iDreamPost
android-app
ios-app

రతిక మాట కోసం అమర్- యావర్ గొడవ.. తప్పు ఎవరిది?

రెండ్రోజుల సుదీర్ఘ పోరాటాల తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నామినేషన్స్ ముగిశాయి. ఈ నామినేషన్స్ లో చాలానే గొడవలు అయ్యాయి. ముఖ్యంగా అమర్ దీప్- ప్రిన్స్ యావర్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

రెండ్రోజుల సుదీర్ఘ పోరాటాల తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నామినేషన్స్ ముగిశాయి. ఈ నామినేషన్స్ లో చాలానే గొడవలు అయ్యాయి. ముఖ్యంగా అమర్ దీప్- ప్రిన్స్ యావర్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

రతిక మాట కోసం అమర్- యావర్ గొడవ.. తప్పు ఎవరిది?

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ పర్వం ముగిసింది. రెండ్రోజుల భీకర యుద్ధం తర్వాత మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. ఎవరు ఉన్నారు అని చెప్పడం కంటే కూడా.. ఎవరు లేరు అనే విషయం చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే ఈ వీక్ కెప్టెన్ శివాజీ, పల్లవి ప్రశాంత్ మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. నామినేషన్స్ ఎపిసోడ్ మొత్తంలో కొట్టుకోవడం తప్ప అన్నీ చేశారు. అరుపులు కేకలు, చిత్ర విచిత్ర పరిస్థితులు అన్నీ చూపించారు. ముఖ్యంగా అమర్ దీప్- యావర్ మధ్య జరిగిన గొడవ బాగా హైలెట్ అయ్యింది. అయితే ఈ గొడవలో అసలు తప్పు ఎవరిది అనే ప్రశ్న బాగా వైరల్ అవుతోంది. మరి.. వీళ్ల గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.

నామినేషన్స్ లో యావర్ అమర్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. మొదటి నుంచి ఫౌల్ గేమ్ ఆడుతున్నావ్, రతికతో నా గురించి తప్పుగా మాట్లాడావ్ అనే పాయింట్స్ మీదనే యావర్ నామినేట్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ కూడా యావర్ అదే పాయింట్ మీద అమర్ ని నామినేట్ చేయాలని చూశాడు. కాకపోతే అప్పుడు రాజమాతలు అందుకు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటూ యావర్ ఇప్పుడు శోభాశెట్టిని నామినేట్ చేశాడు. లాస్ట్ వీక్ నాకు ఛాన్స్ లేదు.. లేదంటే అప్పుడే నామినేట్ చేసేదాన్ని అంటూ శోభా చెప్పుకొచ్చింది. నాకు తెలుసు నీకు నామీద గ్రడ్జ్ ఉందని అందుకే నన్ను సెల్ఫ్ నామినేట్ ఆప్షన్ రాగానే ఓకే చేశావ్ అంటూ కామెంట్ చేశాడు. ఇంక అమర్ నామినేషన్ వచ్చినప్పుడు ముందు గౌతమ్ ని నామినేట్ చేశాడు. నేను జెన్యూన్ గా ఆడినా కూడా నన్ను నామినేట్ చేశావ్ అంటూ చెప్పాడు.

ఆ తర్వాత యావర్ ని అమర్ నామినేట్ చేశాడు. “పాత వారాల విషయాలు ఇప్పుడు తీసి మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను రెండో వారంలో అంటే మూడో వారం ఏమైంది? నాలుగో వారం ఏమైంది? ఇప్పుడు నన్ను నామినేట్ చేస్తున్నావా? అంటూ అమర్ ప్రశ్నించాడు. అయితే అందుకు యావర్ నేను చూడనిది, నేను వినకుండా నేను ఆ పాయింట్ ని నమ్మను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అదే పాయింట్ ని అమర్ పట్టుకున్నాడు. మరి.. నేను రతికాతో నీ గురించి మాట్లాడటం నువ్వు చూశావా? నువ్వు విన్నావా? అంటూ ప్రశ్నించాడు. అదే పాయింట్ మీద అమర్ గొడవ చేశాడు. నువ్వు ఏదీ చూడకుండా, వినకుండానే నన్ను నామినేట్ చేస్తున్నావ్ అంటూ వాదించాడు. అందుకు యావర్.. నేను కొన్ని చూశాను, కొన్ని విన్నాను వాటిని ఫ్రేమ్ చేసుకునే నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ కేకలు వేశాడు. నేను నామినేట్ చేయాలి అనుకున్నప్పుడు రతికా హౌస్ లో లేదు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత క్లారిటీ తీసుకుని నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఈ గ్యాప్ లో వీళ్లు కొట్టుకున్నంత పని చేశారు. అమర్ బాటిల్ ని స్మాష్ చేసి విసరడంతో అలా చేయద్దు అంటూ యావర్ మీదకు దూకాడు.

అందుకు అమర్ కొడతావా కొట్టురా? మనం బ్రదర్స్ కదా.. కొట్టు అంటూ ఇంకా పోక్ చేశాడు. నీకు గొడవ కావాలి అంతే కదా అంటూ యావర్ కూడా సీరియస్ అయ్యాడు. మధ్యలో శివాజీ వచ్చి వాళ్లను విడదీశాడు. రతికా మాత్రం తల పట్టుకుని కూర్చుంది. వీళ్లెందుకు ఆ పాయింట్ వదిలేయడం లేదంటూ అనుకుంటూ ఉంది. అయితే ఈ గొడవలో అమర్- యావర్ ఇద్దరిదీ తప్పు లేదు. అసలు తప్పు రతికా రోజ్ ది అని చెప్పాలి. హౌస్ లోకి తిరిగి వచ్చాక యావర్ ని మంచి చేసుకోవడానికి అమర్ గురించి కామెంట్స్ చేసింది. అమర్ అలా చెప్పబట్టే నేను నీకు దూరంగా ఉన్నాను అంటూ చెప్పిన మాట వాస్తవమే. కానీ, ఇప్పుడు ఆ మాటలు ఇలా బ్యాక్ ఫైర్ అవుతాయని ఆమె ఊహించలేదు. రెండు వారాలుగా అదే పాయింట్ మీద నామినేషన్స్ జరుగుతున్నాయి. రతికా అలా చెప్పబట్టే యావర్ ఆ పాయింట్ మీద గోల చేస్తున్నాడు. మరి.. అమర్- యావర్ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.