Tirupathi Rao
బిగ్ బాస్ హౌస్ లో గొడవలకు ఎలాంటి కొదవ ఉండదు. కారణం లేకున్నా కూడా గొడవలు పెట్టుకుంటారు. అయితే అమర్- యావర్ గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.
బిగ్ బాస్ హౌస్ లో గొడవలకు ఎలాంటి కొదవ ఉండదు. కారణం లేకున్నా కూడా గొడవలు పెట్టుకుంటారు. అయితే అమర్- యావర్ గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఉండే కొద్దీ బాగా ఉత్కంఠగా సాగుతోంది. ముఖ్యంగా కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో రచ్చ రచ్చ జరిగింది. ఈ వీక్ కి హౌస్ కి కొత్త కెప్టెన్ ఎవరు అవుతారు అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ వీక్ కొత్త కెప్టెన్ గా శివాజీని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ప్రోమోలో చూపించిన ప్రకారం.. హౌస్ లో అందరినీ అర్జున్- శివాజీలో ఎవరిని మీరు కెప్టెన్ గా చూడాలి అనుకుంటున్నారు? అనే ప్రశ్నను అడిగారు. అయితే దాదాపుగా అందరూ శివాజీ కెప్టెన్సీ చూడాలని కోరుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ వీక్ శివాజీ కెప్టెన్ అయినట్లు లీకులు వస్తున్నాయి. ఇంక శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో యావర్- అమర్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఈ గొడవలో తప్పు ఎవరిదో చూద్దాం.
బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు అన్నీ కూడా గొడవలకు మూలాధారంగా ఉంటాయి. అంటే మీరు అక్కడ ప్రత్యేకంగా గొడవలు పెట్టుకోవాలి అని ఎతుక్కోవాల్సిన అవసరం లేదు. టాస్కు ఆడుతూ ఉంటే సాధారణంగానే గొడవలు జరిగిపోతాయి. తాజాగా అమర్- యావర్ మధ్య కూడా ఒక గొడవ జరిగింది. అమర్ మొదటి నుంచి ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఒకసారి కెప్టెన్ అయిన వాళ్లని మళ్లీ కెప్టెన్ అవ్వనివ్వను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ స్టాండ్ ప్రకారమే యావర్ బొమ్మను తీసుకుని ఆటలో ఆగిపోయాడు. అప్పుడు యావర్ ఆట నుంచి తప్పుకున్నాడు. అయితే యావర్- గౌతమ్- అర్జున్ ముందే మాట్లాడుకుని ఆట స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. వాల్లు ముగ్గురూ కలిసి ఆడాలి అనుకున్నారు. అయితే అర్జున్ మాత్రం నన్ను అడిగారు నేను ఆడతాను అని చెప్పలేదు అన్నాడు.
మొత్తానికి యావర్ బొమ్మ తీసుకుని అమర్ లోపలికి వెళ్లకపోయేసరికి యావర్ కి చిర్రెత్తుకొచ్చింది. ఇది నీ గేమ్ అని చెప్పు. స్ట్రాటజీ అదీ ఇది కాదు అంటూ స్టార్ట్ చేశాడు. ఇంక అమర్ కూడా కేకలు వేయడం ప్రారంభించాడు. అయితే ఫ్యామిలీ వీకెండ్ లో పాత యావర్ ను చూడాలి అని అన్న చెప్పిన మాటను బాగా తలకి ఎక్కించుకున్నట్లు కనిపించింది. ఎందుకంటే అకారణంగానే యావర్ పెద్ద గొడవ చేసినట్లు అనిపించింది. సాధారణంగా గేమ్ లో ఒకళ్లు ఎలిమినేట్ కావాల్సిందే. ఇంక ఒకరి బొమ్మను మరొకరు తీసుకోవాలి కాబట్టి తప్పకుండా ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. రతికా రోజ్ అయితే ప్రతి రౌండ్ కావాలనే చిన్నగా ఆడింది. ఆఖరికి తన బొమ్మే మిగిలిపోయి ఎలిమినేట్ అయింది. ఇంకొకటి యావర్ కూడా ఆటను జెన్యూన్ గా ఆడాలి అనుకుంటే గౌతమ్ తో డీల్ చేసుకోకుండా ఉండాలి.
తనకి దొరికిన ఏ బొమ్మని అయినా తీసుకుని వెళ్లిపోవాలి. తర్వాత అమర్ కూడా ఆట నుంచి తప్పుకున్నాడు. అయితే యావర్ కి అమర్ కి నామినేషన్స్ అప్పటి నుంచే గొడవ స్టార్ట్ అయింది. ఎప్పుడో సెకండ్ వీక్ విషయాలను తీసుకొచ్చి ఇప్పుడు నామినేట్ చేయాలని చూశాడు. కానీ, రాజమాతలు అంగీకరించలేదు. అమర్ కూడా తాను తీసుకున్న నిర్ణయంపై గట్టిగానే నిలబడ్డాడు. కెప్టెన్ అయిన వాళ్లని కెప్టెన్ అవ్వనివ్వను అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. యావర్ తో జరిగిన గొడవలో మాత్రం అమర్ స్ట్రాటజీ ప్లే చేశాడు. యావర్ మాత్రం ఆటను అర్థం చేసుకోకుండా కాస్త గొడవ చేసినట్లు అనిపిచిందం. మరి.. అమర్- యావర్ గొడవలో తప్పు ఎవరిది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.