iDreamPost
android-app
ios-app

పల్లవి ప్రశాంత్ గురించి యాంకర్ శివ చెప్పిన నిజాలు! మందు తాగుతూ బూతులు! 

  • Published Dec 20, 2023 | 3:36 PM Updated Updated Dec 20, 2023 | 3:36 PM

Anchor Shiva On Pallavi Prashanth: యాంకర్ శివ- పల్లవి ప్రశాంత్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంటర్వ్యూ ఇస్తానని పిలిచి మీడియాని బూతులు తిట్టాడంటూ యాంకర్ శివ చెబుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశాడు.

Anchor Shiva On Pallavi Prashanth: యాంకర్ శివ- పల్లవి ప్రశాంత్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇంటర్వ్యూ ఇస్తానని పిలిచి మీడియాని బూతులు తిట్టాడంటూ యాంకర్ శివ చెబుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశాడు.

  • Published Dec 20, 2023 | 3:36 PMUpdated Dec 20, 2023 | 3:36 PM
పల్లవి ప్రశాంత్ గురించి యాంకర్ శివ చెప్పిన నిజాలు! మందు తాగుతూ బూతులు! 

రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే ఆ ఆనందం కొన్ని గంటలు కూడా నిలవలేదు. అతని ఫ్యాన్స్ చేసిన ఓవరాక్షన్ వల్ల ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ మేట్స్ వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. అమర్ దీప్ అయితే ఫ్యామిలీతో వెళ్తూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లిన పరిస్థితి. అయితే కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. రైతుబిడ్డ కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగడం చూశాం. లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది అవుతుంది అంటే.. రైతుబిడ్డకు మీరు ఇచ్చే విలువ ఇదేనా అంటూ కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా యాంకర్ శివ కూడా ప్రశాంత్ గురించి సీరియస్ కామెంట్స్ చేశాడు. అందుకు సంబంధించి ప్రత్యేకంగా వీడియో చేసి.. దానిలో మరిన్ని విషయాలను పంచుకున్నాడు.

అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయంపై యాంకర్ శివ తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో కొన్ని స్టోరీస్ పోస్ట్ చేశాడు. అందులో పల్లవి ప్రశాంత్ తమకు ఇంటర్వ్యూ ఇస్తానని ఊరికి రామని పిలిచి.. ఇంటర్వ్యూ ఇవ్వను దెం**య్ అన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అందుకు సంబంధించి నెట్టింట పెద్ద యుద్ధమే జరుగుతోంది. అయితే అందరికీ ప్రత్యేకంగా సమాధానాలు చెప్పలేనంటూ యాంకర్ శివ ఒక వీడియో చేశాడు. అందులో అసలు ఆరోజు ఏం జరిగింది అనే విషయాలను వెల్లడించాడు. “నువ్వు రాత్రి 8 గంటలు 9 గంటల సమయంలో మమ్మల్ని కలిసి హగ్గులు ఇచ్చి అన్న ఊరికి రండి ఇంటర్వ్యూ ఇస్తాను అంటే మేము మీ ఊరు వచ్చాం. అంతేగానీ నీ వీడియో కోసం మేము ఎగబడుతూ రాలేదు. నువ్వు రామన్నావు అనడానికి నేను వీడియో కూడా పెట్టాను.  ఇక్కడ మంచిగా మాట్లాడి ఊరికి వచ్చాక నీ బిహేవియర్ మారిపోయింది.

ఆ రోజు ఆ సమయంలో.. మా కోసం ఏం చేస్తారు? మా పొలం దగ్గరికి రండి.. మా పొలాన్ని చూపించండి అంటూ చెప్పావ్. నువ్వు అర్ధరాత్రి 2 గంటలకు పొలంలో పని చేస్తావా? అర్ధరాత్రి లైట్లు వేసి మీ పొలాన్ని చూపించాలా? రాత్రి చలిలో దోమలు కుట్టుకుంటా మేము మీ ఇంటి బయట పడిగాపులు కాస్తుంటే నీకు మేం గుర్తురాలేదు. నీకు వీడియోలు ఇవ్వడానికి ఓపిక లేదు గానీ.. పైన రూములో కూర్చుని మందు తాగడానికి మాత్రం ఓపిక ఉంది. రైతుబిడ్డ అనే చెప్పుకునే నువ్వు ఇలాగేనా ప్రవర్తించేది” అంటూ యాంకర్ శివ సీరియస్ అయ్యాడు. అంతేకాకుండా మీడియాని బూతులు తిట్టిన విషయాన్ని కూడా యాంకర్ శివ మరోసారి ప్రస్తావించాడు. తమకు వీడియో ఇస్తానని పిలిచి.. దెం***య్ అంటూ బూతులు తిట్టిన విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. అందుకు సంబంధించిన పూర్తి వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియో కింద నెటిజన్స్ కూడా పల్లవి ప్రశాంత్ తీరును తప్పుబడుతున్నారు. అతను ప్రవర్తించిన తీరు చాలా తప్పు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet