iDreamPost
android-app
ios-app

నాగార్జునపై సందీప్‌ మాస్టర్‌ భార్య ఫైర్‌.. నా భర్తను అలా అంటారా అంటూ ఆగ్రహం

  • Published Oct 16, 2023 | 8:48 AM Updated Updated Oct 16, 2023 | 8:48 AM
  • Published Oct 16, 2023 | 8:48 AMUpdated Oct 16, 2023 | 8:48 AM
నాగార్జునపై సందీప్‌ మాస్టర్‌ భార్య ఫైర్‌.. నా భర్తను అలా అంటారా అంటూ ఆగ్రహం

ముందు నుంచి చెబుతున్నట్లే.. ప్రారంభం నుంచే ఉల్టా పుల్టా అంటూ గత సీజన్‌లకు భిన్నంగా సాగుతోంది బిగ్‌ బాస్‌ సీజన్‌ 7. ఊహించని ట్విస్ట్‌లతో.. అనూహ్యంగా సాగే ఎలిమినేషన్లతో ఎంతో రసవత్తరంగా సాగుతూ.. ప్రేక్షకులను అలరిస్తోంది బిగ్‌ బాస్‌ సీజన్‌ 7. ఇక బీబీ 7 లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సందీప్‌ మాస్టర్‌.. తొలి రోజు నుంచి తనదైన శైలీలో గేమ్‌ ప్లే చేస్తూ.. ప్రారంభంలోనే ఐదు వారాల ఇమ్యూనిటీ సంపాదించాడు. అయితే సంచాలక్‌గా ఉన్న సందర్భాల్లో.. కొందరు కంటెస్టెంట్లకు ఫేవర్‌గా వ్యవహరించాడన్న కారణంగా నెగిటివిటిని మూటగట్టుకున్నాడు. తన తప్పుడు నిర్ణయాల కారణంగా వీకెండ్‌ షోలో.. నాగార్జునతోనూ తిట్లు తిన్నాడు.

ఇక సందీప్‌ తీరుపై నాగార్జున ఒకానొక దశలో ‘‘హౌజ్‌లో నువ్వు ఏమైనా పిస్తావా’’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు. అయితే తన భర్తను.. నాగార్జున అలా తిట్టడంపై సందీప్‌ మాస్టర్‌ జ్యోతి రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త కామ్‌గా ఉన్నారని అందరూ ఆయనను గెలుకుతున్నారు. ఒక వేళ ఆయన రివర్స్‌ అయితే ఎవరూ తట్టుకోలేరంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఆట సందీప్‌ని నాగార్జున అలా తిట్టడంపై ఆయన భార్య జ్యోతి రాజ్.. ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నాగార్జున గారు.. నా భర్త సందీప్‌ని అలా తిట్టడం నాకు నచ్చలేదు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నారేంటి అని చాలా ఫీల్ అయ్యాను. నా భర్త నాకు గొప్ప. అక్కడ ఉన్నది నాగార్జున గారని కాదు.. ఒక భార్యగా నా భర్త నాకు గొప్ప. నా ఎదురుగా ఉన్న వాళ్లు ఎంత గొప్పవాళ్లు అయినా.. ఏ స్థాయిలో ఉన్నా కూడా నా భర్తే నాకు గొప్ప. నాగార్జున గారు అంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికి కూడా నా భర్తను అలా అంటే తట్టుకోలేకపోయాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

‘‘బిగ్‌ బాస్‌ హౌజ్‌లో నా భర్త నటిస్తున్నాడని అంటున్నారు. కోపాన్ని తగ్గించుకుని యాక్ట్‌ చేస్తున్నాడని, అలాగే తను ఒరిజినల్‌ సందీప్‌ కాదని అంటున్నారు. బిగ్ బాస్ అనేది డ్యాన్స్ రియాలిటీ షో కాదు. తన ప్రొఫెషనల్‌గా మాత్రమే అగ్రెసీవ్‌గా ఉంటాడు. మిగతా సమయాల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటాడు. అందుకే తను ఇంట్లో మాతో ఎలా ఉన్నాడో బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూడా అలాగే ఉంటున్నాడు. బిగ్‌బాస్‌కు వెళ్లేటప్పుడే దీనిపై మేం చర్చించుకున్నాం. టైటిల్‌ గెలిచినా, గెలవకపోయినా.. ప్రేక్షకుల మనసులు గెలవాలని సందీప్‌తో చెప్పాం. ఈ కారణంగానే ఆయన బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎంతో కూల్‌గా ఉంటున్నారు. అయితే దీన్నే అవకాశంగా తీసుకుని చాలామంది నా భర్తను కావాలనే రెచ్చగొడుతున్నారు’’ అని చెప్పుకొచ్చింది.

అంతేకాక ‘‘ఒకవేళ సందీప్‌ కనుక తిరిగి ఇచ్చాడంటే ఆయన ఎదురుగా ఎవ్వరూ నిలవలేరు. మాటకు మాట.. దెబ్బకు దెబ్బ ఇచ్చి పడేస్తారు. కానీ ఆయన అంత దాక వెళ్లడం ఎందుకు అని ఊరుకుని.. కేవలం బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్కులపైనే దృష్టి పెడుతున్నాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో తను బెస్ట్‌ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాడు. సందీప్‌కు ఇప్పటికే ఎంతో క్రేజ్‌ ఉంది.. ఇక బిగ్‌బాస్‌ షోతో మాకు ఒరిగిదేమి లేదు’’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది జ్యోతి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio