Tirupathi Rao
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం అనగానే నామినేషన్స్ రచ్చ ఉంటుంది. ముఖ్యంగా నామినేషన్స్ పాయింట్ల విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ వారం కూడా అమర్- భోలే మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో తప్పు ఎవరిది అంటే?
బిగ్ బాస్ హౌస్ లో సోమవారం అనగానే నామినేషన్స్ రచ్చ ఉంటుంది. ముఖ్యంగా నామినేషన్స్ పాయింట్ల విషయంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ వారం కూడా అమర్- భోలే మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో తప్పు ఎవరిది అంటే?
Tirupathi Rao
బిగ్ బాస్ హౌస్ లో మస్తీ అంటే సోమవారమే వస్తుంది. ఆదివారం హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడిస్తారు అంతే.. కానీ, సోమవారం మాత్రం హౌస్ లో అందరి నిజ స్వరూపాలు కనిపిస్తాయి. అలాగే ఈ సీజన్ లో ప్రతి నామినేషన్ ప్రక్రియ కూడా రెండ్రోజులు సాగుతోంది. ఈవారం కూడా సోమవారం పార్ట్ 1 మాత్రమే పూర్తైంది. మంగళవారానికి పార్ట్ 2 మిగిలి ఉంది. ఇంక ఈ నామినేషన్ లో అమర్ దీప్- పల్లవి ప్రశాంత్ మధ్య గొడవ జరగలేదు. కానీ, భోలే- అమర్ మధ్య గొడవ జరిగింది. మరి.. ఈ గొడవలో అసలు తప్పు ఎవరిది? అనే ప్రశ్న వినిపిస్తోంది.
వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత నుంచి అమర్ దీప్ కి భోలే షావలీకి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. వచ్చిన వారమే అమర్ దీప్ కి భోలే ఓటేశాడు. అప్పటి నుంచి వీరి మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. అయితే భోలే బయట నెగిటివిటీని దృష్టిలో ఉంచుకుని, శివాజీకి ఆపోజిట్ గ్రూప్ అని ఇలాంటి కారణాలతో నామినేట్ చేశాడు. ఆ తర్వాత అమర్ నామినేట్ చేయడం, బోలే నామినేట్ చేయడం సాంప్రదాయంగా మారిపోయింది. ఈ వారం కూడా భోలే నామినేట్ చేశాడు. అమర్ కూడా తిరిగి భోలేని నామినేట్ చేశాడు. అయితే వీళ్లిద్దరు నామినేట్ చేసుకునే క్రమంలో వీరిమధ్య ఈవారం కూడా గొడవ జరిగింది. నిజానికి రెండు వారాలతో పోలిస్తే భోలే షావలి ప్రవర్తనలో చాలా మార్పు కనిపించింది. పాయింట్ ని చాలా స్ట్రైట్ గా చెప్తున్నాడు. కాకపోతే పాట, పద్యం రూపంలో చెబుతున్నాడు.
అమర్ దీప్ తనని నామినేట్ చేయడం, ఆ రోజు కుర్చీని తన్నడం ఈ రెండు పాయింట్ల వల్లే అమర్ ని భోలే నామినేట్ చేశాడు. వాటికి అదనంగా నువ్వు ఓటమిని తీసుకోలేకపోతున్నావ్ అనే పాయింట్ ని జోడించాడు. అక్కడే అసలు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. నేను ఓటమిని ఎందుకు తీసుకోలేను అంటూ అమర్ డిస్కషన్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొన్ని కొన్ని మాటలు జారాడు కూడా. రెండు వారాలు నువ్వేం పీ**వ్ అంటూ భోలే క్వశ్చన్ చేశాడు. అలాగే మాటల్లో తనని తాను కూడా తిట్టుకున్నడు నేనే పిల్ల నా**కు అంటూ చెప్పుకున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత ప్రియాంక రియాక్ట్ అయ్యింది. అలాంటి మాటలు వాడొద్దు అంటూ సీరియస్ అయ్యింది. పదే పదే ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
వీకెండ్ లో నాగార్జున ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేసుకుని ప్రియాంక గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఈ మొత్తంలో గొడవలో అమర్ కాస్త నోరు జారాడు అనే చెప్పాలి. భోలే చెప్పే పాయింట్ లో కన్ఫ్యూజన్ ఉండచ్చు. కానీ, చెప్పే విధానంలో మాత్రం కాస్త మర్యాదగానే చెప్తాడు. సాధ్యమైనంత వరకు కోపం తెచ్చుకోకుండానే మాట్లాడుతున్నాడు. కానీ, అమర్ మాత్రం ఇప్పటికీ ఆ ప్రవర్తనను నేర్చుకోలేక పోయాడు. నేను ఈ హౌస్ లో బ్యాడ్ బాయ్ నే అంటూ చెప్పుకొచ్చాడు. ఇంక భోలే కూడా రెచ్చగొట్టే మాటలు అంటూనే ఉన్నాడు. నువ్వే బ్యాడ్ అవుతున్నావ్ అంటూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. బయట చూసిన ఆట ప్రకారం భోలే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరి.. భోలే- అమర్ మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.