Tirupathi Rao
బిగ్ బాస్ హౌస్ లో ఆటలు ఎలా అయితే ఉంటాయో.. వాటికి ఎత్తులు, పైఎత్తులు కూడా అలాగే ఉంటాయి. అయితే ఎన్ని ఎత్తువు వేసినా, స్ట్రాటజీలు ప్లే చేసినా కూడా అవి ఆకట్టుకునేలా ఉండాలి. కన్నింగ్ అనిపించుకునేలా ఉండకూడదు. ఇప్పుడు అలాంటి ఒక ఆటతో అర్జున్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
బిగ్ బాస్ హౌస్ లో ఆటలు ఎలా అయితే ఉంటాయో.. వాటికి ఎత్తులు, పైఎత్తులు కూడా అలాగే ఉంటాయి. అయితే ఎన్ని ఎత్తువు వేసినా, స్ట్రాటజీలు ప్లే చేసినా కూడా అవి ఆకట్టుకునేలా ఉండాలి. కన్నింగ్ అనిపించుకునేలా ఉండకూడదు. ఇప్పుడు అలాంటి ఒక ఆటతో అర్జున్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఉల్టా పుల్టాగా ఆట సాగుతూనే ఉంది. అలాగే కంటెస్టెంట్స్ కూడా అంతా ఉల్టా పుల్టా చేద్దామని చూస్తున్నట్లు ఉన్నారు. చుట్టూ కెమెరాలు ఉన్నా కూడా యధేచ్ఛగా అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఆ తర్వాత ఆ వీడియో స్టేజ్ మీద చూపిస్తారు అనే భయం కూడా ఉడటం లేదు. ఈసారి అర్జున్ అలాంటి ఒక పచ్చి అబద్ధాన్ని చెప్పి అడ్డంగా బుక్ అయ్యాడు. అప్పటికి అప్పుడే మాట మార్చేసి ప్రేక్షకుల ముందు దోషిగా మారాడు. నిజానికి హౌస్ లో ఇలాంటి తప్పులు అస్సలు చేయకూడదు. ఎందుకటే అలాంటి వాటివల్ల క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వైల్డ్ కార్డుగా హౌస్ లోకి వచ్చిన ఐదుగురిలో కేవలం అర్జున్ కి మాత్రమే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతోంది. ఒక పాజిటివ్ టాక్ తో అర్జున్ దూసుకుపోతున్నాడు. అభిమానులు కూడా అర్జున్ కు బాగా పెరిగిపోతున్నారు. అదే సమయంలో అర్జున్ తీసుకుంటున్న నిర్ణయాలు, మాట్లాడుతున్న మాటలతో అతనికే ఎక్కువ డ్యామేజ్ జరుగుతోంది. తాజాగా చేసిన పనితో ఏకంగా అర్జున్ ది కన్నింగ్ గేమ్ అనే ముద్ర పడింది. గతంలో కూడా పల్లవి ప్రశాంత్ విషయంలో గౌతమ్ దగ్గర అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఎంత నెగిటివ్ అయ్యాయో చూశాం. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ నెగిటివ్ అయ్యేలా అర్జున్ ప్రవర్తించాడు.
ఫ్లోట్ ఆర్ సింక్ టాస్కులో అమర్- తేజకి టై బ్రేకర్ పడింది. ఆ సమయంలో అమర్ కి ఒక పాయింట్, తేజాకి 2 పాయింట్లు వచ్చాయి. అయితే అర్జున్ వెళ్లి సంచాలక్ గౌతమ్ తో తేజాకి శివాజీ ఏదై సైగ చేశాడు అని చెప్పాడు. అది విన్న గౌతమ్ కెప్టెన్ ఇలా చెప్పాడు నేను మరోసారి ఛాలెంజ్ పెట్టనా అని అడిగాడు. బజర్ మోగిస్తే నేను టాస్క్ పెడతాను అన్నాడు. ఎప్పటిలాగానే బిగ్ బాస్ రిజల్ట్ ఏంటో చెప్పండి అన్నాడు. అప్పుడు గౌతమ్ అమర్ దీప్ ఓడిపోయాడు, తేజ గెలిచాడు అని చెప్పాడు. అయితే తేజ- శివాజీ డిస్కషన్ చేస్తున్న సమయంలో అర్జున్ ని అడిగాడు.. నేను సైగ చేశాను అని చెప్పావా అని. లేదు వాడు అటు ఇటూ చూస్తున్నాడు అని చెప్పాను అంటూ కామెంట్స్ చేశాడు. అక్కడికక్కడే మాట మార్చడంతో ఆడియన్స్ లో అర్జున్ మీద నెగిటివ్ అభిప్రాయం క్రియేట్ అయ్యింది.
అర్జున్ కన్నింగ్, డబుల్ గేమ్ ఆడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అర్జున్ అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అతనికి సైగ చేశాడు అని పిస్తే.. అదే మాట నిలబడి ఉండాల్సింది. ఏదో అలా అనిపించింది అనుకునే వాళ్లు. కానీ, ముందు మాట చెప్పి.. చెప్పలేదు అనడం మాత్రం చాలా పెద్ద నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. మరి.. వీకెండ్ లో నాగార్జున ఈ వీడియో ప్లే చూపిస్తారా అనేది చూడాలి. వైల్డ్ కార్డుగా వచ్చిన అర్జున్ టైటిల్ ఫేవరెట్ గా టాక్ వస్తోంది. ఇలాంటి సమయంలో ఇలాంటి గేమ్ తో లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటున్నాడు. మరి.. అంబటి అర్జున్ కన్నింగ్ గేమ్ ఆడాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.