iDreamPost
android-app
ios-app

5 వారాల్లో భోలేకి దక్కింది ఎన్ని లక్షలంటే?

  • Published Nov 13, 2023 | 11:30 AM Updated Updated Nov 13, 2023 | 11:30 AM

బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సిందే. ఈ వారం భోలే షావలీ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అతని పాట, ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో వారానికి ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటకు రావాల్సిందే. ఈ వారం భోలే షావలీ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అతని పాట, ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు.

  • Published Nov 13, 2023 | 11:30 AMUpdated Nov 13, 2023 | 11:30 AM
5 వారాల్లో భోలేకి దక్కింది ఎన్ని లక్షలంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఉత్కంఠగా సాగుతోంది. వీకెండ్ లో మస్తీ ఎలా ఉంటుందో ఎలిమినేషన్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ వారం అందరికీ షాకిస్తూ భోలే షావలీని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే. నిజానికి భోలే ఎలమినేషన్ షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే భోలే ఆట ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యింది. బయట అతని క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఆట గాడిలో పడిన సమయంలో ఇలా అందరికీ షాకిస్తూ భోలేని ఎలిమినేట్ చేశారు. అలాగే యావర కూడా చివరి వరకు వచ్చాడు. ఆఖరి రౌండ్ వరకు రావడం యావర్ కు ఇదే మొదటిసారి. అతని ఆట ఎంత దిగజారిందో చెప్పడానికే ఆఖరు వరికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ లో భోలేకి ఎంత రెమ్యూనరేషన్ దక్కిందో చూద్దాం.

భోలే షావలీ హౌస్ లోకి పాట బిడ్డగా వచ్చాడు. అయితే మొదటి రెండు వారాల్లో భోలే ఆట చూస్తే అందరికీ చిరాకు వచ్చింది. తన హక్కు కోసం కూడా తాను ఫైట్ చేయలేదు. ఎవరు అడిగినా వెంటనే త్యాగాలు చేయడం. ఎవరు త్యాగం అన్నా కూడా నేనున్నాను అంటూ చేతులు ఎత్తేయడం చేశాడు. ఏమన్నా కూడా నవ్వుతూ సైడ్ అయిపోయేవాడు. అదంతా చూసిన ప్రేక్షకులు ఇదేం ఆట అంటూ తలలు పట్టుకున్నారు. ఆ తర్వాత నుంచి భోలే గేరు మార్చాడు. ఆర్గుమెంట్లు చేయడం, టాస్కులు ఆడటం మొదలు పెట్టాడు. అమర్ లాంటి వాళ్లు నామినేట్ చేస్తే తన పాయింట్ తాను పక్కాగా చెప్పడం నేర్చుకున్నాడు.

తనకోసం మాత్రమే కాకుండా.. అశ్వినీ లాంటి వాళ్ల కోసం కూడా స్టాండ్ తీసుకున్నాడు. అలాంటి భోలేకి బయట మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా అతని పాటలకు బయట ఫ్యాన్స్ పెరిగిపోయారు. అప్పటికప్పుడు అతను పాటలు పాడటం, ట్యూనులు కట్టడం చూసి అందరూ షాకవుతున్నారు. నిన్న స్టేజ్ మీద శ్రీలీల గురించి కూడా అప్పటికప్పుడే అద్భుతమైన పాట పాడాడు. హౌస్ మేట్స్ గురించి కూడా ఆన్ స్పాట్ ఒక సూపర్ సాంగ్ పాడాడు. ఇవన్నీ చూసిన తర్వాత భోలే ఎలిమినేషన్ అనగానే అందరూ షాకయ్యారు. ఉన్నన్ని రోజులు మాత్రం భోలే మంచిగా ఉండి.. మంచి పేరు తెచ్చుకుని బయటకు వచ్చాడు.

ఇప్పుడు భోలే బయటకు వచ్చిన తర్వాత అతని రెమ్యూనరేషన్ గురించి టాక్ మొదలైంది. అయితే భోలే షావలీకి వచ్చిన రెమ్యూనరేషన్ మరీ అంత గొప్పగా ఏం లేదని తెలుస్తోంది. వైల్డ్ కార్డుగా వచ్చిన భోలే హౌస్ లో మొత్తం 5 వారాలు ఉన్నాడు. ఈ 5 వీక్స్ గానూ.. భోలే షావలీకి రూ.12 లక్షలు దక్కినట్లు చెబుతున్నారు. అంటే రోజుకు రూ.35 వేలు చొప్పున.. వారానికి రూ.2.5 లక్షలు దక్కినట్లు సమాచారం. ఇలా చూసుకుంటే మొత్తం 10 వారాలకు భోలేకి రూ.12 లక్షలపైనే రెమ్యూనరేషన్ దక్కి ఉంటుంది. మరి.. భోలే షావలీ ఎలిమినేషన్ ఫెయిరా? అన్ ఫెయిరా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş