iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ భారీ స్కెచ్.. హౌస్ లోకి అబ్బాస్, అల్లరి నరేష్ హీరోయిన్?

  • Author Soma Sekhar Published - 07:52 AM, Fri - 25 August 23
  • Author Soma Sekhar Published - 07:52 AM, Fri - 25 August 23
బిగ్ బాస్ భారీ స్కెచ్.. హౌస్ లోకి అబ్బాస్, అల్లరి నరేష్ హీరోయిన్?

బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఎంటర్ టైన్ చేసిన షోలలో బిగ్ బాస్ ఒకటి. వరుసగా ఐదు సీజన్లు మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్లిన ఈ షో.. ఆరవ సీజన్ మాత్రం ఘోరంగా విఫలం అయ్యింది. దీంతో ఏడవ సీజన్ లో గత సీజన్ లో జరిగిన తప్పులు జరగకుండా బిగ్ బాస్ పక్కా ప్రణాళికలు వేస్తున్నాడు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలు కూడా ఈసారి షోపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఇక బిగ్ బాస్ 7 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండటంతో.. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కాగా.. ఇప్పటి వరకు తెరపైకి వచ్చిన కంటెస్టెంట్ లే కాకుండా ఎవరూ ఊహించని ఇద్దరు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఒకప్పటి స్టార్ హీరోతో పాటు, హీరోయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. వారు ఎవరో కాదు.. ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్, సీమశాస్త్రి హీరోయిన్ ఫర్జానా.

బిగ్ బాస్ 7.. సెప్టెంబర్ 3న గ్రాండ్ గా షోను ప్రారంభించేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాగా.. గత సీజన్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దాంతో ఈ సీజన్ లో అలా జరగకుండా మాస్టర్ ప్లాన్ తో బరిలోకి దిగుతున్నాడు బిగ్ బాస్. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ ఎంపికలో జాగ్రత్తలు వహిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఎంపిక చేసిన కంటెస్టెంట్స్ లో చాలా మంది ప్రేక్షకులకు తెలిసినవారేనని సమాచారం. ఈ క్రమంలోనే బిగ్ బాస్ 7 హౌస్ లోకి ఎవరూ ఊహించని ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చజరుగుతోంది.

వారిలో ఒకరు ఒకప్పటి స్టార్ హీరో అబ్బాస్ కాగా.. మరోకరు సీమశాస్త్రి హీరోయిన్. వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నట్లు సమాచారం. అబ్బాస్ ‘ప్రేమదేశం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల పరిచయం అయ్యి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు మాత్రమే చేసి.. ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. నటనకు గుడ్ బై చెప్పి కుటుంబంతో సహా న్యూజిలాండ్ కు వెళ్లాడు. కాగా.. ఈ మధ్యనే ఇండియాకు తిరిగివచ్చాడు అబ్బాస్. సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని పలు ఇంటర్వ్యల్లో కూడా చెప్పుకొచ్చాడు. అందులో భాగంగానే అబ్బాస్ బిగ్ బాస్ హౌస్ కు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక హీరోయిన్ ఫర్జానా ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరసగా అల్లరి నరేష్ తో సీమ శాస్త్రి, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ సినిమాలు చేసి మెప్పించింది. అయితే 2009 తర్వాత నుంచి టాలీవుడ్ ను కనుమరుగైంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో తో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాని భావిస్తోందట ఈ ముద్దుగుమ్మ. అదీకాక ఫర్జానాలో ఉన్న మరో టాలెంట్ ఏంటి అంటే? డ్యాన్స్. ఆమె బాలీవుడ్ లో పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కు కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేసింది. దీంతో వీరిద్దరి ఎంట్రీ బిగ్ బాస్ లోకి దాదాపు ఖాయం అయినట్లే అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి అబ్బాస్, ఫర్జానా బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఎలా ఉంటుందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.

ఇదికూడా చదవండి: RC16 కోసం పాన్ ఇండియా స్టార్స్.. బుచ్చిబాబు పెద్ద ప్లానే..!

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbenjaminsbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş