Dharani
బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా నిలిచి.. టాలీవుడ్ లోనే కాక దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. మరి విన్నర్ గా అతడు మొత్తంగా ఎంత గెలిచాడంటే..
బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా నిలిచి.. టాలీవుడ్ లోనే కాక దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. మరి విన్నర్ గా అతడు మొత్తంగా ఎంత గెలిచాడంటే..
Dharani
బిగ్‌బాస్ సీజన్ 7 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్. తెలుగులోనే కాకుండా.. దేశ చరిత్రలో ఒక సామాన్యుడు.. అందులోనూ అన్నదాత బిగ్‌బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి. ‘అన్నా మల్లొచ్చినా.. నేను బిగ్ బాస్ కి వెళ్లానన్నా.. అన్నా రైతు బిడ్డనన్నా.. నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండన్నా’ అని వింత వింత చేష్టలతో వీడియోలు పెడుతూ ఉంటే అతడిని చూసిన వారు.. వీడేవడో తింగరోడిలా ఉన్నాడు.. పైగా బిగ్ బాస్ కు వెళ్లడమే తన జీవిత లక్ష్యం అంటున్నాడు.. పని పాట ఏం లేదా అని ఈసడించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటూ నువ్వే అన్నట్టు.. ప్రశాంత్ మాత్రం కష్టపడి పట్టుదలతో బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్‌బాస్ లోకి వెళ్లాక తనలోని అపరిచితుడితో ప్రేక్షకులకు కూడా కొన్ని సందర్భాల్లో చిరాకు తెప్పించాడు. నామినేషన్స్ సమయంలో ఒకలా ఉంటూ.. మిగతా సమయాల్లో అమయాకత్వానికి బ్రాండ్ అంబాసిడర్ లా కనిపించేవాడు. కానీ టాస్క్ ల్లో మాత్రం ది బెస్ట్ ఇచ్చి.. ప్రతి సారి మిగతా వారికి గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు. ప్రారంభంలో ఓడిపోయిన సమయంలో అతడు కన్నీళ్లు పెట్టుకుంటే.. సింపతీ డ్రామా అనుకునేవాళ్లు. కానీ రాను రాను అతడి సున్నిత మనస్తత్వాన్ని ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు. ఎవరు ఎన్ని అన్నా సరే.. తన ఫోకస్ మొత్తం గేమ్ మీదే పెట్టి.. చివరకు టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అసలు హౌజ్ లో సామాన్యులు ఇన్నాళ్లు కొనసాగడమే గ్రేట్ అంటే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్ గా నిలిచి.. చరిత్ర సృష్టించాడు.
బిగ్‌బాస్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకున్నాడు. అది కూడా ప్రైజ్ మనీ 50 లక్షల నుంచే కట్ అవుతుంది. అంటే రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా వెల్లడించాడు.
తనకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందని తెలిపాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారని సన్నీ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్రశాంత్ విషయంలో కూడా అలానే జరుగుతుంది. అంటే మిగిలిన 35 లక్షల రూపాయల ప్రైజ్ మనీలో ట్యాక్స్ కట్ కాగా.. పల్లవి ప్రశాంత్ చేతికి 17 లక్షలు మాత్రమే వస్తాయని అంటున్నారు.
ఇక హౌజ్ మెట్ గా పల్లవి ప్రశాంత్‌కు ఇచ్చిన పారితోషికం కూడా తక్కువగానే ఉంది. రోజుకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారానికి లక్ష పైచిలుకు కాగా 15 వారాలకు కలిపి రూ.15,75,000 పల్లవి ప్రశాంత్ కు ముట్టినట్లు సమాచారం. మొత్తం 15 వారాల రెమ్యూనరేషన్, ప్రైజ్ మనీ తో కలిపి ప్రశాంత్ రూ.32 లక్షల పైచిలుకు నగదు అందుకున్నాడు. అలాగే 15 లక్షల విలువైన ఖరీదైన మారుతి బ్రెజా కారు, రూ.15 లక్షల విలువ చేసే వజ్రాభరణాన్ని సొంతం చేసుకున్నాడు.
అయితే పల్లవి ప్రశాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ లో కూడా ట్యాక్స్ కటింగ్స్ ఉంటాయట. ఆ కటింగ్స్ కూడా పోనూ ప్రశాంత్‌కు దాదాపు రూ.25 లక్షలే చేతికి వచ్చేట్లు కనిపిస్తోంది. అంటే ఫైనల్ గా ప్రశాంత్ చేతికి 25 లక్షల రూపాయలు(పారితోషికం, ప్రైజ్ మనీ కలుపుకుని), 15 లక్షల విలువైన డైమండ్ జ్యూవెలరీ, 15 లక్షల రూపాయల విలువ చేసే కారు.. అన్ని కలుపుకుంటే మొత్తంగా ప్రశాంత్ చేతికి వచ్చేది 55 లక్షల రూపాయల మొత్తం అనుకోవచ్చు. మరి డైమండ్ జ్యూవెలరీ, కారుకు సంబంధించి ఏమన్నా కటింగ్స్ ఉంటే ఈ మొత్తం మరింత తగ్గవచ్చు అంటున్నారు.