Bigg Boss 7 Telugu: అమర్ బిగ్ బాస్ కి పనికిరాడు.. తేజశ్వినీ చెప్పిన 7 సూత్రాలు!

బిగ్ బాస్ హౌస్ అంటే కేవలం కండబలం ఉంటే సరిపోదు.. బుద్ధి బలం కూడా ఉండాలి. హౌస్ లో ఎత్తుకు పైఎత్తులు వేయగలగాలి. బిగ్ బాస్ అంటే ఇంట్లోనే కాదు.. బయట పీఆర్ లతో కూడా ఆడాలి అంటూ బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ చేసిన కామెంట్స్ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరు ఆటగాళ్లు అవుతారు.. ఎవరు ఆటలో అరటిపండు అవుతారో ఎవ్వరూ చెప్పలేరు. అందరూ మంచి పేరు సంపాదించుకోవాలి అనే వస్తారు. కానీ, కొంతమందికి మాత్రం ఆట అర్థంకాకనో.. మైండ్ గేములు ఆడటం రాకనో బ్యాడ్ అయిపోతారు. ఇప్పుడు అమర్ దీప్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే అమర్ కి బిగ్ బాస్ పనికి రాదని అతని భార్య ముందే చెప్పింది.

అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత అతని ఆట చూసిన ప్రేక్షకుల్లో చాలా మంది.. ‘సీరియల్స్ చూసి ఫ్యాన్ అయ్యాం.. రియల్ గా చూసి ఫీలయ్యాం’ అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అమర్ కూడా సేవ్ అయిన ప్రతివారం ఇది నాకు మరో అవకాశం అన్నట్లు తెగ ఎమోషనల్ అయిపోతున్నాడు. తోపు ప్లేయర్, టైటిల్ ఫేవరెట్ అనుకున్న అమర్ దీప్ ను అందరూ ఆడేసుకుంటున్నారు. అసలు నీకు ఆట అర్థం కావడం లేదు అంటూ జోకులు వేస్తున్నారు. బిగ్ బాస్ కూడా అమర్ మీద ఎక్కువ పంచులు వేస్తున్నాడు. హోస్ట్ నాగార్జున సైతం ఇంకెప్పుడు ఆడతావ్ అమర్ అంటూ ప్రతివారం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అయితే అమర్ దీప్ బిగ్ బాస్ కి అన్ ఫిట్ అంతా ఇప్పుడు అనుకుంటున్నారు. కానీ, అమర్ దీప్ భార్య తేజశ్వినీ గౌడ అతను బిగ్ బాస్ కి అన్ ఫిట్ అని ఎప్పుడో చెప్పేసింది.

అమర్ గురించి మాట్లాడుతూ.. “అమర్ దీప్ ది చిన్న పిల్లాడి మనస్తత్వం. చిన్నపిల్లలు చెప్తే ఒక్కోసారి వింటారు.. ఒక్కోసారి వినరు. చంటిపిల్లలను హ్యాండిల్ చేయడం వస్తే.. అమర్ దీప్ ని హ్యాండిల్ చేయడం వచ్చినట్లే. నీతోనే డాన్స్ షోలో కూడా అమర్ ని సదా మేడమ్ రైజింగ్ కిడ్ అని చెప్పారు. అమర్ ని అర్థం చేసుకోవాలి. అపార్థం చేసుకోకూడదు. బిగ్ బాస్ హౌస్ అనగానే నాకు ముందే ఏంటి పరిస్థితి అనిపించింది. ఎందుకంటే ఇక్కడ అంటే మనం అది కాదు.. ఇదీ అని చెప్తాం. కానీ, అక్కడ అందరూ మైండ్ గేమ్ ఆడతారు. ముందు మంచిగా నటించి తర్వాత మైండ్ గేమ్ ఆడతారు. అమర్ దీప్ ని అసలు అర్థం చేసుకుంటారా? అతను మాట్లాడేతి మరోసా అర్థం చేసుకుంటారా అని అనుకున్నాను. అయినా అమర్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అమర్ గురించి బయట జనాలకు తెలియదు. హౌస్ లోకి వచ్చే వాళ్లకు కూడా ఏం తెలియదు. 24 గంట్లలో కేవలం ఒక గంట మాత్రమే మీరు చూస్తారు. ఎక్కడన్నా ఒక తప్పు మాట్లాడితే దాన్ని చూపిస్తారు. అమర్ మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి.. మైండ్ గేమ్ ఆడేవాళ్ల మధ్య ఎలా ఉంటాడో అని ముందునుంచే భయపడ్డాను” అంటూ తేజశ్వినీ గౌడ చెప్పుకొచ్చింది. నిజానికి తేజు చెప్పిన మాటలు అమర్ దీప్ విని గేమ్ ఆడుతూ ఉంటే నిజంగానే హౌస్ లో టాప్ ప్లేయర్ అయ్యేవాడు. కానీ, అలా జరగడంలేదు.

అమర్ హౌస్ లోకి వెళ్లే ముంది తేజు చెప్పిన 7 సూత్రాలు:

  • మరీ హైపర్ అవ్వొద్దు
  • మాట్లాడుతున్న ప్లేస్ గుర్తుంచుకో
  • ఏదైనా కరెక్ట్‌గా మాట్లాడు
  • ఎంత వరకు మాట్లాడాలో అంతే మాట్లాడు
  • నువ్వు నీలాగే ఉండు.. నీకోసమే ఆడు
  • మైండ్ గేమ్‌ని అర్థం చేసుకో
  • ఎవర్నీ నమ్మద్దు
Show comments