iDreamPost
android-app
ios-app

ఆ రాత్రి పల్లవి ప్రశాంత్ ఓవర్ యాక్షన్.. ప్రత్యక్ష సాక్షి చెప్పిన షాకింగ్ నిజాలు!

  • Published Dec 20, 2023 | 5:31 PM Updated Updated Dec 20, 2023 | 5:31 PM

Witness Comments On Pallavi Prashanth Issue: యాంకర్ శివ- పల్లవి ప్రశాంత్ మధ్య వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు అయ్యింది. శివ ఆరోజు రాత్రి ప్రశాంత్ ప్రవర్తనను ప్రత్యక్షంగా చూసిందే ఇతనే అంటూ వీడియో రిలీజ్ చేశాడు.

Witness Comments On Pallavi Prashanth Issue: యాంకర్ శివ- పల్లవి ప్రశాంత్ మధ్య వివాదం ఒక కొలిక్కి వచ్చినట్లు అయ్యింది. శివ ఆరోజు రాత్రి ప్రశాంత్ ప్రవర్తనను ప్రత్యక్షంగా చూసిందే ఇతనే అంటూ వీడియో రిలీజ్ చేశాడు.

  • Published Dec 20, 2023 | 5:31 PMUpdated Dec 20, 2023 | 5:31 PM
ఆ రాత్రి పల్లవి ప్రశాంత్ ఓవర్ యాక్షన్.. ప్రత్యక్ష సాక్షి చెప్పిన షాకింగ్ నిజాలు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ గా నిలిచిన రైతుబిడ్డ కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల్లో విశ్వాసాన్ని కోల్పోయాడు. అతని అభిమానులు మాత్రమే కాకుండా అతని ప్రవర్తనపై కూడా పలు విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యాంకర్ శివ- పల్లవి ప్రశాంత్ మధ్య కూడా ఒక గొడవ నడుస్తూ ఉంది. ఇంటర్వ్యూ ఇస్తాను ఊరికి రండి అని చెప్పి తీరా ఇంటికి వెళ్లాక మొఖం చాటేయడంపై యాంకర్ శివ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా మీడియాని బూతులు తిట్టాడు అంటూ తన ఇన్ స్టా పేజ్ లో స్టోరీలు కూడా పెట్టాడు. అందుకు సంబంధిచిన అసలు నిజాలను ఒక వీడియోగా చేశాడు. అందులోనే ప్రత్యక్ష సాక్షి అంటూ ఒక కుర్రాడితో కూడా జరిగిన విషయాలను చెప్పించాడు.

యాంకర్ శివ రెండ్రోజుల నుంచి ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ ఆట, మాట, ప్రవర్తన గురించి కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. అయితే అతను ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఎలాంటి బాధ లేదని.. కానీ, అతను మీడియాను దెం***మను అంటూ బూతులు తిట్టడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చాడు. ఆ మాట చెప్పడంతో అందరూ సోషల్ మీడియాలో యాంకర్ శివపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రైతుబిడ్డ నిజంగానే అలా మాట్లాడాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అందుకు తాను తాజాగా చేసిన వీడియోలో అసలు జరిగింది ఇది అంటూ చెప్పడం మాత్రమే కాకుండా.. ఆ రోజు పల్లవి ప్రశాంత్ బూతులు తిట్టిన విషయాన్ని చూసింది ఇతనే అంటూ ఒక యువకుడిని చూపించాడు.

“నువ్వు ఇప్పుడు నిజం చెప్పినా వాళ్లు అబద్ధం అనే అనుకుంటారు. నీకు ఇష్టమైన దైవుడు ఎవరు? ఆయన మీద ప్రమాణం చేసి.. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో చెప్పు” అంటూ యాంకర్ శివ అడిగాడు. ఆ కుర్రాడు మాట్లాడుతూ.. “ప్రామిస్ గా చెప్తున్నాను. ఆ అబ్బాయి లోపలికి వెళ్లాడు. అతని వెనుకే నేను లోపలికి వెళ్లాను. అప్పుడు ప్రశాంత్ కింద కూర్చుని ఉన్నాడు. ఈ అబ్బాయి వెళ్లి అతని పక్కన కూర్చున్నాడు. అన్నా ఇంటర్వ్యూ అని అడుగుతున్నారు అన్నాడు. అందుకు ప్రశాంత్ ఇప్పుడు ఏం ఇంటర్వ్యూరా అని అన్నాడు. ఇప్పుడు కాదన్నా రేపు మధ్యాహ్నం గానీ, సాయంత్రం గానీ అంటున్నారు అన్నాడు. హేయ్ ఇంటర్వ్యూ లేదు ఏం లేదు దెం**మను అని అన్నాడు. నేను వచ్చి ఆ విషయం చెప్పిన తర్వాత మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం” అంటూ ఆ కుర్రాడు తాను ఇలా చూశాను అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇవ్వకపోగా మీడియాని బూతులు తిట్టాడు అంటూ యాంకర్ శివ చెప్పిన కామెంట్స్ కి సాక్షంగా అతని దగ్గర పనిచేసే కుర్రాడితో నిజం చెప్పించాడు. ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత నెటింజన్స్ కూడా పల్లవి ప్రశాంత్ కు నెగిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు. ప్రశాంత్ అలా ప్రవర్తించడం సరికాదని వారిస్తున్నారు. వీడియో ఇస్తాను అని చెప్పి ఊరు తీసుకెళ్లి ఇలా అవమానించడం సరికాదంటూ సూచిస్తున్నారు. ఈ అల్లర్ల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే తాను ఇంటి దగ్గరే ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేశాడు. మరి.. యాంకర్ శివ- ప్రశాంత్ గొడవలో ప్రత్యక్ష సాక్షి చెప్పిన నిజాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet