ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో ఉంది ఎవరంటే..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అట్టహాసంగా ప్రారంభమైంది. మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఉల్టా పుల్టాగానే చేస్తున్నారు. ఈసారి కూడా బిగ్ బాస్ 24*7 స్ట్రీమింగ్ ని మీరు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడచ్చు. మొత్తానికి మొదటిరోజు 14 మందిని హౌస్ లోకి పంపారు. ఇంక ఏ ఒక్కరు కూడా హౌస్ మేట్ కాదని.. కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే అంటూ నాగార్జున చెప్పుకొచ్చారు. అంతేకాదండోయ్ వారికి ఇంట్లో ఏదీ కూడా ఫ్రీగా దొరకదని.. అన్నింటిని వాళ్లే గెలుచుకోవాలని చెప్పారు. ఇంట్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే పరీక్షలు మొదలు పెట్టారు. రాత్రి నిద్రపోయేందుకు బెడ్లు ఇవ్వకపోగా కనీసం దుప్పట్లు కూడా ఇవ్వకుండా చుక్కలు చూపించేస్తున్నారు.

లగేజ్ పెట్టుకోవడానికి చోటు, బెడ్ రూమ్ యాక్సెస్ లాంటివి లేక సభ్యులు నానా ఇబ్బంది పడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ వాతావరణానికి అలవాటు పడకముందే వారికి టాస్కుల పేరుతో పరీక్షలు పెట్టేస్తున్నారు. ఇప్పటివరకు వాళ్లు చూసిన ఏ సీజన్ కూడా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అవ్వడానికి సహకరించేలా లేదు. ఎలాగోలా నడిపిద్దామని అనుకుంటున్న వారికి ఇవాళ(హౌస్ లో ఇవాళ మూడో రోజు) నామినేషన్స్ పేరుతో బిగ్ బాస్ పెద్ద పిడుగు వేశారు. నిజానికి రెండ్రోజుల్లో అవతలి వాళ్లు ఎలా మాట్లాడతారో కూడా తెలుసుకోలేం. కానీ, బిగ్ బాస్ హౌస్ లో మాత్రం మీరు రెండ్రోజుల పరిచయంతోనే నామినేట్ చేయాల్సి వస్తుంది. ఈ వారం మొత్తం 9 మంది నామినేషన్స్ లో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. మరి.. ఆ 9 మంది ఎవరో చూద్దాం.

ఈ 9 మంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 తొలివారం నామినేషన్స్ లో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే వీళ్లలో ఎంతమంది నామినేషన్స్ లో ఉంటారు? ఈ అంకె పెరుగుతుందా.. తగ్గుతుందా అంటే నామినేషన్స్ ఎపిసోడ్ ప్లే చేసిందాకా ఆగాల్సిందే. ఈ సీజన్ లో ఉల్టా పుల్టా అని గుర్తుంది కాదా? అందులో భాగంగా ఈసారి హౌస్ లో ఏమైనా జరగచ్చు. అంటే మిడ్ వీకి లోనే ఎలిమినేషన్ జరగచ్చు. అలాగే కొత్తవాళ్లు హౌస్ లోకి రావచ్చు. అంతేకాకుండా ఈ సీజన్ లో ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. హాట్ స్టార్ ద్వారా ఒక యూజర్ ఒక ఓటు మాత్రమే వేయగలరు. ఒక నంబర్ నుంచి ఒక మిస్డ్ కాల్ మాత్రమే ఇవ్వగలరు. కాబట్టి ఈసారి నామినేషన్స్, సేవింగ్ ప్రక్రియ ఎంతో ఆసక్తిగా మారనుంది.

నామినేషన్ లిస్ట్ అంచనా:

  • ప్రిన్స్ యావర్
  • శోభా శెట్టి
  • గౌతమ్ కృష్ణ
  • కిరణ్ రాథోర్
  • పల్లవి ప్రశాంత్
  • షకీలా
  • ధామిని
  • రతిక
  • ప్రియాంక జైన్
Show comments