iDreamPost
android-app
ios-app

ఒక్క టాస్కు విన్ అయితే.. 5 వారాలు హౌస్ లోనే!

ఒక్క టాస్కు విన్ అయితే.. 5 వారాలు హౌస్ లోనే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఇప్పుడిప్పుడే అసలు ఆట మొదలైంది. ఫస్ట్ వీక్ నామినేషన్స్ కావడంతో హౌస్ మొత్తం గరం గరంగా ఉంది. ఒకరినొకరు నువ్వు సిల్లీ రీజన్ చెప్పావ్.. నువ్వు సిల్లీ రీజన్ చెప్పావ్ అంటూ గోల చేస్తున్నారు. నిజానికి రెండ్రోజులకు ఏం రీజన్స్ ఉంటాయి నామినేట్ చేయడానికి. అందుకే ఒకరు నాతో కలవడం లేదని.. ఒకరేమో తెలుగు మాట్లడాటం లేదని.. ఇంకొకరు నన్ను నామినేట్ చేసింది కాబట్టి నేను చేస్తున్నాను అంటున్నారు. ఇలా రకరకాల కారణాలతో నామినేట్ చేసుకుంటున్నారు. అందరూ తమని నామినేట్ చేసిన వారితో కాస్త గట్టిగానే మాట్లాడారు.

ఈ సీజన్ కాస్త ఉల్టా పుల్టాగానే ఉంది. ఎందుకంటే రకరకాల టాస్కులు పెడుతున్నారు. ఇప్పుడే హౌస్ లో టాస్కులు మొదలయ్యాయని లీకులు వస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఈసారి మొదటి వీక్ లోనే బీభత్సమైన టాస్కులు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ముందే చెప్పారు కదా.. ఇక్కడ ఎవరూ కన్ఫామ్ కాదని మరి ఆ స్థానాన్ని పొందాలి అంటే టాస్కుల్లో విజయం సాధించాల్సిందే. అప్పటివరకు వీళ్లు కంటెస్టెంట్స్ మాత్రమే అవుతారు. ఒకవేళ టాస్కులో ఓడిపోతే వాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాల్సిందే. వారి స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ పేరుతో కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తారని చెబుతున్నారు.

ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో మాత్రం ఏదీ కచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే బిగ్ బాస్ నిమిషాల్లో రూల్స్ ని, గేమ్ ని మార్చేస్తున్నాడు. నిజానికి బిగ్ బాస్ 24 గంటల లైవ్ స్ట్రీమింగ్ అయినా.. అది ముందు రోజు జరిగిన గేమ్ ని ఈరోజు టెలికాస్ట్ చేస్తారు. ఈ గ్యాప్ లో హౌస్ లో ఏం జరిగింది అనేది నెట్టింట ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ కి సంబంధించి ఒక క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒక్క టాస్కు గెలిస్తే 5 వారాలు హౌస్ లో ఉండచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం కంటెస్టెంట్స్ కి టాస్కులు పెడుతున్నారు. ఈ టాస్కులో విజయం సాధిస్తే వారికి 5 వారలపాటు ఇమ్యునిటీ లభిస్తుందని చెబుతున్నారు.

టాస్కు గెలిచిన వాళ్లు ఈ వారం నామినేషన్స్ నుంచి కూడా సేవ్ అవుతారంట. ఈ వార్త వినగానే ప్రేక్షకులు అంతా షాకవుతున్నారు. అసలు ఒక్క టాస్కుతో 5 వారాలు హౌస్ లో ఎలా ఉంటారు అని ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఇక్కడే బిగ్ బాస్ పెట్టిన మెలిక గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నిజానికి అది 5 వారాల ఇమ్యునిటీ అయి ఉండదు. టాస్కు గెలిచిన వాళ్లు కంటెస్టెంట్స్ నుంచి హౌస్ మేట్స్ గా మారే అవకాశం ఉండచ్చు. వాళ్లు 5 వారాల పాటు హౌస్ లో ఉండే అర్హతను సాధించే అవకాశం అయి ఉంటుంది. ఎందుకంటే గెలిచిన వాళ్లంతా 5 వారాలు హౌస్ లోనే ఉండే పనైతే.. ఇంక ఎలిమినేట్ అయ్యేది ఎవరు? ఎలిమినేషన్ ప్రాసెస్ లేకపోతే అసలు బిగ్ బాస్ గేమ్ అనేది ముందుకు సాగదు. ఇంకా ఈ సీజన్ లో ఇలాంటి ఎన్నో అద్భుతాలు, అతి వింత రూల్స్ ఉంటాయని చెబుతున్నారు.