంది. తను కూడా టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. ఎవరూ కూడా లైట్ తీసుకుందాం అనుకోవడం లేదు. హౌస్ లో భోలేకి మేము చెప్పేది అర్థం కావట్లేదు. ఆయన చెప్పేది మాకు అర్థం కావట్లేదు. బూతులు మాట్లాడారు. తర్వాత అపాలజీ చెప్పారు. నేను కూల్ గా ఉండే వాడిని.. కానీ, నాకు కోపం తెప్పిస్తున్నారు అంటున్నారు. నవ్వుతూ వచ్చాను నవ్వుతూనే వెళ్లిపోతాను అంటారు. నిజంగానే పాజిటివ్ గా ఉండే వారికి కోపం ఎందుకు వస్తోంది? రాకూడదు కదా. శోభాకి భోలేకి జరిగిన గొడవలో కూడా ఆమె చెప్పింది అదే. మీ ట్రూ కలర్స్ ని నేను బయటకు తీశాను అంది” అంటూ పూజా చెప్పుకొచ్చారు.

హౌస్ లో గ్రూప్ గేమ్ ఉందా? సీరియల్ బ్యాచ్ గ్రూప్ గేమ్ అంటూ ప్రచారం ఉంది. దానిపై మీరు ఏమంటారు అని అడగ్గా.. పూజా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “హౌస్ లో గ్రూప్ గేమ్ ఉంది అనిపించలేదు. ఎక్కువ రోజులు కలిసి పనిచేస్తే అందరితో కంటే తెలిసిన వాళ్లతోనే కాస్త ఎక్కువగా సమయం గడుపుతాం. వాళ్లు అందరి ముందే మాట్లాడుకుంటున్నారు. వాళ్లేమీ సీక్రెట్ గా వెళ్లి మాట్లాడుకోవడం, ఆడటం అలా ఏం చేయట్లేదు. నాకైతే గ్రూప్ గేమ్ లా ఏమీ అనిపించలేదు” అంటూ పూజా మూర్తి హౌస్ లో జరుగుతున్న ఆట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఎలిమినేషన్ కారణం మాత్రం తనకు ఇప్పటికీ అర్థం కాలేదు అన్నారు. పూజా మూర్తి పూర్తి ఇంటర్వ్యూ ఈ కింది వీడియోలో చూసేయండి.