iDreamPost
android-app
ios-app

మిరప మొక్కని ఎలా పెంచుతారో తెలీదా నాగ్! ప్రశాంత్ తప్పేముంది?

మిరప మొక్కని ఎలా పెంచుతారో తెలీదా నాగ్! ప్రశాంత్ తప్పేముంది?

బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ లో అక్కినేని నాగార్జున ఏం మాట్లాడతారు అని ఎదురుచూసిన అందరిలో ఆసక్తిని మరింత రేకెత్తించేలా ప్రోమో సాగింది. ఈ వీక్ మొత్తం కంటెస్టెంట్స్ చేసిన తప్పులు, ఒప్పులు, సాధించిన విజయాలు, వదిలేసిన అవకాశాలు.. అన్నింటి గురించి నాగార్జున ప్రస్తావించారు. ముఖ్యంగా హౌస్ లో జరిగిన గొడవల గురించి నాగార్జున కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకారు. ముఖ్యంగా అమర్ దీప్- పల్లవి ప్రశాంత్ కి మధ్య జరిగిన గొడవ గురించి నాగార్జున మాట్లాడారు. ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తూ అతని డబ్బు అతనికి నచ్చిన వాళ్లకు ఇచ్చుకుంటాడు నీకేంటి సమస్య అని ప్రశ్నించాడు. అయితే పల్లవి ప్రశాంత్ ని కూడా నాగార్జున టార్గెట్ చేసినట్లు అనిపించింది.

పల్లవి ప్రశాంత్ ని హౌస్ లోకి పంపిస్తూ.. అతనికి ఒక మొక్క ఇచ్చి పంపించారు. ఆ మిరప మొక్కని పెంచి కాయలు కాయించాలి అంటూ నాగార్జున చెప్పిం పంపించాడు. దానికి రోజు పల్లవి ప్రశాంత్ రోజూ ఉదయాన్నే లేచి నీళ్లు పోయడం చేస్తున్నాడు. అయితే ఆ మొక్క ఆకులు అన్నీ రాలిపోయి మొత్తం ఎండిపోయినట్లు అయిపోయింది. తాజా ఎపిసోడ్ లో ఆ మొక్కను స్టేజ్ మీదకు తీసుకొచ్చి నాగార్జున చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఒక మొక్కని చూసుకోలేని వాడు రైతు బిడ్డా? అని ప్రశ్నించారు. అందుకు ప్రశాంత్ కూడా తెల్లముఖం వేస్తాడు.

ఇక్కడ నాగార్జున మర్చిపోయిన విషయం ఏంటంటే.. అది మామూలుగా నీళ్లు పోస్తే పెరిగే మొక్కకాదు. మీరు ఇచ్చి పంపింది మిరప మొక్క. మిరప మొక్క నాటిన దగ్గరి నుంచి అది కాపు కాసే వరకు కూడా దానికి రకరకాల ఎరువులు, పురుగు మందులు వేయాల్సి ఉంటుంది. మొక్క పెరగాలన్నా, కాపు కాయాలి అన్నా అందుకు తగిన పోషకాలు కావాలి. హౌస్ లోకి మొక్క పంపి రోజూ నీళ్లు పోస్తూ దానిని పెంచాలి అంటే ఎలాకుదురుతుంది? మిరప మొక్కకు ఆకు ముడత తెగులు వస్తే.. ఆకులు మొత్తం రాలిపోతాయి. అదే జరిగితే తర్వాత మొక్క కూడా ఎండిపోతుంది. ఆ తర్వాత మళ్లీ కొత్త చిగురు రావాలి అంటే.. కచ్చితంగా మందులు కొట్టాల్సిందే. ఆ విషయం రైతులు అందరికీ తెలుసు. కానీ, ఈ చిన్న విషయాన్ని నాగార్జున ఎలా మర్చిపోయాడు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. పైగా ప్రశాంత్ ని రైతు బిడ్డా? అని ప్రశ్నించడం కూడా మరీ దారుణంగా అనిపించింది.

తప్పు మీరు చేసి.. నింద మాత్రం పల్లవి ప్రశాంత్ పై వేస్తున్నారు. అక్కడికీ మొదటి నుంచి పల్లవి ప్రశాంత్ అడుగుతూనే ఉన్నాడు. మొక్కకు ఎరువులు కావాలి, మందులు కొట్టాలి అని. ఆ విషయాన్ని ఫస్ట్ వీక్ ఎపిసోడ్ లో కూడా ప్రశాంత్ నేరుగా నాగార్జునాకే చెప్పాడు. అప్పుడు ఎవరూ అతను చెప్పింది చెవికి ఎక్కించుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం స్టేజ్ మీదకు మొక్కని తెచ్చి.. ఇదీ నీ పనితనం అంటూ ప్రశాంత్ ని తక్కువ చేయడం అస్సలు కరెక్ట్ గా అనిపించడం లేదు. మరి.. మొక్క విషయంలో నాగార్జున చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş