iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: శివాజీ డబుల్ గేమ్ కి చెక్ పడబోతోందా?

Bigg Boss 7 Telugu: శివాజీ డబుల్ గేమ్ కి చెక్ పడబోతోందా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. ఉల్టా పుల్టాలో మంచి కిక్ ఇచ్చే 2.0 గేమ్ స్టార్ట్ చేశారు. వైల్డ్ కార్డ్స్ రూపంలో ఐదుగురు సభ్యులను హౌస్ లోకి పంపారు. వారిలో ఇప్పుడు అందరి దృష్టి అంబటి అర్జున్ మీదే ఉంది. ఎందుకంటే హౌస్ లో కాస్త ఎనర్జీ, ఎంటర్ టైన్మెంట్, తగ్గిందనే చెప్పాలి. అందుకే వాటిని అర్జున్ భర్తీ చేయగలడు అంటూ ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. అర్జున్ ఒక మంచి డాన్సర్, హ్యూమర్ కలిగిన వ్యక్తి, స్పాట్ లో నాన్ స్టాప్ జోకులు వేయగలడు, కౌంటర్లు ఇవ్వగలడు. పైగా బయట ఉండి గేమ్ ని చాలా బాగా అర్థం చేసుకున్న హౌస్ మేట్ లా కనిపించాడు. అంతేకాకుండా అర్జున్ రూపంలో శివాజీకి పెద్ద కష్టం వచ్చిందనే చెప్పాలి.

అంబటి అర్జున్ మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో రావడమే కాకుండా.. హౌస్ లో ఉన్న వాళ్ల గురించి కూడా చాలా మంచి క్లారిటీతో వచ్చాడు. ముఖ్యంగా అమర్ దీప్, శివాజీల గురించి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. స్టేజ్ మీద దమ్ము- దుమ్ము ప్లేయర్ల పేర్లు చెప్పండి అన్నప్పుడు దమ్మున్న ఆటగాళ్ల లిస్టులో యావర్, ప్రశాంత్ పేర్లు చెప్పాడు. దుమ్ముగా ఆడుతున్న ప్లేయర్లలో అమర్- సందీప్ పేర్లు చెప్పాడు. వీళ్ల ఆట అస్సలు బాలేదు అనే కోణంలో కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా అమర్ దీప్ ఆట మరీ ఊహించని విధంగా సాగుతోందన్నాడు. మాట్లాడాల్సిన దగ్గర అసలు పాయింట్ లేకుండా మాట్లాడుతున్నాడు అంటూ కామెంట్ చేశాడు. అయితే అందరూ ఇక్కడి వరకే ఆలోచిస్తున్నారు.

కొత్తగా వచ్చిన వారిలో అంబటి అర్జున్ ఒక క్లియర్ టార్గెట్ తో హౌస్ లోకి వచ్చాడు. అతని టార్గెట్ శివాజీ అనే చెప్పాలి. స్టేజ్ మీద ఉన్నప్పుడే ఇన్ డైరెక్ట్ గా శివాజీని టార్గెట్ చేయబోతున్నాను అన్నట్లు కామెంట్స్ చేశాడు. ఎందుకంటే నాగార్జున దగ్గర శివాజీ ప్రస్తావన వచ్చినప్పుడు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయనకు టూ ఫెసెస్ ఉన్న విషయాన్ని అర్జున్ స్పష్టం చేశాడు. ఆయన చాలా విషయాలను చెబుతున్నారు, అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు. కానీ, ఎక్కడ దొరక్కుండా మాట్లాడుతున్నారు. ఆయన ఎక్స్ పీరియన్స్ వల్ల చాలా న్యాక్ గా మాట్లాడుతున్నారు.. అంటూ కామెంట్ చేశాడు. అంటే శివాజీ డబుల్ గేమ్ ఆడుతున్నాడు కానీ, దొరక్కుండా జాగ్రత్త పడుతున్నట్లు క్లియర్ గా చెప్పాడు. అంటే హౌస్ లో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్, ఎవరు కన్నింగ్ అనే విషయంపై అర్జున్ కు ఫుల్ క్లారిటీ ఉంది.

అతని ఆట కూడా అంతే ఆసక్తిగా సాగబోతోంది అని చెబుతోంది. అందుకే అర్జున్ శివాజీని టార్గెట్ చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అతడిని ఎదిరించే పనైతే సందీప్, అమర్ సహా సీరియల్ బ్యాచ్ మొత్తం అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తారు. అలాగే వైల్డ్ కార్డుగా వచ్చిన అర్జున్ వైల్డ్ గా గేమ్ ఆడినవాడు కూడా అవుతాడు. మరి.. ఆ అవకాశాన్ని అర్జున్ సద్వినియోగం చేసుకుంటాడా? అందరితో కలిసిపోయి సోసోగా ఆడతాడా? అనేది తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. కానీ, అర్జున్ కాన్ఫిడెన్స్ చూస్తే మాత్రం పక్కా ప్లాన్ తోనే వచ్చినట్లు ఉన్నాడు. అర్జున్ కు శివాజీ డబుల్ గేమ్ పై క్లారిటీ ఉంది కాబట్టి. సందర్భం చూసి రివీల్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. అంబటి అర్జున్ వైల్డ్ కార్డుగా రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.