iDreamPost
android-app
ios-app

అమర్ ని నిలువునా ముంచేసిన శివాజీ!

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి కెప్టెన్ అయ్యేందుకు అందరూ తెగ కుస్తీలు పడుతున్నారు. కెప్టెన్ అయ్యేందుకు తెగ పోటీ పడుతున్నారు. కానీ, ఎప్పటిలాగానే కెప్టెన్ అవ్వాలి అంటే ఇంటిల్లిపాది సపోర్ట్ కావాల్సి వచ్చేలా టాస్కు పెట్టారు.

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరి కెప్టెన్ అయ్యేందుకు అందరూ తెగ కుస్తీలు పడుతున్నారు. కెప్టెన్ అయ్యేందుకు తెగ పోటీ పడుతున్నారు. కానీ, ఎప్పటిలాగానే కెప్టెన్ అవ్వాలి అంటే ఇంటిల్లిపాది సపోర్ట్ కావాల్సి వచ్చేలా టాస్కు పెట్టారు.

అమర్ ని నిలువునా ముంచేసిన శివాజీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఉత్కంఠభరితంగానే కాకుండా.. మరింత నాటకీయంగా మారుతోంది. కెప్టెన్సీ టాస్కులో హౌస్ మేట్స్ కెప్టెన్ కావాలీ అనే మాటకంటే కూడా.. ఎవరిని కెప్టెన్ కాకుండా ఆపాలి అని తెగ స్ట్రాటజీలు వేసుకున్నారు. చివరికి అసలు ఈ వీక్ కెప్టెన్ అనేవాడే లేకుండా చేసుకున్నారు. అయితే ఇలా జరగడానికి ప్రధాన కారణం శివాజీ అనే చెప్పాలి. అతను చేసిన పని వల్లే ఈ వీక్ అసలు కెప్టెన్ అనేవాడు లేకుండా పోయాడు. అర్జున్ కూడా చివరికి అమర్ కు హెల్ప్ చేయలేదు. కానీ, శివాజీ- అర్జున్ మాత్రం మాటలు మార్చడం చూశాం. ఈ వీక్ కూడా అమర్ కు ఎంతో పాజిటివ్ అయ్యింది. అందరూ అమర్ ని టార్గెట్ చేసి మరీ హీరోని చేసేస్తున్నారు.

కెప్టెన్సీ కోసం పాయింట్ బ్లాంక్ అనే టాస్కు పెట్టారు. అందులో గన్ సౌండ్ వచ్చినప్పుడు ఇద్దరు సభ్యులు వెళ్లి బాక్సులో నిలబడాలి. వాళ్లకి ఎదురుగా ఇద్దరు ఇంటి సభ్యుల ఫొటోలు వస్తాయి. వాటిలో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. అందుకు తగిన కారణాలు కూడా చెప్పాలి. హౌస్ మేట్స్ అందరూ వారి వారి కారణాలు చెబుతూ ఒక్కొక్కరిని తీసేస్తూ వచ్చారు. రతిక, అశ్వినీ వంటి వాళ్లు కూడా ఈ రేసు నుంచి తప్పుకున్నారు. వాళ్లు కూడా హౌస్ లో కెప్టెన్స్ కాలేదు. కానీ, వారిని కూడా తప్పించేశారు. ముఖ్యంగా ఈ టాస్కు మొత్తం అర్జున్, అమర్ కోసం జరిగింది. కొంతమంది అమర్ ని కెప్టెన్ చేయాలి అని.. శివాజీ మాత్రం అర్జున్ ని కెప్టెన్ చేయాలి అని పూనుకున్నారు. ముందు అమర్ సపోర్ట్ అడిగినప్పుడు శివాజీ చెప్పిన మాటలు చూసి అందరూ ఈ వీక్ అమర్ కెప్టన్ అయ్యాడు అనుకున్నారు.

