iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ లోకి సురేఖా వాణి! వైల్డ్ కార్డ్ ఎంట్రీగా..!

  • Published Sep 15, 2023 | 5:17 PM Updated Updated Sep 15, 2023 | 5:17 PM
  • Published Sep 15, 2023 | 5:17 PMUpdated Sep 15, 2023 | 5:17 PM
బిగ్ బాస్ లోకి సురేఖా వాణి! వైల్డ్ కార్డ్ ఎంట్రీగా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉత్కఠగా సాగుతోంది. ఇప్పటికే హౌస్ లో టాస్కుల పేరుతో బిగ్ బాస్ పెట్టిన చిచ్చు రగులుతూనే ఉంది. అది పైకి నివురుగప్పిన నిప్పులా వ్యాపిస్తోంది. కంటెస్టెంట్స్ అందరూ ఎప్పుడు అవకాశం వస్తుందా.. ఎప్పుడు ఓపెన్ అయిపోదామా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ వారికి అన్యాయం జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లు పవరాస్త్ర రేసు నుంచి తప్పుకున్నట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఈ టాస్కులో పవరాస్త్ర కోసం పోటీదారులుగా శివాజీ, షకీలా నిలిచారు.

అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, చివర్లో బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇస్తూ.. ఇంకో కంటెండర్ ని ఎంచుకునే అవకాశాన్ని ఆట సందీప్ కు ఇచ్చాడు. దాంతో ఆట సందీప్ ఆ అవకాశాన్ని అమర్ దీప్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే పవరాస్త్ర రేసులో మొత్తం ముగ్గురు కంటెండర్లు ఉన్నారు. ఈ విషయంపై శివాజీ అసహనం వ్యక్తం చేయడం ప్రోమోలో కూడా చూశాం. ఈ అప్ డేట్స్ తో ప్రస్తుతం హౌస్ లో అయితే బాగానే రచ్చ జరుగుతోంది. వీటికి అధనంగా ఇప్పుడు బిగ్ బాస్ కి సంబంధించి ఇంకో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. అదే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇప్పటికే అంబటి అర్జున్న వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నాడు అంటూ లీకులు వస్తుండగా.. ఇప్పుడు రెండో పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఎవరంటే.. నటి సురేఖా వాణి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. అదే నిజం అయితే ప్రేక్షకులకు కంటెంట్ కి కొదవ ఉండదనే చెప్పాలి.

సురేఖా వాణి ఎంతో పెద్ద నటి.. ఎంతో యాక్టివ్ గా ఉండే వ్యక్తి కూడా. సోషల్ మీడియాలో అయితే సుప్రితాతో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలాంటిది సురేఖా వాణి హౌస్ లోకి వస్తోందంటే అదే నిజంగానే ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ సీజన్ లో మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ ఉంటారని చెప్పగా.. కేవలం 14 మందినే హౌస్ లోకి పంపారు. మిగిలిన వారిని ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ రూపంలో పంపుతారంటూ చెబుతున్నారు. అయితే నిజంగానే సురేఖా వాణి హౌస్ లోకి వెళ్తుందా అంటే.. వెళ్లేదాకా కచ్చితంగా చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు హీరోయిన్ ఫర్జానా హౌస్ లోకి వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లో సురేఖా వాణి హౌస్ లోకి వెళ్లబోతోంది అంటున్నారు. కాబట్టి బిగ్ బాస్ లో ఏదైనా గ్యారెంటీగా చెప్పే పరిస్థితి ఉండదు. మరి.. సురేఖా వాణి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss