iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: అమర్- సందీప్ లపై రెచ్చిపోయిన నాగ్.. వీడియో చూపించి మరీ!

  • Published Oct 07, 2023 | 4:07 PM Updated Updated Oct 07, 2023 | 4:07 PM
  • Published Oct 07, 2023 | 4:07 PMUpdated Oct 07, 2023 | 4:07 PM
Bigg Boss 7 Telugu: అమర్- సందీప్ లపై రెచ్చిపోయిన నాగ్.. వీడియో చూపించి మరీ!

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ అనగానే ఫన్ డే, మస్తీ అంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. కానీ, ఈ సీజన్ లో మాత్రం గత రెండు వారాలుగా హౌస్ లో వాళ్లకు వీకెండ్ అనగానే చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే హోస్ట్ నాగార్జన ప్రతి ఒక పాయింట్ ని పట్టుకుని కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకుతున్నాడు. అంతేకాకుండా వీడియోలు కూడా ప్లే చేసి మరీ గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ లో నాగార్జున హోస్టింగ్ కు ప్రేక్షకులు అంతా ఫిదా అయిపోయారు. అదే జోరుని ఈ వీక్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. హౌస్ లో పొగిడే వారిని పొగుడుతూ.. తిట్టాల్సిన వాళ్లని గట్టిగా తిట్టేస్తున్నారు.

ఐదో వారం హౌస్ లో ఓవరాల్ గా చూసుకుంటే చాలా మంది తప్పులు చేశారు. గేమ్ పరంగా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ సూపర్ అనిపించారు. తప్పులు చూస్తే.. సంచాలక్ గా శోభాశెట్టి, అమర్ దీప్, ప్రవర్తన పరంగా సందీప్, గౌతమ్ ఇలా దాదాపుగా అందరికీ గట్టిగానే క్లాసులు పడ్డాయి. మరీ ముఖ్యంగా ఆట సందీప్– అమర్ దీప్ లపై నాగార్జున సీరియస్ అయ్యారు. తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జిమెంట్ అంటూ కౌంటర్ ఇచ్చారు. అది విన్న తర్వాత అమర్ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. ఎందుకంటే గత రెండు వారాలుగా హౌస్ లో తాను బాగా పర్ఫార్మ్ చేస్తున్నాను అనే భ్రమలో ఉండిపోయాడు. కానీ.. రియాలిటీ అలా లేదు. అందుకే అదే విషయాన్ని నాగార్జున చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు పెట్టిన ఛాలెంజస్ లో ఫ్రూట్ నింజా కూడా ఒకటి. ఆ ఛాలెంజ్ లో అమర్ దీప్ సంచాలక్ గా ఉన్నాడు. అయితే ఆట మొదటి నుంచి సంచాలక్ గా అమర్ ని పెట్టలేదు. కానీ, చివర్లో అమర్ దీప్ ని ఏ జార్ లో ఎంత జూస్ ఉందో చూసి చెప్పాలంటూ ఆదేశించారు. ఆ సమయంలో పల్లవి ప్రశాంత్- శివాజీల జంటకు 3.8.. తమ జంట 3.7 జూస్ పిండినట్లు ప్రకటించాడు. అయితే అమర్ వాళ్ల జార్ లో తొక్కలు ఉన్నాయి. పైగా బుట్టలో ఉన్న కాయను కాకుండా బయట ఉన్న కాయను తీసుకుని పిండాడు. అప్పుడు క్వశ్చన్ చేస్తో.. అది మా బుట్టలో కాయే అంటూ అమర్ బుకాయించాడు. అంతేకాకుండా తొక్కల గురించి చెప్పినప్పుడు కూడా కేర్ చేయకుండా రియాక్ట్ అయ్యాడు.

అదే విషయాన్ని నాగార్జున వీడియో వేసి మరీ చూపించి ప్రశ్నించారు. పక్కన వాళ్లు జడ్జిమెంట్ ఇస్తే బొక్కలో జడ్జిమెంట్ అంటూ కామెంట్ చేస్తావు. మరి.. నువ్వెలా ఇచ్చావ్? అని ప్రశ్నిస్తే అమర్ దగ్గర సమాధానం లేదు. అందుకే నేను కూడా ఫ్రెండ్ షిప్ కొద్దీ చెబుతున్నా.. ‘తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జిమెంట్” అంటూ నాగార్జున సీరియస్ కామెంట్ చేశారు. ఇప్పటికైనా అమర్ దీప్ కు తన గేమ్ మీద క్లారిటీ వస్తుందో? లేక ఇంకా భ్రమల్లోనే ఉంటూ గేమ్ ఆడతాడో చూడాలి. మరి.. అమర్ జడ్జిమెంట్ పై నాగార్జున చేసిన కామెంట్స్ కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio