iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: డాక్టర్ బాబుకి గాయాలు.. కందిపోయేలా కొట్టిన తేజ!

  • Published Sep 28, 2023 | 4:05 PM Updated Updated Sep 28, 2023 | 4:13 PM
  • Published Sep 28, 2023 | 4:05 PMUpdated Sep 28, 2023 | 4:13 PM
Bigg Boss 7 Telugu: డాక్టర్ బాబుకి గాయాలు.. కందిపోయేలా కొట్టిన తేజ!

బిగ్ బాస్ బౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ కొంతమంది ఎలాంటి బజ్ లేకుండా, అంచనాలు లేకుండా వస్తారు. కానీ, ఆట సాగుతున్న కొద్దీ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ అవుతారు. ఈ సీజన్ లో అలాంటి వ్యక్తి గౌతమ్ కృష్ణ అని చెప్పచ్చు. వీక్ బై వీక్ గౌతమ్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాడు. బీబీ బ్యాంక్ టాస్కుతో గౌతమ్ మరింత స్ట్రాంగ్ ప్లేయర్ అని రజువు చేసుకున్నాడు. బీబీ బ్యాంక్ టాస్కులో వచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ లో అమర్ తో కలిసి ఆడిన గౌతమ్ ప్రేక్షకులనే కాదు.. కంటెస్టెంట్స్ ని కూడా మెప్పించాడు. హ్యాట్సాఫ్ గౌతమ్ అనేలా చేశాడు. అంతేకాకుండా దెబ్బలు కూడా తిన్నాడు.

ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒళ్లు దాచుకుంటే విజయం సాధించలేరు. ఆ విషయం హౌస్ లోకి వచ్చే ప్రతి ఒక్కరికి తెలుసు. టాస్కుల్లో ఆడాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఒక్కోసారి టాస్కుల్లో గాయాలు కూడా అవుతాయి. అయినా కూడా ఎక్కడా తగ్గకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ కృష్ణ కూడా అదే పని చేస్తున్నాడు. ఫస్ట్ ఛాలెంజ్ లో తేజ, రతికతో అమర్- గౌతమ్ కలిసి పోరాడారు. ఆ ఛాలెంజ్ లో విజయం కూడా సాధించారు. అయితే గేమ్ లో భాగంగా తేజ.. గౌతమ్ ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఎక్కడా గౌతమ్ కంట్రోల్ కాలేదు. కెమెరా ముందుకు వచ్చి ఫొటోలు దిగాడు. అప్పుడు గౌతమ్ నడుము బెల్ట్ ఊడిపోయింది. అతను తెలివిగా షర్ట్ కూడా తీసేశాడు. ఎందుకంటే అప్పుడు తేజ అతడిని వెనక్కి లాగలేడు అని. అది బాగా వర్కౌట్ కూడా అయింది.

అయితే ఇక్కడే తేజ కాస్త ఎగ్జైట్ అయినట్లు కనిపించింది. ఆ బెల్ట్ ని గట్టిగా గౌతమ్ ఛాతి మీద కొడుతూ.. మెడకు వేసి లాగాడు. అలా ఒకసారి కాదు నాలుగు ఐదుసార్లు చేశాడు. కంటెస్టెంట్స్ అందరూ అలా చేయకు. అతనికి దెబ్బ తగులుతోంది అంటూ కేకలు వేశారు. నొప్పి పుడుతున్నా కూడా గౌతమ్ మాత్రం స్మైలీ ఫొటోలు దిగుతూనే ఉన్నాడు. తేజ బాగా అలిసిపోయి కనిపించాడు. ఎలాగైనా గౌతమ్ ని వెనక్కి లాగాలి అని విచక్షణ లేకుండా అలా లాగేసినట్లు కనిపించింది. శోభాశెట్టి కూడా అలా చేయడం కరెక్ట్ కాదు.. నువ్వు అతని మెడకు వేసి లాగుతున్నావ్ అని అరిచింది. ఆ తర్వాత చూసుకుంటే గౌతమ్ మెడ చుట్టూ కందిపోయి కనిపిచింది. బాగా గీతలు కూడా పడ్డాయి. ఈ టాస్కులో అమర్ తో పోలిస్తే గౌతమ్ ఎఫర్ట్స్ అందరినీ మెప్పించాయి. గౌతమ్ ఆట చూసిన కంటెస్టెంట్స్ కూడా గౌతమ్ కు హ్యాట్సాఫ్ చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna)

తర్వాత కూడా గౌతమ్ తేజ గురించి ఏం అనలేదు. గేమ్ లో భాగంగానే అది జరిగినట్లు ఊరుకున్నాడు. అలాగే తేజ దగ్గరున్న 51 కాయిన్స్ మొత్తం గౌతమ్ తీసుకున్నాడు. రతికా వద్దనున్న కాయిన్స్ ని అమర్ తీసుకున్నాడు. తేజ దగ్గర కాయిన్స్ ఎక్కువ కదా.. మొత్తం నువ్వు ఎందుకు తీసుకుంటావ్ అని అమర్ అనలేదు. ఎందుకంటే గేమ్ లో ఎక్కువ ఎఫర్ట్స్ గౌతమ్ వే ఉన్నాయి. పిక్చర్స్ కూడా గౌతమ్ ఎక్కువ దిగాడు. అందుకే అమర్ కూడా 51 కాయిన్స్ గౌతమ్ కృష్ణ నే తీసుకోమన్నాడు. ఆ తర్వాత వీళ్లు ఇంకో ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అందులో ఓడిపోయి కాయిన్స్ మొత్తాన్ని ప్రశాంత్- యావర్ కి ఇచ్చేయాల్సి వచ్చింది. కానీ, గౌతమ్ ఎఫర్ట్స్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. మరి.. గౌతమ్ ఆటతీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by D GAUTHAM KRISHNA (@actorgauthamkrishna)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet