iDreamPost
android-app
ios-app

హౌస్ నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమే?

  • Published Sep 09, 2023 | 5:40 PM Updated Updated Sep 09, 2023 | 5:40 PM
  • Published Sep 09, 2023 | 5:40 PMUpdated Sep 09, 2023 | 5:40 PM
హౌస్ నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతో ఆసక్తిగా సాగుతోంది. అప్పుడే మొదటి వారం పూర్తి కావస్తోంది. వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున సందడి చేయనున్నాడు. అయితే వీకెండ్ అనగానే హౌస్ లో మస్తీ ఎలా ఉంటుందో.. ఎలిమినేషన్ పై కూడా అలాగే ఆసక్తి నెలకొంటుంది. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతోంది అంటూ వెతుకులాట మొదలు పెట్టేస్తారు. బిగ్ బాస్ హౌస్ లో శనివారం, ఆదివారం ఎపిసోడ్ షూట్ ఒకేరోజు జరుగుతుంది అని అందరికీ తెలిసిందే. హౌస్ లో ముందు రోజు జరిగిన ఆటను తర్వాత రోజు ఎపిసోడ్ గా చూపిస్తారు. ఈ నేపథ్యంలోనే యాజమాన్యం ఎంత కంట్రోల్ చేయాలి అని చూసినా కూడా.. లీకుల రూపంలో నెట్టింట సమాచారం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇప్పుడు తొలివారం ఎలిమినేషన్ కు సంబంధించి ఒక పేరు బాగా వైరల్ అవుతోంది. ఆవిడే ఈవారం ఎలిమినేట్ అయ్యారు అంటూ చెబుతున్నారు. మరి.. ఆ కంటెస్టెంట్ ఎవరు? ఎందుకు ఆమె ఎలిమినేట్ అయ్యిందో చూద్దాం.

బిగ్ బాస్ హౌస్ లో వీక్ కి ఒకరు చొప్పున ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఒక్కోసారి డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుంది. అయితే సాధారణంగా మొదటి వీక్ లో ఒకరిని మాత్రమే ఎలిమినేట్ చేస్తుంటారు. ఈ వీక్ ఎలిమినేషన్ ఉండదు అంటూ కాసేపు టాక్ వినిపించింది. కానీ, తర్వాత ఎలిమినేషన్ పక్కా అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వీక్ ఒక స్టార్ హీరోయిన్ హౌస్ నుంచి ఎలిమినేట కాబోతోంది అని చెబుతున్నారు. అయితే స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. కిరణ్ రాథోడ్. ఈ పేరు విన్నాక ప్రేకషకులు పెద్దగా ఆశ్చర్యపోరు అనే చెప్పాలి. ఎందుకంటే అసలు ఆమె ఏం ఆడుతోందో? అసలు ఎందుకు హౌస్ లో ఉందో అనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఎందుకంటే భాషను దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ సెలక్ట్ చేస్తే బాగుండేది.

కిరణ్ రాథోడ్ తెలుగులో మాట్లాడటం సంగతి పక్కన పెడితే.. అసలు బిగ్ బాస్ ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ లో కిరణ్ రాథోడ్ కోసం సబ్ టైటిల్స్ కూడా వేసే పరిస్థితి ఏర్పడింది. పైగా ఓటింగ్ లో కూడా కిరణ్ రాథోడ్ అతి తక్కువ ఓట్లు పడిన కంటెస్టెంట్ గా ఉందని చెబుతున్నారు. అనధికారికంగా జరిగే సోషల్ మీడియా ఓటింగ్స్ లో కూడా కిరణ్ రాథోడ్ కే తక్కువ ఓట్లు వచ్చాయి. భాష రాకపోవడం, తెలుగు అర్థం చేసుకోలేకపోవడం వల్ల కిరణ్ రాథోడ్ హౌస్ లో ఉన్నా కూడా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదనే చెప్పాలి. భాష రాకపోతే కంటెంట్ జనరేట్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. గేమ్, లాంగ్వేజ్, సపోర్ట్ ఇలా అన్ని కోణాల ద్వారా ఆలోచించి బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఫస్ట్ వీక్ హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాబోతున్నట్లు చెబుతున్నారు.

ఇక్కడే బిగ్ బాస్ ట్విస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక చిన్న లాజిక్ ని చూపించి అసలు ఫస్ట్ వీక్ లో ఎలిమినేషన్ లేదని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సీజన్ లో ఎవరూ హౌస్ మేట్స్ కాదు.. ఎవరైతే పవరాస్త్రాను అందుకుంటారో వాళ్లే హౌస్ మేట్ అవుతారు. అప్పటివరకు అందరూ కంటెస్టెంట్స్ మాత్రమే. అయితే అసలు హౌస్ మేట్ కాకుండా ఎలా నామినేట్ అవుతారు? ఎలా ఎలిమినేట్ అవుతారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉల్టా పుల్టా సీజన్ లో ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ఉంటే.. కిరణ్ రాథోడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి.. ఈ వీక్ లో మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibombetcio girişiptv satın al