చివరికి వచ్చేసరికి శివాజీ.. అమర్ కు వెన్నుపోటు పొడిచాడు. ముందు సపోర్ట్ చేస్తానని చెప్పడం మాత్రమే కాదు.. యావర్ ని కూడా సపోర్ట్ చేయమని చెప్పాడు. కానీ, లాస్ట్ కి వచ్చేసరికి మాత్రం మాట మార్చేశాడు. మధ్యలో డిప్యూటీలను ఎవరిని పెట్టుకుంటావ్ అని అమర్ ని అడిగితే ప్రియాంక, శోభా పేర్లు చెప్పాడు. అందుకు నువ్వు మారవురా అంటూ శివాజీ అన్నాడు. ఆ తర్వాత తన స్టాండ్ మార్చుకున్నాడు. అర్జున్ వైఫ్ నన్ను అడిగింది. ఆమె నాకు బిడ్డలెక్క నేను అర్జున్ ని కెప్టెన్ చేస్తాను అన్నాడు. అంటే శివాజీ మొదట అమర్ కి సపోర్ట్ చేస్తాను అన్నమాట నిజం అయితే బిడ్డ కోసం అర్జున్ ని కెప్టెన్ చేస్తాను అనడం అబద్ధం. ఒకవేళ అర్జున్ ని కెప్టెన్ చేస్తాను అంటే.. అమర్ కి సపోర్ట్ చేస్తాను అని మాటివ్వడం అబద్ధం. ఇవి రెండూ పక్కన పెడితే ఇంకా వీఐపీ రూమ్ చూడని వాళ్లు ఉన్నారు వారికి డిప్యూటీ ఛాన్స్ ఇస్తాను అని కూడా నువ్వు అనలేదు అన్నాడు. అసలు అర్జున్ ని కెప్టెన్ చేస్తాను అన్నప్పుడు అమర్ డిప్యూటీలను ఎవరిని ఎంచుకుంటే శివాజీకి ఎందుకు? ఇక్కడ మొత్తం ఆటలో శివాజీ సేఫ్ గేమ్ మాత్రమే కాకుండా డబుల్ గేమ్, ఫ్లిప్ గేమ్ ఆడుతూ.. పదే పదే దొరికిపోతున్నాడు. పైగా అమర్ ని సింపథీ గేమ్లు ఆడద్దు అంటూ కామెంట్స్ చేశాడు.

చివరికి అమర్ ఎంతో బతిమాలిన తర్వాత తన మనసు మార్చుకున్నట్లు యాక్ట్ చేశాడు. కానీ, అప్పటికే అంతా అయిపోయింది. బిగ్ బాస్ ఈ టాస్కును తీసేస్తున్నాం. ఈ వీక్ అసలు ఎవరూ కెప్టెన్ కాదు అంటూ ప్రకటించాడు. ఇక్కడ శివాజీ అమర్ ని కెప్టెన్ చేయాలి అని ఎక్కడా అనుకున్న భావన కనిపించలేదు. తనని సపోర్ట్ చేస్తున్నాను అనే ముసుగులో అతనికి గట్టిగానే వెన్నుపోటు పొడిచాడు. ఇంక అర్జున్ కూడా ఒకానొక సమయంలో మాట మార్చాడు. నీకోసం నేను తప్పుకునే వాడిని.. కానీ, శోభా ఆ మాట అనగానే నేను ట్రిగర్ అయ్యాను అంటూ శోభా మీద వంక చూపించాడు. శోభా మాత్రం తన ఫ్రెండ్ ని కెప్టెన్ చేసుకోవడం కోసం శివాజీని చేతులు పట్టుకుని ఏడుస్తూ బతిమాలుకుంది. నిజానికి శోభా తనకోసం కూడా అలా బతిమాలుకుని ఉండదేమో? అమర్, శోభాకి ఇది చాలామంచి పాజిటివ్ ఎపిసోడ్ అవుతుంది. మరి.. అమర్ కెప్టెన్ అయితే బాగుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.