Tirupathi Rao
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు ఛాలెంజులు జరుగుతున్నాయి. ఇప్పటిికే కొందరు కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. ఒక టాస్కులో పాల్గొన్న అశ్వినీకి చేదు అనుభవం ఎదురైంది. అంబటి అర్జున్ చేసిన పనికి హౌస్ మొత్తం నోరెళ్లబెట్టింది.
బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు ఛాలెంజులు జరుగుతున్నాయి. ఇప్పటిికే కొందరు కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. ఒక టాస్కులో పాల్గొన్న అశ్వినీకి చేదు అనుభవం ఎదురైంది. అంబటి అర్జున్ చేసిన పనికి హౌస్ మొత్తం నోరెళ్లబెట్టింది.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ మొత్తం కెప్టెన్సీ కంటెండర్ షిప్ కోసం పోరాటం చేస్తోంది. ఇప్పటికే హౌస్ లో ప్రియాంక, పల్లవి ప్రశాంత్ కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు. ఇంకా మరో ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్లు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన టాస్కులు కూడా పెట్టారు. మూడో టాస్కులో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. మూడో టాస్కులో అశ్వినీ శ్రీ, అర్జున్, సందీప్, భోలే పాల్గొన్నారు. ఈ టాస్కులో అశ్వినీ శ్రీకి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లో మూడో ఛాలెంజ్ కింద పోర్ ఇట్.. స్టోర్ ఇట్ అనే టాస్కు పెట్టారు. అందులో అర్జున్, భోలే, సందీప్, అశ్వినీ శ్రీ పాల్గొన్నారు. ఛాలెంజ్ లో హెల్మెట్ పైన ఒక స్పాంజ్ ఉంటుంది. ఈ నలుగురు షవర్ కింద నిల్చోని ఆ స్పాంజ్ ని తడిపి.. ఆ నీటిని ఒక ట్యాంక్ లో నింపాలి. అలా ఎవరు ఎక్కువ నీటిని సేకరిస్తే.. వాళ్లు గెలిచినట్లు. ఈ టాస్కులో అశ్వినీ శ్రీ ఒక్కతే అమ్మాయి కావడంతో అర్జున్, సందీప్, భోలేలతో పోటీ పడటం కాస్త కష్టమైంది. ఒకానొక సమయంలో అర్జున్ అశ్వినీని నెట్టేయడం స్టార్ట్ చేశాడు. మొదట అబ్బాయిలు మాత్రమే ఫిజికల్ అయినట్లు కనిపించింది.
తర్వాత అర్జున్.. అశ్వినీని కూడా నెట్టేశాడు. ఆమె అప్పుడు సందీప్ కి తగిలి వెళ్లి కింద నేల మీద పడింది. అది చూసిన హౌస్ మేట్స్ కూడా నోరుతెరిచారు. హౌస్ లో టాస్కులు, ఛాలెంజులు అంటే దెబ్బలు కచ్చితంగా తగులుతాయి. పైగా హౌస్ లో ఆడ, మగ అనే తేడా ఉండదు అని మొదటి నుంచి చెబుతూనే ఉంటారు. హోస్ట్ నాగార్జున కూడా ఆటలో తేడాలు ఉండవు అని చెబుతారు. నయనీ పావనీకి కూడా ఓసారి ఇలాగే ఏడుగురు అబ్బాయిలతో పోటీగా టాస్కు ఆడి ఎన్నో ప్రశంసలు పొందింది. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అబ్బాయి, అమ్మాయి అనే తేడా ఉండదు. కానీ, దెబ్బలు తగిలితే మాత్రం అమ్మాయిలు తట్టుకోవడం కష్టం, అలాగే అమ్మాయిలు కాస్త సున్నితంగా ఉంటారు. అందుకైనా కాస్త జాగ్రత్తగా ఆడితే బాగుండేది.
అర్జున్ ఫిజికల్ అవ్వడంపై సందీప్ కామెంట్స్ చేశాడు. ఫిజికల్ అవ్వడం ఎంతోసేపు పట్టదు. నన్ను కూడా మెడ పట్టుకుని చాలాసార్లు నెట్టాడు అని చెప్పుకొచ్చాడు. అయితే అర్జున్ కాస్త గ్రూపులకు దూరం జరిగి ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అమర్, శోభా, ప్రియాంకలతో అంత క్లోజ్ గా ఉంటున్నట్లు కనిపించడం లేదు. అలాగే శివాజీ టీమ్ తో కూడా కలవడం లేదు. కాస్తో కూస్తో గౌతమ్ తోనే క్లోజ్ గా కనిపిస్తున్నాడు. ఈ టాస్కులో భోలే తాను సేకరించిన నీటిని అశ్వినీకి.. అశ్వీని ఆ తర్వాత సందీప్ కి త్యాగం చేయడంతో సందీప్ ఈ టాస్కులో విజయం సాధించినట్లు తెలుస్తోంది. నాలుగో టాస్కులో గౌతమ్, ఐదో టాస్కులో శోభా శెట్టి విజయం సాధించినట్లు చెబుతున్నారు. మరి.. అశ్వినీని అర్జున్ అలా తోసేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.