iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న ఈ బ్యూటీ ఎవరంటే?

  • Published Oct 06, 2023 | 6:18 PM Updated Updated Oct 06, 2023 | 6:18 PM
  • Published Oct 06, 2023 | 6:18 PMUpdated Oct 06, 2023 | 6:18 PM
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న ఈ బ్యూటీ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఇప్పటి వరకు ఒక లెక్క.. ఆదివారం నుంచి ఒక లెక్క అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్ మీద ఫుల్ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అందరూ ఆదివారం ఎపిసోడ్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారు అంటూ తెగ ఆలోచించేస్తున్నారు. అయితే కొన్ని పేర్లు మాత్రం పక్కగా హౌస్ లోకి వెళ్లేది వీళ్లే అంటూ ప్రచారం చేస్తున్నారు. నయని పావని, కెవ్వు కార్తిక్, అంబటి అర్జున్, భోలే షావలే, పూజా మూర్తి, అంజలి పవన్ హౌస్ లోకి వెళ్తున్నారని చెబుతున్నారు. దాదాపుగా వీళ్ల పేర్లు కన్ఫామ్ అంటున్నారు.

అయితే లాస్ట్ లో మాత్రం అంజలి పవన్ డ్రాప్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సీజన్ లో సీరియల్ బ్యాచ్ అంటూ అమర్, ప్రియాంక, శోభాశెట్టిలకు ముద్రవేశారు. వాళ్లంతా కలిసే ఆడుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పుడు హౌస్ లోకి వెళ్తే.. అంజలి పవన్ కూడా అదే కోవకు చెందినది అవుతుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉండటమే మంచిదని భావించినట్లు తెలుస్తోంది. అయితే అంజలి పవన్ కు మరో బంపరాఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆమెకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 వైల్డ్ కార్డ్, బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆప్షన్స్ ఇచ్చినట్లు చెబుతున్నారు. వాటిలో ఒకటి సెలక్ట్ చేసుకోమని చెప్పారంట. అయితే అంజలి పవన్ తాను బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి ఫిక్స్ అయినట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Ashwini Sri (@ashwinii_sree)

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అంజలి పవన్ కంటెస్టెంట్ రాబోతోందని ఇప్పటి నుంచే టాక్ మొదలైంది. ఆమె స్థానంలో మరో నటికి బిగ్ బాస్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. అశ్వినీ శ్రీ బిగ్ బాస్ హౌస్ లోకి అంజలి పవన్ ప్లేస్ రాబోతున్నట్లు చెబుతున్నారు. ఈమె సోషల్ మీడియా పిక్స్ చూసిన తర్వాత అశ్వినీ శ్రీ హౌస్ లోకి వస్తే.. గ్లామర్ డోస్ మరింత పెరుగుతుందని ఆశలు పెట్టేసుకుంటున్నారు. ఈ బ్యూటీ తప్పకుండా హౌస్ లోకి రావాలి అంటూ తెగ కోరుకుంటున్నారు. అయితే అశ్వినీ శ్రీ దాదాపు ఖరారు అయిపోయినట్లు సమాచారం. ఇక నుంచి ఆట గేరు మారబోతోంది. ఎందుకంటే కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి రావడం వల్ల.. ఇప్పటికే ఉన్న వారి నుంచి గట్టి పోటీ లభిస్తుంది. అలాగే బయట ఇప్పటివరకు ఆట చూసి.. హౌస్ లో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అనేది తెలుసుకుని వెళ్లడం కొత్త వాళ్లకి ప్లస్ అవుతుంది. మరి.. బిగ్ బాస్ హౌస్ లోకి అశ్వినీ శ్రీ వెళ్తోంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet