iDreamPost
android-app
ios-app

సీఎంని చేయండి.. వారికి సాయం చేస్తా : Big Boss విన్నర్ పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు రైతు బిడ్డ, సామాన్యుడు పల్లవి ప్రశాంత్. తన ఆట తీరుతో, అమాయకత్వంతో గేమ్ షోలో అలరించిన ఈ కంటెస్టెంట్.. ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఇప్పుడు తన విజయానికి కారకులైన..

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు రైతు బిడ్డ, సామాన్యుడు పల్లవి ప్రశాంత్. తన ఆట తీరుతో, అమాయకత్వంతో గేమ్ షోలో అలరించిన ఈ కంటెస్టెంట్.. ఆడియెన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. అయితే ఇప్పుడు తన విజయానికి కారకులైన..

సీఎంని చేయండి.. వారికి సాయం చేస్తా : Big Boss విన్నర్ పల్లవి ప్రశాంత్

బుల్లితెరపై ఫన్ అండ్ ఎంటర్ టైన్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7కి తెరపడింది. కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే ఇప్పుడు అతనికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో కూడా నూతన నాయుడు, ఆదిరెడ్డి వంటి సామాన్యులు ఇంట్లోకి వచ్చినా.. పల్లవి ప్రశాంత్ అంత ఫేమస్ కాలేకపోయారు. తన ఆట తీరు, అమాయకత్వంతో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టాడు ఈ రైతు బిడ్డ. బిగ్ బాస్ హౌస్‌ లోకి రాకముందే రైతు బిడ్డగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ గా కాస్తో, కూస్తో జనాలకు తెలిసినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలకు ఫేమస్ అయ్యింది మాత్రం ఈ షోతోనే. ఈ రియాలిటీ షోలోకి రావాలని ‘అన్నా నేను మళ్లీ వచ్చినా, బిగ్ బాస్‌కు వెళ్లాలని అనుకుంటున్నా. మా రైతులు పడే కష్టాన్ని తెలియజేయాలనుకుంటున్నా.. జై జవాన్, జై కిసాన్’ అంటూ వీడియోలు చేశాడు.

అవి కాస్తా వైరల్ అయ్యి బిగ్ బాస్ టీం దృష్టికి చేరాయి. ఇక బిగ్ బాస్‌ కు వెళుతున్నానని తెలిశాక అతడి ఆనందానికి అవధుల్లేవు. తాను సెలబ్రిటీ కాదు కాబట్టి.. తనకు సపోర్ట్ చేయాలంటూ.. తోటి యూట్యూబర్లను, మీడియా యాంకర్లను అడిగి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. వారు ఇచ్చిన సపోర్టుతో సామాన్యుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. అనుకున్నట్లే తన ఆట తీరుతో, వినమ్రంగా ఉంటూ.. బాధ కలిగినప్పుడు చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తొలుత సింపథీ గేమ్ ఆడుతున్నాడని, అతడితో రెండు షేడ్స్ ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ.. తన తప్పులను సరి చేసుకుంటూ.. టాప్ 6 కంటెస్టుల జాబితాలోకి చేరాడు. అయితే ఆది నుంచి అతడే విన్నర్ అవుతాడని ఉన్నప్పటికీ.. శివాజీ, అమర్ లాంటి బలమైన పోటీ దారులు ఉండటంతో.. అంచనాలు కాస్త అదుపు తప్పాయి. కానీ ఆశించినట్లే.. ప్రశాంత్ విన్నర్ అయ్యాడు.

ఇక విజేతగా బయటకు వచ్చిన ప్రశాంత్ రెండో కోణాన్ని ప్రదర్శించాడు. ఎవరైతే తన విజయానికి కారణమయ్యారో వాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. ఇంటర్వ్యూలు ఇస్తానని ఇంటికి పిలిచి.. ఆ తర్వాత కల్లబొల్లి కబుర్లు చెప్పడం, యూట్యూబర్లను, యాంకర్లను గంటలు గంటలు వెయిట్ చేయించి.. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పాడు. సుమారు 10 మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టాడు ఈ రైతు బిడ్డ. 10 నిమిషాల ఇంటర్వ్యూ ఇవ్వమని కోరితే.. ‘మీరు పొలం దగ్గరకు పనులు చేయండి, వీడియోలు తీసుకోండి, మీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి రైతులకు ఏమిస్తారో చెప్పుర్రి. ఆ తర్వాతే మీకు ఇంటర్వ్యూలు ఇస్తా’ అంటూ ఓవర్ యాక్షన్ చేశాడు.

దీంతో ఓ యూట్యూబర్ ‘మీ సమీపంలోనే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఉంది. మీరు రైతుగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయిన దాదాపు 14 గ్రామాల రైతులకు మీరేమైనా సాయం చేశారా? వారికి మద్దతుగా నిలిచారా?’ అని అడగ్గా.. వెటకారంగా సమాధానం ఇచ్చాడు. ‘నాకేమైనా సీఎం పదవి ఇచ్చిర్రా? ఏదైనా చేయడానికి, నేను ఒక రైతు బిడ్డను కదా. సీఎం చేస్తరా చెప్పుండ్రి. అందరినీ ఆదుకుంటా. నేనేమైనా నాయకుడినా, నేనేం చేస్తా’ అంటూ పొగరుగా సమాధానం ఇచ్చాడు. ఈ మాటలు, అతడి చర్యలను మీడియా యాంకర్లు తప్పు పడుతున్నారు. మరి అతడు నిజంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక తనలో ఉన్న రెండో కోణాన్ని బయటపెట్టినట్లు మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.